-
కోదండరామ్‌ది ఫ్యూడల్ స్వభావం
⇒ టీజేఏసీ నేతలు రవీందర్, ప్రహ్లాద్, సుల్తానా విమర్శలు ⇒ ఆయన ఒక్కడి వల్లే జేఏసీకి ఇంత పేరు రాలేదు ⇒ టీజేఏసీ నుంచి తప్పుకొన్నాకే పార్టీ గురించి మాట్లాడాలంటూ లేఖ సాక్షి, హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నపుడు టీజేఏసీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగాక ఆ విషయా లను ప్రస్తావించాలని కోదండరామ్‌కు టీజేఏసీ నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, తన్వీర్ సుల్తానా సూచించారు. ఆమ్ ఆద్మీ తరహాలో రాష్ట్రంలో ఒక పార్టీ అవసరమని కోదండరామ్ అంటున్నారని.. ఇలా మాట్లా డటం టీజేఏసీ నిర్ణయాలకు విరుద్ధమని అన్నారు. ఈ మేరకు వారు బుధవారం కోదం డరామ్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని హైదరాబాద్‌లో మీడియాకు విడుదల చేసి, మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాల మేరకు, సామాజిక సమన్యాయ సాధన దిశగా కృషి చేస్తామని టీజేఏసీ విస్తృతస్థాయి సమా వేశంలో ప్రకటించి ఏడాది గడిచినా ఒక్కసారీ ఆ కార్యాచరణపై చర్చించలేదని వారన్నారు. ఆయా అంశాలపై టీజేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలోచర్చించి తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీజేఏసీ రాజకీయ పార్టీగా మారదు టీజేఏసీ ప్రజా సంఘంగానే ఉంటుందని, రాజకీయ పార్టీగా మారదని.. దీనిపై గతంలో తీర్మానం కూడా చేశారని నేతలు గుర్తు చేశా రు. జేఏసీలో రాజకీయ పార్టీలను చేర్చుకోమని, రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయమని కూడా నిర్ణయించామని పేర్కొ న్నారు. కానీ కోదండ రామ్ చేస్తున్న ప్రకటన లు, ఉపన్యా సాలు, అభిప్రాయాలు అందు కు విరుద్ధంగా ఉంటు న్నాయని వ్యాఖ్యానిం చారు. సమష్టి కృషి, అనేక త్యాగాలు చేసిన ఫలితంగా టీ జేఏసీ పట్ల తెలంగాణ సమా జంలో విశ్వాసం వ్యక్తమవుతోందని, అది కోదండరామ్ ఒక్కరి వల్ల వచ్చింది కాదన్నారు. కోదండరామ్ పొందుతున్న కీర్తి అంతా ఆయనను తాము చైర్మన్‌గా ఆమోదించడం వల్ల వచ్చిందేనన్న వాస్తవాన్ని గుర్తించడం లేదన్నారు. కోదండరామ్ వల్లే అందరికీ గుర్తింపు వస్తోందన్న ధోరణి ఆయనలో దాగిఉన్న ఫ్యూడల్ స్వభావానికి నిదర్శనమని విమర్శించారు. తమలాగా కోదండ రామ్‌కు త్యాగాల చరిత్ర లేదని.. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన ఒక్క త్యాగ మేదైనా ఉందా అని ప్రశ్నించారు. అనేక మంది ఆత్మబలిదానాల ఫలితాన్ని, అనేక మంది ఆలోచనలు, ఆచరణ నిబద్ధతలను కోదండరామ్ తన ఒక్కడి ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. టీజేఏసీ నాయకత్వంలో రెండో పేరు ప్రస్తావనలో లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. దళిత, బహుజనులంటే బానిసలన్న భావన, మహిళలంటే గౌరవం లేకుండా కోదండరామ్ వ్యవహరిస్తున్నా రని... అందరూ తన కోసమే పనిచేయాలన్న, తన ఆదేశాలనే పాటించాలన్న ‘థాట్ పోలీసింగ్’ విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. -
పోలవరం ఆర్డినెన్స్ రద్దుకు 10న టీజేఏసీ ధర్నా
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని, ఆ మండలాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద ధర్నా చేయనున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించింది. జేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ముఖ్యనేతలు హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం లక్ష్మయ్య సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, మణిపాల్‌రెడ్డి, పిట్టల రవీందర్, రంగరాజు తదితరులు విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ఆదివాసీలను ముంచేయడం సరికాదన్నారు. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్సును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. 10 వ తేదీన జరిగే ధర్నాలో అన్ని రాజకీయపార్టీలు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా ఆదివాసీ జేఏసీ ఈ నెల 14న ఢిల్లీలో తలపెట్టిన నిరసన దీక్షలోనూ జేఏసీ పాల్గొంటుందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన సమయంలో స్థానికతను ఆధారంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వారు హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement