-
సంతోష్ శ్రీనివాస్ ను ఓదార్చిన జూనియర్ ఎన్టీఆర్
మంచి అయినా.... చెడు అయినా ఒకోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోవటం సాధ్యం కాదేమో. అది ఎక్కడైనా...ఎప్పుడైనా సరే మనసులోని భావాలను బయటకు వెల్లడిస్తుంటారు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రభస'కు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ ...ఆ సినిమా ఆడియో విడుదల సందర్భంగా కంటతడి పెట్టాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన అతడు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్...సంతోష్ శ్రీనివాస్ భుజం తట్టి ఓదార్చారు. వివరాల్లోకి వెళితే రభస షూటింగ్ సమయంలో సంతోష్ శ్రీనివాస్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి కామెర్లు (జాండీస్) రావటంతో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు మూడు నెలలు షూటింగ్ నిలిచిపోయింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ అందించిన మానసిక ధైర్యం తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్ళు వస్తాయని సంతోష్ శ్రీనివాస్ తెలిపాడు. ఓ టాప్ హీరో... దర్శకుడి కోసం మూడు నెలలు ఆగారని దర్శకుడు తెలిపాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని సంతోష్ శ్రీనివాస్ వేదికపై కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఆడియో వేడుక అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు జాగ్రత్తలు తెలిపారు. ఇంటికి క్షేమంగా వెళ్లాలని, ఎప్పుడూ చెప్పేదే అయినా... తండ్రి అయిన తర్వాత తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పటం విశేషం. -
ఆగస్ట్ 15న ఎన్టీఆర్ 'రభస' విడుదల
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస' ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి అభిమానులు పండుగ చేసుకోనున్నారు. ఎన్టీఆర్, నందమూరి అభిమానులకు ఈ చిత్రం అభిమానులకైతే పండుగలా ఉంటుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఆగస్ట్ 15న రభస చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర విడుదల తేదీలో ఎలాంటి మార్పులేదన్నారు. సంతోష్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమ బేనర్లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్నారు. రభస ఆడియోను ఆగస్ట్ 1వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా విడుదల చేస్తున్నట్లు బెల్లంకొండ తెలిపారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందన్నారు. తమన్ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయని, ఎన్టీఆర్, తమన్ కాంబినేషన్లో 'రభస' మరో మ్యూజికల్ హిట్ అవుతుందన్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా, తమ సంస్థకు కూడా ఈ సినిమా ప్రత్యేకమైనదని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాట పాడటం ఓ హైలెట్‌గా చెప్పొచ్చు. గతంలో జూనియర్....యమదొంగ, అదుర్స్, కంత్రీ చిత్రాల్లో గళం విప్పిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఎన్టీఆర్ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్గా నటిస్తోంది. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
మీసా భారతి.. రోహిణి ఆచార్య.. కూతుళ్లకు లాలూ ఈ పేర్లెందుకు పెట్టారు?
రేపల్లెలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ కి మోపిదేవి స్ట్రాంగ్ కౌంటర్
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
తప్పక చదవండి
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
Advertisement