-
దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే
సాక్షి, న్యూఢిల్లీ: న్ని దుస్తుల పైనుంచి తాకినా అది లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల్లో ఆ ఉద్దేశమే ప్రధానం తప్ప శరీరాన్ని నేరుగా తాకారా, దుస్తులపై నుంచి తాకారా బాలిక శరీరాఅన్నది కాదని తేల్చి చెప్పింది. శరీరాన్ని నేరుగా తాకకపోతే (స్కిన్ టు స్కిన్ టచ్ జరగనపుడు) లైంగిక వేధింపులు కావంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుని గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టంలోని సెకక్షన్ 7 ప్రకారం కామవాంఛతో బాలిక శరీరాన్ని ఎలా తాకినా లైంగిక వేధింపులుగానే పరిగణించాలని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. సదరు కేసులో నిందితుడిని దోషిగా ప్రకటించింది. బాంబే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, జాతీయ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు న్యాయస్థానాలు తమ తీర్పులతో గందరగోళం సృష్టించకూడదని పేర్కొంది. చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్రభట్ తాను విడిగా తీర్పుని వెలువరిస్తూ ‘లైంగిక వేధింపుల్లో నిందితుడి ఉద్దేశమే ప్రధానం. చట్టంలో ఉన్న నిబంధనల్ని నిర్వీర్యం చేయకుండా మరింత శక్తిమంతంగా మారేలా తీర్పులనివ్వాలి. చట్టంలో అంశాలకు సంకుచితమైన వివరణలతో తీర్పులనివ్వడం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు. ఎందుకు వివాదమైంది? 2016లో నాగపూర్‌లో సతీష్ (36) అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికకు జామకాయ ఆశ చూపించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక ఛాతిని తాకి దుస్తుల్ని విప్పడానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు కింద కోర్టు నిందితుడ్ని దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను హైకోర్టుని ఆశ్రయించగా శరీరాన్ని నేరుగా తాకలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులు కావంటూ ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా నిందితుడిని విముక్తి చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా న్యాయమూర్తి ఇలాంటి తీర్పునివ్వడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారంటూ మహిళా సంఘాలు తీర్పుని వ్యతిరేకించాయి. తీర్పుని సవాల్ చేస్తూ అటార్నీ జనరల్, జాతీయ మహిళా కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జనవరి 27న సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పుని నిలిపివేసింది. ఇప్పుడు ఆ తీర్పుని కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
పసిమొగ్గపై కీచక కాటు
బెంగళూరులోని ఓ స్కూల్లో మూడున్నరేళ్ల చిన్నారిపై రేప్ బెంగళూరు: దేశంలో మృగాళ్ల ఘాతుకాలకు అడ్డుకట్ట పడటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వారి అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరులో ముక్కుపచ్చలారని మూడున్నరేళ్ల చిన్నారి తాను చదువుతున్న స్కూల్లోనే అత్యాచారానికి గురైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బెంగళూరులోని జాలహళ్లి క్రాస్‌లోని ‘ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్’లో మూడున్నరేళ్ల చిన్నారి విద్యనభ్యసిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు బాలిక తల్లి పాఠశాలకు రాగా.. కడుపులో నొప్పిగా ఉందని చిన్నారి తల్లితో చెప్పింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాలలోనే తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని బాలిక తల్లిదండ్రులు జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన ఈ ఉదంతం బుధవారం వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పాఠశాల వద్దకు చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి సంఘటనకు సంబంధించి పాఠశాల పాలక మండలి, విద్యార్థులతో చర్చించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎంఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ కింద కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement