Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

 SIT Investigation Into Violent Incidents In After AP Election
AP: సిట్‌ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!

సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్‌ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్‌లను సిట్‌ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్‌ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్‌ బృందం పరిశీలిస్తోంది.

Vuyyuru Lokesh Arrested Again At Gannavaram Airport
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్‌

సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్‌ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్‌ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్‌ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్‌ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్‌ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్‌ నుంచి శాటిలైట్ ఫోన్‌ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్‌ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.

Ktr Comments At graduates Mlc Bhuvanagiri Campaign
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్‌

సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు నెరవేరలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. భువనగిరిలో ఆదివారం(మే19) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘మోదీ గుడి కట్టినం అని ఓట్లు అడుగుతుండు. మేం కూడా గుడి నిర్మించాం. గుడి పేరుతో ఓట్లు అడగలేదు. మేము ప్రాజెక్టులు కట్టాం. అవికూడా దేవుళ్ళ పేరు మీద కట్టాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు నాట్లు వేస్తునప్పుడు రైతు బంధు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓట్లు వేస్తునప్పుడు మాత్రమే రైతులకు రైతు బంధు వేస్తున్నారు.కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి నేనిచ్చా అని చెప్పుకోవడానికి రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలి.‌ ఒక వైపు బిట్స్ బిలాని చదువుకున్న అభ్యర్థి ఉన్నాడు. మరోవైపు బ్లాక్ మెలర్, లాబీయింగ్, పైశాచిక ఆనందం పొందే అభ్యర్థి ఉన్నాడు. ఎవరికి ఓటు వేయాలో పట్టభద్రులు తేల్చుకోవాలి’అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

T20 WC 2024 Trophy At Sakshi: Piyush Chawla Picks His Semi Finalists
T20 WC 2024 Trophy At Sakshi: సెమీస్‌ చేరే జట్లు ఇవే: పీయూశ్‌ చావ్లా

టీ20 ప్రపంచకప్‌-2024 టూర్‌ భారత్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్టార్‌ స్పోర్ట్స్ బృందం‌ ఆదివారం ‘సాక్షి’ ఆఫీస్‌కు విచ్చేసింది.హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో.. ప్రముఖ క్రికెటర్‌, టీ20 వరల్డ్‌కప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011 విజేత పీయూశ్‌ చావ్లా ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాక్షి జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్‌ చేశారు. ఈ క్రమంలో ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు పీయూష్‌ చావ్లా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.టీ20 ప్రపంచకప్‌-2024 సెమీ ఫైనలిస్టులపై మీ అంచనా?ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌.. ఈ మూడింటితో పాటు ఇంగ్లండ్‌ లేదంటే న్యూజిలాండ్‌ జట్లను టాప్‌-4లో చూసే అవకాశం ఉంది.స్పిన్నర్‌గా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌ ఎవరు?వీరూ భాయ్‌(వీరేంద్ర సెహ్వాగ్‌), రాహుల్‌ భాయ్‌(రాహుల్‌ ద్రవిడ్)‌.కీలక సమయంలో ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారు?కెరీర్‌ ఆరంభంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావడం సహజం. అయితే, అనుభవం గడిస్తున్న కొద్దీ మేనేజ్‌ చేసుకోగలుగుతాం.టీ20 వరల్డ్‌కప్‌-2024లో పేసర్లు, స్పిన్నర్లలో ఎవరు కీలకం కానున్నారు?వెస్టిండీస్‌ పిచ్‌లు స్లోగా ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం అమెరికాలోనూ పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. కాబట్టి స్పిన్నర్లు ఈసారి కీలక పాత్ర పోషిస్తారని అనుకుంటున్నా.టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా ఎదుర్కొనబోయే కఠినమైన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?ఆస్ట్రేలియా. ఎందుకంటే ఐసీసీ టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్లకు బాగా తెలుసు.టీమిండియా స్పిన్నర్లలో ఈసారి ఎవరు కీలక పాత్ర పోషించనున్నారు?కుల్దీప్‌ యాదవ్‌.జస్‌ప్రీత్‌ బుమ్రా వరల్డ్‌కప్‌నకు సిద్ధంగా ఉన్నాడా?అవును. మెగా టోర్నీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కచ్చితంగా ఈసారి అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది. మెగా టోర్నీకి సిద్ధమయ్యే క్రమంలో తను ఐపీఎల్‌లో ఆఖరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. ఇలా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ పీయూశ్‌ చావ్లా సరదాగా గడిపారు. కాగా ఐపీఎల్‌-2024లో పీయూశ్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టారు.చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్‌

AP Elections 2024: May 19th Political Updates In Telugu
May 19th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 19th AP Elections 2024 News Political Updates3:50 PM, May 19th, 2024పల్నాడు:సిట్‌ బృందాన్ని కలిసిన మంత్రి అంబటిపలు విషయాలు సిట్‌ బృందానికి నివేదించిన అంబటిఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదుపోలీసులతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారుపోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై కూడా సిట్‌ బృందానికి అంబటి వివరించారు3:00 PM, May 19th, 2024కృష్ణాజిల్లా:మరోసారి గన్నవరం ఎయిర్ పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబుఅదుపులోకి తీసుకున్న పోలీసులురెండ్రోజుల క్రితం అనుమానాస్పదంగా ఎయిర్ పోర్ట్ లో తిరిగిన ఉయ్యూరు లోకేష్సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు ప్లాన్ చేసిన లోకేష్తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు41ఏ నోటీస్ ఇచ్చి శనివారం పంపించిన పోలీసులుతిరిగి ఆదివారం మరోసారి డిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన లోకేష్‌ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న లోకేష్గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులులోకేష్‌ను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులుకేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న లోకేష్ 12:30 PM, May 19th, 2024తిరుపతిలో సిట్‌ బృందం పరిశీలనతిరుపతి జిల్లా..చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం పరిశీలనటీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును పరిశీలించిన బృందంచంద్రగిరి వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్‌మెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందంసీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు 11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్‌సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్‌పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్‌ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్‌ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం

BRS MLA Malla Reddy Key Comments Over Land Issue At Suchitra Circle
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్‌..

సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్‌లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్‌ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్‌ వివాదంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్‌ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను ​కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్‌లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్‌ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్‌ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AAP MLA Somnath Bharti Slams BJP Politics
సాక్షి ఎక్స్‌క్లూజివ్‌: ‘సుష్మా స్వరాజ్‌ కూతురికి టికెట్‌ ఇవ్వొచ్చా?’

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్‌ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్‌ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్‌ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్‌ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్‌ కీ బాత్‌ బీజేపీ తడి పార్‌. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు. కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్‌ కూతురు టికెట్‌ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Cognizant Issues Warning For Employees For Return To Office
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్

ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

Woman Fulfills Bollywood Dream By Dancing To Sridevis Mitwa In Manali
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్‌ చేయాలని..!

కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్‌లో డాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్‌ అనే మహిళ డాన్స్‌ తెగ వైరల్‌ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్‌ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్‌ 1 హీరోయిన్‌గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్‌ హిట్‌. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్‌ సావన్‌ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్‌ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్‌ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్‌ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లింది. అక్కడ సేమ్‌ చాందినీ సినిమాలోని లొకేషన్‌ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్‌వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్‌ షూట్‌ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్‌’లాంటి పాటలకు డాన్స్‌ చేయడానికి లొకేషన్స్‌ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్‌! దెబ్బకు కస్టమర్‌ బేరం ఆడకుండా కొనాల్సిందే!)

Jabardasth Pavithra Car Accident And Emotional Video
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!

ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement