-
పకడ్బందీగా సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం పాఠ్యాంశాల రూపకల్పనపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలు, ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) చర్యలు చేపట్టింది. పాఠ్యాంశాలపై రూపకల్పనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలివే.. – ఎస్సీఈఆర్టీ అధికారుల బృందం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న ఆంగ్ల మాధ్యమ ప్రణాళికలు, పాఠ్యాంశాలను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర విద్యార్థులకు అవసరమైన రీతిలో పాఠ్యాంశాలకు రూపకల్పన చేస్తోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో 180 మంది నిపుణులు విద్యావేత్తలు పాల్గొంటున్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో అనుభవమున్న నిపుణులు, ప్రొఫెసర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఢిల్లీ, మద్రాస్, అంబేడ్కర్, అన్నా, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలు, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ (ఆర్ఐఈ)– బెంగళూరు, నవోదయ విద్యాలయ సంఘటన్‌తోపాటు పలు ఎడ్యుకేషన్ ఫౌండేషన్ల ప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు. – యూకే, యూఎస్ఏ, సింగపూర్, శ్రీలంక, చైనా తదితర దేశాల్లోని ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను తెప్పించి ఇక్కడి నిపుణులతో ప్రభుత్వం పరిశీలింపచేస్తోంది. అక్కడి మంచి అంశాలను కూడా చొప్పించి రాష్ట్ర సిలబస్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సమాయత్తమవుతోంది. – ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా అనుగుణంగా ఉండేలా పాఠ్యాంశాలపై దృష్టి పెడుతున్నారు. పిల్లల చదువులపై దృష్టిపెట్టలేని నిరుపేదలు, కూలి చేసుకుని జీవించే కుటుంబాల్లోని విద్యార్థులకు అనువైన రీతిలో వీటిని సిద్ధం చేస్తున్నారు. – తెలుగు సబ్జెక్టు పాఠ్యాంశాలు కూడా ఉన్నతంగా ఉండేలా మార్పులు చేపట్టారు. 1 నుంచి 6వ తరగతి వరకు 68 మంది ప్రముఖ కవులు, కథకుల రచనల్లోని అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మాండలికాలకు సమ ప్రాధాన్యమిస్తున్నారు. కథలు, కవితలు, సంభాషణలు, పద్యాలు.. ఇలా తెలుగుకు సంబంధించి అన్ని అంశాలపై విద్యార్థులకు మరింత శ్రద్ధ పెరిగేలా చర్యలు చేపడుతున్నారు. దేశీ, విదేశీ కలబోతతో సిలబస్ ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ దేశీ, విదేశీ కలబోతతో సిలబస్‌ను రూపొందిస్తున్నాం. ఎవరైనా సిలబస్‌ను మార్చాలనుకుంటే మన రాష్ట్రం వైపు చూసేలా చర్యలు చేపడుతున్నాం. యూకే, చైనా, సింగపూర్, శ్రీలంక, అమెరికా పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయిస్తున్నాం. అక్కడి మంచి విధానాలను తీసుకుంటాం. మన పిల్లలు వెనుకపడకుండా, అదే సమయంలో హైస్టాండర్డ్స్ లేకుండా సిలబస్‌ను సరళీకరిస్తున్నాం. -
ప్రభుత్వంలో ముగ్గురు నయీంలు
తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వెల్దుర్తి(మెదక్): గ్యాంగ్‌స్టర్ నయీంను మించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ ముగ్గురు డాన్లుగా మారారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పరోక్షంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. శనివారం మాసాయిపేటలో మండలం కోసం దీక్షలు చేస్తున్న శిబిరం వద్దకు ఆయన వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సునితాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత నియోజకవర్గంలో అధికారుల వేధింపులకు ఎస్ఐ బలికావడం దారుణమని ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. మంత్రి హరీశ్‌రావు మాఫియాగా మారి ప్రతిశాఖలో కమిషన్లు దండుకుంటూ రూ. కోట్లు పోగుచేసి భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాలను, నియోజకవర్గాలు, మండలాలు ఏర్పాటు చేయాల్సింది పోయి స్వలాభం కోసం 24 ముక్కలుగా చేస్తున్నారన్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్‌జెట్‌కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement