-
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
రజాక్ 1,875 కోట్ల ‘ఖజానా’ స్వాధీనం
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన భారీ ‘ఖజానా’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 273 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,875 కోట్లు) ఆస్తిని జప్తు చేసినట్లు చెప్పారు. అందులో నగదుతోపాటు, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఉన్నట్లు తెలిపారు. 1ఎండీబీ (1మలేసియా డెవలప్మెంట్ బెర్హాడ్) నిధుల కుంభకోణం కేసులో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు.. 12 వేల ఆభరణాలు, సుమారు రూ.205 కోట్ల విదేశీ కరెన్సీ, సుమారు రూ.132 కోట్ల విలువైన గడియారాలు, ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో కౌలాలంపూర్‌లో జరిపిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ ‘ఖజానా’ విలువను అధికారులు బుధవారం లెక్కించారు. నజీబ్‌తోపాటు ఆయన సన్నిహితులు 1ఎండీబీకి చెందిన మిలియన్ డాలర్ల నిధులతో కళాఖండాలు, ఆభరణాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ షాక్
► ఆస్తులు జప్తు చేసిన యూకే లండన్: అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన దావూడ్కు మింగుడు పడని పని చేసింది. తాజాగా బ్రిటన్ విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దీంతో పెద్ద మొత్తంలో ఇబ్రహీం ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది, ఇది భారత ప్రభుత్వానికి పెద్ద దౌత్య విజయం లాంటిది. వివరాల్లోకి వెళ్తే దావూద్‌కు వార్విక్షైర్లో హోటల్, మిడ్‌ల్యాండ్‌లో నివాస ఆస్తులు ఉన్నాయి. చాలాకాలంగా దావూద్‌పై ఆర్ధిక ఆంక్షలు విధించాలని భారత్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ దావూద్ ఆస్తులను జప్తు చేసింది. గతంలో యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్స్ టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్‌కు పాకిస్తాన్లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement