Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Alleges AP Police Over EC Targets MLA Pinnelli
టార్గెట్‌ పిన్నెల్లి

గుంటూరు,సాక్షి: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేసే యత్నాలు చేస్తున్నారు. అం‍తేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైఎస్సార్‌సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్‌ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్‌ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. వైఎస్సార్‌సీపీ సూటి ప్రశ్నలుమాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్‌) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :::వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్‌ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్‌ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా.

Impact Of IPL on T20 World Cup
పొట్టి ​ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావమెంత..?

రెండు నెలలకు పైగా జరిగిన క్రికెట్‌ పండుగ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిన్నటితో (మే 26) ముగిసింది. ఈ సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌.. సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే మరో మహా క్రికెట్‌ సంగ్రామం మొదలుకానుంది. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ దాదాపుగా నెల రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది.పొట్టి ప్రపంచకప్‌ ఐసీసీ ఈవెంట్‌ కావడంతో అభిమానుల్లో అమితాసక్తి నెలకొని ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించే టోర్నీ కావడంతో తీవ్ర భావోద్వేగాలు ఉంటాయి. ఈ సారి వరల్ఢ్‌కప్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్.. చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో భారత్‌, పాక్‌లతో పాటు యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా దేశాలు ఉన్నాయి. ఐపీఎల్‌ 2024 సీజన్‌ రెండు నెలల సుదీర్ఘ కాలంపాటు సాగిన నేపథ్యంలో ఓ ఆసక్తిర ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు (దాదాపుగా) చెందిన ఆటగాళ్లు ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ఈ లీగ్‌ ప్రభావం పొట్టి ప్రపంచకప్‌పై ఏమేరకు పడనుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం రోజులు కూడా గడువక ముందే పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభంకావడం మంచిదేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఐపీఎల్‌ సుదీర్ఘకాలం పాటు సాగడం వల్ల ఆటగాళ్లు అలసిపోయుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌ ప్రభావం ఆటగాళ్లపై నెగిటివ్‌గా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ కారణంగా ఆటగాళ్లలో సీరియస్‌నెస్‌ కొరవడిందని కొందరంటున్నారు. ఐపీఎల్‌లో ఆడి కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడిన విషయాన్ని ఇంకొందరు ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్‌లో లభించే డబ్బును చూసుకుని కొందరు ఆటగాళ్లు దేశీయ విధులపై ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్‌ ముగిసి వారం కూడా గడవక ముందే మెగా టోర్నీ నిర్వహించడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఐపీఎల్‌ వల్ల మంచే జరిగిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌ వల్ల తమ దేశ ఆటగాళ్లకు మంచే జరిగిందని ఆసీస్‌ అభిమానులు అనుకుంటున్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఐపీఎల్‌ ఆడటం వల్ల తమ దేశ క్రికెటర్లకు ఒత్తిడిని ఎదుర్కోవాలో తెలిసొచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ సైతం ఏకీభవించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ దేశ క్రికెటర్లను ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ ఆడనీయకుండా తప్పుచేసిందని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌ ఆడి ఉంటే పొట్టి ప్రపంచకప్‌ ఇంకాస్త ఎక్కువగా సన్నద్దమయ్యేవారని వాన్‌ అన్నాడు.భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ఐపీఎల్‌ ప్రతిభే కొలమానంగా ప్రపంచకప్‌ జట్టు ఎంపిక జరిగింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. జట్టులో స్థానం విషయంలో సెలెక్టర్లు ఎలాంటి ములాజలకు పోకుండా అర్హులైన వారినే ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు సంబంధించి వ్యూహాలు వేరుగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌ వల్ల భారత ఆటగాళ్లకు మేలే జరిగిందని చెప్పాలి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కీలక ఆటగాళ్లెవరు గాయాల బారిన పడలేదు. టీ20 జట్టులో రెగ్యులర్‌ సభ్యులైన ఆటగాళ్లందరూ మాంచి ఫామ్‌లో ఉండటంతో జట్టు ఎంపిక​ కూడా చాలా కష్టమైంది. కొన్ని సమీకరణల కారణంగా కేఎల్‌ రాహుల్‌ లాంటి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓవరాల్‌గా చూస్తే పొట్టి ప్రపంచకప్‌పై ఐపీఎల్‌ ప్రభావం అనే అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు వినిపిస్తున్నారు.

AP MLC Chairman Enquiry on Indukuri Raghu Raju Disqualification Petition
మరో ఎమ్మెల్సీ అనర్హతపై నేడు విచారణ

గుంటూరు, సాక్షి: మరో ఫిరాయింపు ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. వ్యక్తిగతంగా శాసనమండలి చైర్మన్‌ ఎదుట హాజరై పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఇందుకురి రఘురాజును మండలి చైర్మన్‌ ఆదేశించారు. విచారణ తదనంతరమే ఆయన అనర్హతపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన రఘురాజుపై వైఎస్సార్‌సీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వ్యక్తిగతంగా మే 27(సోమవారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో.. రఘురాజు, చైర్మన్‌ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉంది. శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆధిపత్య ధోరణి ప్రదర్శించేవారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది. బొత్స కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. ఉపేక్షించేది లేదు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై శాసనసభ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై, అంతకు ముందు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేశారు. ఈ ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై.. వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. దీనకంటే ముందు.. ఎనిమిదిమంది రెబల్ ఎమ్మెల్యేలపైనా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. వైఎస్సార్‌సీపీలో గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై చర్యలు తీసుకున్నారు. అలాగే టీడీపీలో గెలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాళి గిరిలపైనా వేటు పడింది.

Bangalore CCB police Investigation On Rave Party Case
బెంగళూరు రేవ్‌ పార్టీ కేసు: విచారణకు హేమ హాజరయ్యేనా?

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్‌ బ్యాంచ్‌ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇ‍చ్చారు. ఈ నేపథ్యంలో వీరు విచారణకు హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇక, బెంగళూరు రేవ్‌ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు బ్లడ్‌ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్‌ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్‌ చేసిన హేమ.. పోలీసుల విచారణకు హాజరవుతారా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు.. ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్‌ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్‌ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Warangal and Khammam and Nalgonda Graduate MLC bypoll Updates In Telugu
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్‌

Updates నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని‌ నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్‌..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్‌:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్‌ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎ‍న్నిక పోలింగ్‌ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్‌లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు

Could have Learned This Lesson From Warren Buffett Reveals Bill Gates
బఫెట్ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సింది..

బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నప్పుడు సమయపాలనకు అత్యంత విలువనిచ్చేవారు. ప్రతి సెకనుకూ ఆయన షెడ్యూల్‌ వేసుకునేవారు. అదే విజయానికి మార్గమని నమ్మేవారు. అలాంటి బిల్‌ గేట్స్‌.. అది తప్పని చాలా ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. వారెన్‌ బఫెట్‌ నుంచి ఆ పాఠం ముందే నేర్చుకోవాల్సిందని చెబుతున్నారు.."విజయవంతం కావడానికి మీరు మీ షెడ్యూల్‌లోని ప్రతి సెకనును నింపాల్సిన అవసరం లేదు. ఇది గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది" అని గేట్స్ మెటా థ్రెడ్స్ యాప్‌లో పోస్ట్ చేశారు. వారెన్ బఫెట్ రూపొందించుకున్న తేలికపాటి క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలించి ఉంటే ఈ పాఠాన్ని ఇంకా చాలా త్వరగా నేర్చుకునేవాడినని రాసుకొచ్చారు.మైక్రోసాఫ్ట్ సీఈఓగా తన 25 ఏళ్ల పదవీకాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని షెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రోమేనేజ్ చేశారు. సిబ్బందికి అర్థరాత్రి వర్క్‌ రిక్వెస్ట్‌లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. అలుపెరగని ఈ విధానమే విజయానికి మార్గమని ఆయన గతంలో విశ్వసించారు. అయితే, బఫెట్ తేలికపాటి షెడ్యూల్ చూసిన తరువాత, బిల్ గేట్స్ తన భావను సమీక్షించుకోవడం మొదలుపెట్టారు."వారెన్ తన క్యాలెండర్‌ను చూపించడం నాకు గుర్తుంది. దానిలో ఏమీ లేని రోజులు అతనికి ఉన్నాయి" అని బిల్ గేట్స్ అన్నారు. బఫెట్ షెడ్యూల్ తనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందన్నారు. మీ షెడ్యూల్లో ప్రతి నిమిషాన్ని నింపడం మీ సీరియస్‌నెస్‌కు నిదర్శనం కాదు. బఫెట్ భావన ఏంటంటే "కష్టపడి కాదు.. తెలివిగా పనిచేయండి". సైన్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.'ఈ పాఠం నేర్చుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. మీరు అంతకాలం వేచి ఉండవద్దు' అని ఆయన అన్నారు. "ఇష్టమైనవారితో బంధాలను పెంపొందించుకోవడానికి, సక్సెస్‌ను ఆనందించడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోండి. అవసరమైనప్పుడు విరామం తీసుకోండి" అని బిల్‌ గేట్స్‌ సూచిస్తున్నారు.

AP Elections 2024: May 27th Political Updates In Telugu
May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates.. 10:30 AM, May 27th, 2024ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణపార్టీ ఫిరాయించిన రాఘురాజు వ్యక్తిగత విచారణను రావాలని ఆదేశం.విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న మండలి చైర్మన్‌నేడు 11 గంటలకు విచారించనున్న మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు.వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన రఘురాజు. 9:30 AM, May 27th, 2024ఎన్నికల దృష్ట్యా పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..ఎన్టీఆర్ జిల్లా:గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో తిరువూరు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎన్నికల ఫలితాల భద్రతా దృష్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు..రికార్డులు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు.. 8:50 AM, May 27th, 2024బరితెగించిన పచ్చ గూండాలు..ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలుపోలింగ్‌ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 7:45 AM, May 27th, 2024పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..తాడేపల్లి..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులుఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులుటీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులుసీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్‌సీపీఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు 7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దుడిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండిడిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Upcoming OTT Release Movies In Telugu On May Last Week 2024
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్

మరో వారం వచ్చేసింది. చాలారోజులుగా డల్‌గా ఉన్న థియేటర్లలోకి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై మంచి బజ్ ఉంది. 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' మూవీస్ కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఏవి హిట్ అవుతాయనే సంగతి పక్కనబెడితే ఓటీటీలో కూడా 19 వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేం లేవు. 'పంచాయత్' అనే హిందీ సిరీస్, 'వీర్ సావర్కర్' అనే హిందీ మూవీ మాత్రమే ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరికొన్ని హిందీ చిత్రాలు-సిరీసులు ఉన్నాయి గానీ రిలీజైతే గానీ వాటి టాక్ చెప్పలేం. అలానే ఈ వీకెండ్‌లో తెలుగు మూవీస్ ఏమైనా సడన్‌గా స్ట్రీమింగ్‌కి వస్తాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసా?ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మూవీస్ జాబితా (మే 27 - జూన్ 02 వరకు)అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28హాట్‌స్టార్కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31నెట్‌ఫ్లిక్స్ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01జియో సినిమాఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లేపొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

IPL 2024: Sunil Narine Becomes The First Player To Win MVP Award Thrice In IPL History
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్‌లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్‌.. 2018 సీజన్‌లో.. తాజాగా 2024 సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్‌.. 2018 సీజన్‌లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్‌లో మెంటార్‌ గంభీర్‌ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన నరైన్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బ్యాట్‌ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్‌ ఐపీఎల్‌లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్‌ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మిచెల్‌ స్టార్క్‌ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది.

Israel Army Air Strikes At Gaza's Southern City Rafah, Killed At least 35
రఫాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..

ఇజ్రాయెల్‌ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్‌ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్‌ తెలిపింది. قطعت رؤوس الأطفال وحرقت الأجساد 😭😭جنون اسرائيل لن ينتهي الا باقتلاعه من الجذورونهايتهم قريب باذن الله#رفح_الان #Rafah #ابو_عبيدة pic.twitter.com/BjbNdA9aRF— حماة الأقصى في بلاد الحرمين (@aqsa_saudi3n) May 27, 2024 ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. Israel commits a massacre in #Rafah this evening, dropping several 2,000 pound bombs on civilian tents and #UN compounds, murdering dozens of civilians seeking shelter. This was Israel’s response to the @CIJ_ICJ ruling Friday that it must halt its offensive on Rafah. pic.twitter.com/vS1ouUU8Oj— Husam Zomlot (@hzomlot) May 26, 2024 ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement