-
రమేష్‌కు ఆర్పీఎస్ లండన్ అవార్డు
వనపర్తి: జిల్లా కేంద్రంలోని నవీన ఫొటోపార్లర్ రమేష్‌కు ఆర్పీఎస్ (రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ) లండన్ అవార్డు ప్రకటించింది. ఇటీవల చైనా దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫొటో పోటీల్లో బ్లాక్ అండ్ వైట్ విభాగంలో ఈ ఫొటోగ్రాఫర్ పది ఫొటో లు పంపించగా వాటిలో వాటర్ క్వీరీర్కు సంబంధించిన ఫొటోలకు ఆర్పీఎస్ రిబ్బన్ (తృతీయ) బహుమతి ప్రకటించారు. అలాగే మార్చిలో బెంగుళూరులో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ రూరల్ లైఫ్ అవార్డు, ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో హానరబుల్ మేన్‌టేన్ ఆఫ్ మెరిట్ రిబ్బన్ అవార్డు లభించింది. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి ఈ ఇద్దరు స్నేహితులను మృత్యువు ఒకేసారి మింగేసింది. కష్టాలే తోడుగా సాగిన వారి బాల్య ప్రయాణం క్షణాల తేడాలోనే ముగిసింది. ఒకరు తల్లీతండ్రి లేని అనాథ అయితే.. మరొకరిది కడుపేద కుటుంబ నేపథ్యం. ఇద్దరూ ఈతకు వెళ్లి మరిక తిరిగి రాలేదు. మరణంలోనూ వీడని స్నేహ బంధానికి నిర్వచనం చెప్పారు. స్నేహమేరా శాశ్వతం.. అంటూ శాశ్వతంగా దూరమయ్యారు. వూచవరం : వూచవరంలోని సెయింట్‌ఆన్స్ లయోల ప్రేమ నివాస్ హాస్టల్లో ఉంటున్న రమేష్(13), ఏసుబాబు(11) ఈతకనివెళ్లి మృత్యువు బారినపడ్డారు. వీరిద్దరిదీ వేర్వేరు తరగతులు.. వేర్వేరు గ్రామాలు.. అయితేనేం మంచి స్నేహితులు. కష్టాలే వీరిని స్నేహితులుగా చేశాయని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల వుండలం, జూలకల్లుకు చెందిన దానియేలు, ఏసువురియువ్ము కూలిపనులు చే సేవారు. వీరికి రమేష్(13), రాజేష్ అనే ఇద్దరు కుమారులు. అనారోగ్య కారణంగా దానియేలు, ఏసువురియువ్ము నాలుగేళ్ల కిందట వుృతిచెందారు. రమేష్ గ్రావుంలో ఉన్న మేనత్త వద్ద, రాజేష్ బ్రాహ్మణపల్లిలో ఉంటున్న అవువ్ము, తాతయ్యుల వద్ద పెరుగుతున్నారు. 2010లో వూచవరంలోని సెరుుంట్ ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో రమేష్ చేరాడు. హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా, అద్దంకి వుండలం, వేలమూరిపాడు గ్రావూనికి చెందిన గోపనబోరుున సామియేలు, రాహేలు వ్యవసాయు పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. వీరికి కువూరులు ఏసుబాబు(11), యోహాన్, వెంకట్, గేషంత్రాజ్. ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్ద కువూరుడు ఏసుబాబు, రెండో కువూరుడు యోహాన్ను వూచవరంలోని సెరుుంట్ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో 2009లో చేర్చారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏసుబాబు 6వ తరగతి చదువుతున్నాడు. తరగతులు వేరైనా ఏసుబాబు, రమేష్‌లు వుధ్య స్నేహబంధం ఏర్పడింది. శనివారం ఉదయుం హైస్కూల్‌కు వెళ్లిన వీరు వుధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చి భోంచేశారు. ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకని హైస్కూల్ సమీపంలో ఉన్న కూర వెంకటేశ్వర్లుకు చెందిన వ్యవసాయు బావి వద్దకు వెళ్లారు. ఏసుబాబు, రమేష్ ఈతకొట్టేందుకు బావిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి ప్రవూదవశాత్తు వుునిగిపోయూరు. రాత్రరుునా వారు హాస్టల్‌కు రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు విచారించగా వ్యవసాయు బావి వద్ద దుస్తులు ఉన్నాయుని తెలిసింది. గజఈతగాళ్లను బావిలోకి దించి విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. నీరుఎక్కువగా ఉండటంతో ఐదు ఆరుుల్ ఇంజిన్ మోటార్లు, అగ్నివూపక సిబ్బంది సాయుంతో నాలుగు గంటలపాటు నీటిని బయుటకు తోడారు. గజఈతగాళ్లు మొదట ఏసుబాబు మృతదేహాన్ని బయుటకు తీశారు. తర్వాత అరగంటపాటు వెతగ్గా రమేష్ వుృతదేహం కూడా లభ్యమైంది. ఈతకెళ్లి ప్రవూదవశాత్తు పడి విద్యార్థులు వుృతిచెందారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల హరిబాబు తెలిపారు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిస్టర్స్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement