-
ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన..
ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఇటీవల మార్చి 14, 2024 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అయితే యూఐడీఏఐ ఆధార్‌ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లు అయింది. దాంతో ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. అందుకు సంబంధించి ‘సాక్షి’లో డిసెంబర్ 13న ‘ఆధార్‌పై ప్రశ్నలా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో పాఠకులు ఆధార్‌కు సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే info@sakshi.com కు పంపించాలని కోరగా చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ‘సాక్షి బిజినెస్’టీమ్ సంబంధిత అధికారులతో మాట్లాడి కొంతమంది పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. ప్రశ్న: ఆధార్ ఎందుకు, ఎలా అప్డేట్ చేసుకోవాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏయే డాక్యుమెంట్లు అవసరం అవతాయి? శైలజ, వరంగల్. జవాబు: నిబంధనల ప్రకారం ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ డేటాబేస్‌లో మీ వివరాలు అప్ టు డేట్ ఉండాలి. దాంతో ఆధార్‌తో లింక్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మీ తాజా వివరాలు ఉంటే మేలు. మీ ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకోసం పాఠశాల టీసీ, పదో తరగతి మెమో, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. వీటిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి సంబంధించిన ఫారమ్ నింపి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తులతో అప్డేట్ చేస్తారు. ప్రశ్న: బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? కార్తిక్, శ్రీకాకుళం. జవాబు: లేదు. మీ బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎవరితోనూ పంచుకోదు. మీ ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతా గురించి సమాచారాన్ని పొందలేరు. అలాగే, యూఐడీఏఐతోపాటు ఏ సంస్థ వద్ద మీ బ్యాంక్ ఖాతా గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ నంబర్‌ను బ్యాంక్, పాస్‌పోర్ట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖలు మొదలైన వివిధ అధికారులకు ఇస్తారు. కానీ మీరు ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి మీ బ్యాంక్ సమాచారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు వంటి సమాచారం గురించి తెలియదు. అదేవిధంగా మీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు ఆధార్ నంబర్‌ను ఇచ్చినపుడు మీ వివరాలు వారి వద్దే ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐతో సహా ఏ సంస్థ కూడా యాక్సెస్ చేయలేదు. ప్రశ్న: నా ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలిసిన ఎవరైనా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? సులోచన, విజయవాడ. జవాబు: కేవలం మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ అవసరం అవుతాయి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆధార్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ వేలిముద్ర, ఐరిస్ లేదా ఓటీపీ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న: ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మరి యూఐడీఏఐ ప్రజలు తమ ఆధార్ నంబర్‌ను సోషల్ మీడియా లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని ఎందుకు సూచిస్తోంది? కేతన్, నిజామాబాద్. జవాబు: మీరు పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్‌లను అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అయితే ఈ వివరాలను ఇంటర్నెట్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) మొదలైన సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఉంచరుకదా. ఆధార్ విషయంలో కూడా ఇదే లాజిక్‌ని ఉపయోగించాలి. మీ వ్యక్తిగత వివరాలు అనవసరంగా పబ్లిక్ డొమైన్లో ఉంచవద్దు. ప్రశ్న: ఆధార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? శరణ్య, అనంతపురం జిల్లా. జవాబు: ఆధార్‌ను చాలా ప్రభుత్వ పథకాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం. ఉపాధి-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం. జననీ సురక్ష యోజన, ఆదిమ తెగల సమూహాల అభివృద్ధి, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఆరోగ్య సంరక్షణ – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఆస్తి లావాదేవీలు, ఓటర్ఐడీ, పాన్‌కార్డ్ మొదలైన ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ కావాల్సి ఉంటుంది. ప్రశ్న: యూఐడీఏఐ అనుసరిస్తున్న డేటా భద్రత చర్యలు ఏమిటి? సుశీల, హైదరాబాద్. జవాబు: ప్రజల నుంచి సేకరించిన డేటాకు భద్రత కల్పించే బాధ్యత యూఐడీఏఐకు ఉంది. యూఐడీఏఐ సమగ్ర భద్రత విధానాన్ని కలిగి ఉంది. పటిష్ఠమైన సెక్యూరిటీ స్టోరేజ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
ఆధార్‌పై ప్రశ్నలా..?
ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిలాఉండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఆధార్‌ను తీసుకొచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. ఈ-ఆధార్ అంటే ఏమిటి, అది ఎలా ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ ఏమిటి... వంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ కొందరికి జవాబులు తెలియకపోవచ్చు. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో సంబంధిత అధికారితో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యం మొదలైంది. అయితే మీ ప్రశ్నలను info@sakshi.com కు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ప్రశ్నలకు మన ‘సాక్షి బిజినెస్’లోనే శనివారం సమాధానాలిస్తాం. ఉదాహరణకు.. ఆధార్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆధార్ అప్డేషన్కు ఎంత ఖర్చు అవుతుంది? ఆధార్ అప్డేషన్కు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఆధార్ అప్డేషన్కు ముందే ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు? ఎవరు కాదు? వర్చువల్ ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ కార్డు ఏ ముఖ్యమైన అంశాలకు లింకవుతుంది? ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవాలి? చిన్న పిల్లలకు వయస్సు పరిమితులేమిటి? బ్యాంక్ ఖాతా, పాన్, ఇతర సేవలను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, పాన్, ఇతర సేవలకోసం ఆధార్‌తో ఎందుకు ధ్రువీకరించాలి? అపరిచితులకు మన ఆధార్ నంబర్ తెలిస్తే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? మీకు ఎదురైన, మీరు అడగాలనుకుంటున్న ఆధార్‌కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనైనా info@sakshi.com కు పంపి సమధానాలు పొందగలరు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ -
మ్యాప్స్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్
గూగుల్ మ్యాప్స్‌ను, మొబైల్ సెర్చ్‌లను మరింత సులభతరం చేసేందుకు గూగుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. యూజర్లు వారు వెళ్లాలనుకుంటున్న ప్రదేశ సమాచారం గురించి తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గూగుల్ మ్యాప్స్ లేదా మొబైల్ సెర్చ్‌లో యూజర్లు తేలికగా లొకేషన్‌ను సెర్చ్ చేసి, ప్రదేశాల గురించి ప్రశ్నలు అడగవచ్చు లేదా సమాధానం చెప్పొచ్చు లేదా ఇప్పటికే కలిగి ఉన్న ప్రశ్నాసమాధాలను చెక్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఎక్కువ ఓటు వేసిన ప్రశ్నలు, సమాధానాలు ఈ సెక్షన్లో టాప్‌లో కనిపిస్తాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్లో ఉన్న సమాచారమంతా అత్యంత కచ్చితమైనదని, అవసరమయ్యే స్థానిక సమాచారం ఇచ్చేలా ఉంటామని గూగుల్ తెలిపింది. తరుచు అడిగే ప్రశ్నలు, సమాధానాలను వ్యాపార యజమానులు దీనిలో జతచేర్చవచ్చని పేర్కొన్నారు. ఒక ప్రదేశం గురించి యూజర్లు ప్రశ్నిస్తే, వెంటనే గూగుల్ ఈ విషయాన్ని వ్యాపార యజమానికి లేదా సమాచారం అందించే ఇతర యూజర్లకు నోటిఫై చేస్తుంది. వారు తమ సమాధాన రూపంలో యూజర్లకు సమాధానాన్ని అందించవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement