-
Happy Birthday Rajinikanth: గమ్మత్తుగా లతా లవ్‌లో..
ఎన్న రాస్కెల్.. మైండ్ ఇంట్.. సూపర్‌స్టార్ క్రేజ్ ఒక్క తమిళనాడు.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాలు.. సౌత్.. యావత్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలకు కూడా విస్తరించింది. ఏడు పదుల వయసులోనూ స్క్రీన్‌పై ఆయన స్టైలింగ్ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ప్రతీ పుట్టినరోజుకి వయస్సు తగ్గిపోతుందేమో అనిపించేది.. తలైవా విషయంలోనే ఏమో!. రజనీకాంత్ స్టైల్‌కు ఉన్న ప్రత్యేకత అదే!. రజనీ పుట్టినరోజుకు.. కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. కానీ, రజనీకాంత్‌ది ప్రేమ వివాహమని.. అది చాలా గమ్మత్తుగా జరిగిందనేది మీకు తెలుసా?.. సినిమాల్లో రజనీ.. హీరోయిన్లతో ప్రేమ-పెళ్లి.. ఎంత విజీగా అయిపొగొట్టేస్తారో!. కానీ, రియల్ లైఫ్‌లో ఇష్టపడ్డ అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.. డెబ్భైవ దశకంలో బాలీవుడ్లో వచ్చిన గోల్ మాల్ చిత్రాన్ని.. తిల్లు మల్లు పేరుతో కోలీవుడ్‌లో రీమేక్ చేశారు దర్శక దిగ్గజం బాలచందర్. అందులో ఆయన ప్రియశిష్యుల్లో ఒకరైన రజనీ హీరో. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కి.. సూపర్ హిట్ అయ్యిందా చిత్రం. అయితే.. ఈ చిత్ర షూటింగ్ మధ్యలో ఓ కాలేజీ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ కోసం ఒకావిడ వచ్చారని.. రజనీతో ఆయన అసిస్టెంట్ చెప్పారు. అయితే షూటింగ్ హడావిడిలో ఉన్న రజనీ కాసేపటి దాకా ఆ విషయం పట్టించుకోలేదు. ఆపై ఆ విషయం గుర్తొచ్చి.. పక్కకి వెళ్లారు. ఆమె పేరు లతా రంగాచారి. ఆమెను చూడగానే రజనీ గుండెలో జుజుబి మొదలైంది. మాటల మధ్యలో ఆమెది బెంగళూర్ అని చెప్పటం.. రజనీ కూడా అక్కడ కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ మాటలు మరింత ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఇద్దరి ఆసక్తులు ఒక్కటేనని తేలింది. దీంతో అప్పటికే ఓ స్టార్ అయిన రజనీతో లత చనువుగా మాట్లాడేందుకు వీలైంది. ఆమెతో ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలోనే రజనీ మనసు.. మైండ్ రెండూ పని చేయకుండా పోయాయంట. ఆమెతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయిపోయి చివరకు ఆ క్షణంలో మరో ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడంట. దీంతో సూపర్ షాక్ తగిలిన ఆమె చిన్నగా నవ్వి.. తన తల్లిదండ్రులతో మాట్లాడమని రజనీకి చెప్పి వెళ్లిపోయిందట. కానీ, తలైవా చాలా చిలిపి. ఆ పని వెంటనే చేయలేదు. ఆమెతో స్నేహం కొసాగిస్తూనే అదను కోసం ఎదురు చూడసాగాడు. ఈ మధ్యలో ఈ విషయాన్ని తన స్నేహితుడు, నటుడు వైజీ మహేంద్రన్‌కు చెప్పాడంట. ఆయన.. లత సోదరి సుధ భర్త కావటం విశేషం. దీంతో తన పని తేలిక అవుతుందని రజనీ భావించారు. అదే సమయంలో.. ఆమె పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో రజనీ కొందరు సీనియర్ నటులను కూడా రంగంలోకి దింపాడంట. చివరకు.. మహేంద్రన్ దౌత్యంతో వాళ్ల ప్రేమ ఫలించింది. రజనీకి ఊరటనిస్తూ లతా పేరెంట్స్ వారి వివాహానికి ఓకే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని రజనీకి చెప్పకుండా వాళ్లు కొంత కాలం టెన్షన్‌తో ఎదురు చూసేలా చేశారట. లతా కూడా కొన్నిరోజులు ఆయనతో మాట్లాడకుండా ఏడ్పించిందట. దీంతో రజనీ ఎవరితో మాట్లాడకుండా కొన్నిరోజులపాటు డిప్రెషన్లోకి వెళ్లారు. చివరికి.. లత, మహేంద్రన్‌లు రజనీ ఇంటికి అసలు విషయం చెప్పడంతో ఆయన ఆశ్చర్యంతో ఆనందానికి లోనయ్యారట. అలా.. చివరకు ఏడాది తిరగక ముందే ఫిబ్రవరి 26, 1981 తిరుపతి వెంకన్న సమక్షంలో మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇది సూపర్‌స్టార్ గమ్మత్తు లవ్ కమ్ మ్యారేజ్ కహానీ!. -
మలేసియాలో రాధికా ఆప్టే
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ షూటింగ్ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మలేసియాలో జరుగుతున్న ఈ తమిళ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్లో తాజాగా నటి రాధికా ఆప్టే వచ్చి చేరారు. హీరో రజనీకాంత్ భార్యగా ఆమె ఈ చిత్రంలో నటిస్తున్నారు. ‘‘రజనీకాంత్‌కూ, రాధికా ఆప్టేకూ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. అలాగే, కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. దాదాపు మూడు వారాల పాటు ఈ తుది షెడ్యూల్ జరగనుంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. నిజజీవిత నేర సామ్రాజ్య నేత కపాలీశ్వరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని, ఈ చిత్ర కథ అల్లుకున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. ధన్సిక, దినేశ్, కలై అరసన్, రిత్విక తదితరులు ప్రధాన పాత్రధారులు. అలాగే, మలేసియన్ నటులు కీలక ప్రతినాయక పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇప్పటికే, ‘అహల్య’ లాంటి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న రాధికా ఆప్టే తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చే ఈ చిత్రం తనకు ఒక కొత్త పాస్‌పోర్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఆమె ఆశలు ఏ మేరకు నెరవేరతాయన్నది తెలియాలంటే, మే నెలలో సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement