-
Azadi Ka Amrit Mahotsav: జెండా ఎగరేస్తున్నారా.. ఇవీ గుర్తుంచుకోండి
మన జాతీయ జెండా.. కోట్లాది మంది భారతీయులు మది మదిలో నింపుకున్న సగర్వ పతాక. ఈ జాతీయ జెండా ఎగురవేయడానికి కొన్ని నిబంధనలున్నాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో నిబంధనలు రూపొందించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 కూడా ఏమేం చేయకూడదో చెబుతోంది. ► 2002, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పారాగ్రాఫ్ 2.2 ప్రకారం ఎవరైనా వ్యక్తి, ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజుల్లో జాతీయ జెండా ఎగురవేయొచ్చు. ఇటీవల పగలు, రాత్రి కూడా జెండా ఎగరవేయొచ్చంటూ నిబంధనలు సవరించారు. ► జాతీయ జెండా చిన్నదైనా, పెద్దదైనప్పటికీ పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాలి. జెండా దీర్ఘ చతురస్రంలోనే ఉండాలి. ► జెండాలో కాషాయం రంగు పైకి ఉండేలా ఎగురవేయాలి. ► చేతితో లేదా మిషన్‌పై చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ.. ఇలా వేటితోనైనా జెండాను రూపొందించవచ్చు. ► చిరిగిపోయిన, నలిగిపోయిన లేదంటే చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయకూడదు. ► జాతీయ జెండాయే ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మరే ఇతర దేశాల జెండాలు కానీ, ఇతర వస్తువులు కానీ జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు. ► జాతీయ జెండా ఎగురవేసిన స్తంభాలపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు. ► జాతీయ జెండాని ఒక డెకరేటివ్ పీస్‌గా వాడకూడదు. యూనిఫామ్ దుస్తుల్లా వేసుకోకూడదు. ఏ డ్రెస్ మెటీరియల్ మీద కూడా ప్రింట్ చేయకూడదు. నడుముకి కింద భాగంలో ధరించకూడదు. ► జాతీయ జెండా నేలపైన కానీ, నీళ్లల్లో కానీ పడేయకూడదు ► రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలపైన మాత్రమే జాతీయ జెండా ఉంటుంది. సొంత వాహనాలపై దానిని వాడకూడదు ► జాతీయ జెండాని మాటల ద్వారా లేదంటే చేతల ద్వారా ఎవరైనా అగౌరవపరిస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971లోని సెక్షన్ 2 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రైడ్ ఇండియావి అక్రమ విల్లాలు
- కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్మించినట్లు హెచ్ఎండీఏ చెబుతోంది - హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక.. విచారణ 20కి వాయిదా సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతల గుట్టపై ప్రైడ్ ఇండియా సంస్థ నిర్మించిన విల్లాలన్నీ హెచ్ఎండీఏ అధికారుల ప్రకారం న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మించినవేనని హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తమ నుంచి అను మతులు తీసుకోకుండానే వీటిని నిర్మించి నట్లు హెచ్ఎండీఏ అధికారులు నిర్థారిం చారని ఆయన కోర్టుకు వివరించారు. దేవ తలగుట్టపై ప్రైడ్ ఇండియా నిర్మాణాలపై పూర్తి వివరాలతో తన నివేదికను ఆయన కోర్టు ముందుంచారు. ఈ నివేదికను కేసులో ప్రతివాదులుగా ఉన్న పలువురు వ్యక్తులకు అందజేసేందుకు వీలుగా న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగ నాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్త ర్వులు జారీ చేసింది. దేవ తలగుట్టపై ఉన్న వీరభద్ర స్వామి, ఇతర దేవాలయా లను కూల్చివేయడమే కాక 150 ఎకరాల ప్రభుత్వ భూమి లో ప్రైడ్ ఇండియా బిల్డర్స్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోందని, దీనిపై అ«ధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాంరామ్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిజానిజాలను తేల్చే బాధ్య తలను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డికి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన దేవతలగుట్టను సందర్శించి పూర్తిస్థాయి నివేదికను ధర్మా సనం ముందుంచారు. ఈ నివేదికపై అభ్యంతరాలను తెలిపేందుకు వీలుగా నివేదిక కాపీలను వ్యాజ్యంలో ప్రతివాదు లుగా ఉన్న వారికి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
నేను లేక.. మీరుండలేరు..!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
Advertisement