-
రవితేజ సినిమాలో ఛాన్స్ మిస్!
-
‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్, పూజాహెగ్డేల బార్బిడాల్ డ్యాన్స్ పోజుతో రిలీజ్ చేసిన ఈ మొదటి లుక్ లవ్లీగా ఉందని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమెద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ పార్ట్‌ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభించాలనుకుంటున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జీ, మురళీ శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సందీప్. -
ప్యారిస్‌లో సామజవరగమన
‘అల.. వైకుంఠపురమలో..’ చిత్రంలోని ‘సామజవరగమన....’ పాట శ్రోతలను, సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తమన్ స్వరకర్త. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ ప్యారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో జరుగుతోంది. ఈ పాట చిత్రీకరణ కోసం వారం రోజులు చిత్రబృందం ప్యారిస్‌లో ఉంటుంది. ఈ పాటతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మినహా షూటింగ్ పూర్తయినట్లేనట. ఈ నెలాఖరుకల్లా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ‘అల.. వైకుంఠపురమలో..’ జనవరి 12న విడుదల కానుంది. -
సాహోలో స్వీటీ లేనట్టే!
తమిళసినిమా: సాహో చిత్రంలో నటి అనుష్క లేనట్లేనా? అవుననే అంటున్నారు సినీ వర్గాలు. బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచ స్థాయి ప్రాచుర్యాన్ని పొందిన జంట ప్రభాస్, అనుష్క. అంతకు ముందు కూడా బిల్లా, మిర్చి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీరిపై వ్యక్తిగతంగానూ చాలానే ప్రచారం జరిగింది. ఆ విషయాలను పక్కన పెడితే బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాష్ సాహో అనే చిత్రానికి రెడీ అయ్యారు. బాహుబలి–2 చిత్ర అమోఘ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న సాహో చిత్ర మెయిన్ పార్టు చిత్రీకరణను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో ప్రభాస్‌తో రొమాన్స్ చేసే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు స్పష్టం చేయలేదు. అయితే మళ్లీ అనుష్కనే ప్రభాస్‌తో జత కట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది.అలాంటిది తాజాగా సోహో చిత్రంలో నటించడానికి అనుష్క అంగీకరించలేదనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అందుకు కారణం తను ఇంతకు ముందే అంగీకరించిన చిత్రాలతో బిజీగా ఉండడంతో సాహో చిత్రానికి కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి అనే ప్రచారం జరగుతోంది. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్ బ్యూటీని కథానాయకిగా ఎంపిక చేసే ప్రయత్నంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు సమాచారం. కాగా బాలీవుడ్ భామ పూజాహెగ్డేకు సాహోలో ప్రభాష్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.ఈ ఉత్తరాది బ్యూటీకిప్పుడు టాలీవుడ్లో టైమ్ బాగానే ఉంది.అల్లుఅర్జున్‌తో నటించిన దువ్వాడ జగన్నాథం మంచి విజయాన్నే అందించింది భామకు. దీంతో సాహో చిత్ర యూనిట్ పూజాహెగ్డేను ఎంపిక చేసే విషయం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement