-
నాన్నకు ఆమే సరైన జోడీ
నాన్న కార్తీక్‌కు నటి నగ్మా సరైన జోడీ అని ఆయన కొడుకు, యువ నటుడు గౌతమ్ కార్తీక్ అన్నారు. కడల్ చిత్రం ద్వారా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం పరిచయం చేసిన నటుడు గౌతమ్ కార్తీక్. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు. తాజాగా గౌతమ్ కార్తీక్ నటించిన రంగూన్ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ఇవన్ తందిరన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రద్ధా కథానాయకి. కండేన్ కాదలై చిత్రం ఫేమ్ ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంకే.రామ్ ప్రసాద్‌తో కలిసి ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రెండురోజుల క్రితం చెన్నైలో జరిగింది. నటుడు గౌతమ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన తరుణంలో విలేకరులతో మాట్లాడాలని భావించానన్నారు. అందుకు ఇది సరైన తరుణం అనిపించిందన్నారు. తాను నటించిన రంగూన్ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడటం సంతోషంగా ఉందన్నారు. సిపాయ్, ఇవన్ తందిరన్, హరహర మహాదేవకీ చిత్రాలను పూర్తి చేశానని, ప్రస్తుతం విజయ్‌సేతుపతితో కలిసి నల్ల నాళ్ పార్తు సొల్రేన్ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. నాన్న కార్తీక్ నటించిన చిత్రాల్లో అగ్నినక్షత్రం మంచి కథా చిత్రం అని పేర్కొన్నారు. ఆ చిత్రం రీమేక్‌లో నటించనని అన్నారు. తనకు నటనపై ఆసక్తి కలిగించిన చిత్రం కడల్ అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైతే నిసత్తు కలిగి ఉంటానో అప్పుడు తనను ఉత్సాహపరిచేది అమ్మేనన్నారు. అమ్మంటే తనకు చాలా ఇష్టం అని అన్నారు. ఇకపోతే తనది కచ్చితంగా ప్రేమ వివాహమే అవుతుందన్నారు. అయితే 35–40 వయసులోనే పెళ్లి చేసుకోవాలన్నది తన భావన అని పేర్కొన్నారు. తన తండ్రి, తాత చిత్రాలను తప్పకుండా చూస్తున్నానని చెప్పారు. నటుడిగా నాన్న లెజెండ్ అని పేర్కొన్నారు. షూటింగ్ స్పాట్లో ఆయన గురించి చెబుతున్నప్పుడు తనకు అర్థమైందని అన్నారు. కథానాయికల్లో ఆయనకు సరైన జోడీ నగ్మా, రేవతి అని అన్నారు.ఇకపై నటనలో మరింత శ్రద్ధ చూపుతానని గౌతమ్‌కార్తీక్ చెప్పారు. -
బర్త్ డే గిఫ్ట్.. బంగ్లా సొంతం చేసుకున్న హీరోయిన్!
బాలీవుడ్లో విలక్షణ నటిగా, ఫైర్‌బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె ఇటీవల 30వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తనకు తాను ఒక రాయల్ కానుక ఇచ్చుకుంది. ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఒక విస్తారమైన మూడంతస్తుల భవంతిని ఆమె సొంతం చేసుకుంది. ఈ భవనంలో తన కార్యాలయం ఏర్పరుచుకోవాలని, ఇందులోనే తాను మొదటిసారిగా దర్శకత్వం వహించబోతున్న సినిమాను ప్రారంభించాలని కంగన భావిస్తున్నట్టు సమాచారం. 'ఇది చాలా విశాలమైన మూడంతస్తుల భవనం. తనకు విశాలమైన కార్యాలయం ఉండాలని, అందులోనే తన దర్శకత్వ సినిమాను ప్రారంభించాలని కంగన కలలు కనేది. ఈ ఏడాదే ఆమె తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించబోతున్నది. త్వరలో నిర్మాతగా కూడా మారబోతున్నది' అని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'మిడ్ డే' పత్రిక పేర్కొన్నది. తాజాగా 'రంగూన్' సినిమాతో అలరించిన కంగన త్వరలో హన్సల్ మెహతా 'సిమ్రన్' చిత్రంతో పలుకరించబోతున్నది. ప్రముఖ తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రాణీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'మణికర్ణిక' చిత్రంలోనూ ఆమె నటించబోతున్నది. -
నా సినిమా ఫ్లాప్ కాబట్టి.. పారితోషికానికి కోత: నటి
మనస్సులో ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె తాజాగా నటించిన సినిమా 'రంగూన్'. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికిలపడింది. వసూళ్లలో దారుణంగా వెనుకబడిపోయింది. మొదటివారం రూ. 17.47 కోట్లు వసూలు చేసిన రంగూన్.. సోమవారం వచ్చేవారికి అతితక్కువగా 1.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు ఫ్లాప్ ముద్రపడటంతో ఇక తన పారితోషికానికి కోత పెట్టాలని సినీ జనాలు కోరుతారేమోనంటూ తాజాగా కంగన వ్యాఖ్యానించింది. క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనకు ఇటీవలికాలంలో ఎదురైన తొలి ఫ్లాప్ ఇదే. వరుస విజయాలతో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కంగన ఈ ఫ్లాప్‌తో కొంత తగ్గక తప్పదన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. రంగూన్ ఫ్లాప్ కావడంతో తన పారితోషికంలో కోత పెట్టాలని జనాలు అడిగే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న 'సిమ్రన్' సినిమాలో దొంగగా నటిస్తున్నారు. మరోవైపు తాను తరచూ బాధితగా చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నానని దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను బాధిత కార్డునో, మహిళా కార్డునో వాడుకోవడం లేదని, రాజీపడని ముక్కుసూటితనాన్ని ప్రదర్శిస్తున్నానని స్పష్టం చేసింది. -
రివ్యూలు బాగున్నాయి కానీ కలెక్షన్లు రాలేదు
ముంబై: విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్, కంగనా రౌనత్ నటించిన బాలీవుడ్ సినిమా రంగూన్‌కు రివ్యూలు పాజిటివ్‌గా వచ్చినా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాకు ఆశించిన, ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఈ నెల 24న రంగూన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకూ 30 కోట్ల రూపాయలు కూడా వసూలు కాలేదు. అభిమానులు, నెటిజెన్లు, సినీ విమర్శకులు ఈ సినిమాను ప్రశంసించినా ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోయేసరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఢీలాపడ్డారు. దీనికితోడు ఈ సినిమా పైరసీ బారిన పడటం కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని భావిస్తున్నారు. సినిమా మొత్తం ఆన్ లైన్ లో వచ్చేయడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. -
రంగూన్ సెలబ్రిటీ ‘రివ్యూ’
ముంబయి: షూటింగ్ ప్రారంభంనాటి నుంచే అంచనాలు పెంచిన సినిమా రంగూన్. దర్శకుడు విశాల్ భరద్వాజ్ మరో మాస్టర్‌పీస్‌తో రావడం ఖాయం అని కొబ్బరికాయ కొట్టిన రోజే బాలీవుడ్ సినీ వర్గాలు చెప్పాయి. దానికి తగినట్లుగానే చిత్ర ట్రైలర్లు, ప్రచార చిత్రాలు, పాటలు, యాక్షన్ సీన్లు, లవ్ సీన్లు సోహల్ మీడియాను ఒక ఊపుఊపాయి. ముఖ్యంగా చిత్ర నటులు కంగనా రనౌత్, షాహీద్ కపూర్, సైఫ్ అలీఖాన్ జోడీపై లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. యుద్ధ నేపథ్యంతోపాటు మంచి లవ్ స్టోరీ కూడా ఇందులో ఉండటంతో సినిమాపై భారీ అంచానలు ఏర్పడ్డాయి. దీనికి తగట్టుగానే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నిరాజనాలందుకుంటోంది. సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించగా సినిమా చూసిన వారంతా ఫుల్ జోష్‌తో కనిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ఇది నిజంగా విశాల్ భరద్వాజ్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ట్వీట్లలో ప్రశంసలు కురిపించారు. సైఫ్ నటుడిగా పునర్జన్మ పొందాడని, ఈ చిత్రం విశాల్ భరద్వాజ్ కెరీర్లో మరో మాస్టర్ పీస్ అంటూ పొగిడారు. విశాల్ భరద్వాజ్ సార్ మరో మాస్టర్‌పీస్. మేజికల్ సినిమాటోగ్రఫీ. పవర్‌ప్యాక్డ్ పర్ఫామెన్స్.. కంగనా, సైఫ్ అలీఖాన్‌ల నటన చాలా గొప్పగా ఉంది. ...సునీల్ శెట్టీ ‘బ్లడీ హెల్’(రంగూన్ చిత్రంలోని ఓ పాట)తోనే ఈ రోజు నిద్ర లేచాను. జులియా-నవాబ్ మాలిక్‌లను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాను. షాహిద్ కపూర్‌ను కూడా.. కంగనా ఐలవ్ యూ ...నటి కృతిసనన్ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరులో ఒక అద్భుత తపన కనిపించింది. పాత్రల చిత్రీకరణలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో ఆ తపన దర్శనమిస్తుంది. విశాల్ భరద్వాజ్ ముద్ర కనిపిస్తుంది. జూలియా పాత్రలో కంగన ఆకట్టుకొన్నది. షాహీద్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీ ప్రేమలో పడకుండా ఎవరూ ఉండరు సైఫ్గారు.. ...దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రాన్ని ద్వారా నేను సాహిత్యలోకంలో ప్రయాణించాను. ఆ కాలానికి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయం సాధించాడు. రంగూన్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంది. ...రణదీప్ హుడా కంగన రనౌత్ నటన, ప్రతిభ మరో స్థాయికి చేరింది. షాహీద్ కపూర్ మరోసారి వెండితెరపై మెరిశాడు. సైఫ్ అలీఖాన్ నటన అమోఘం. విశాల్ భరద్వాజ్ పనితీరు అద్భుతం ... రచయిత ప్రసూన్ జోషి ఈ సినిమా ఈ ఏడాది ఉత్తమ చిత్ర అవార్డుకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత అద్భుతంగా ఉంది. సైఫ్ నటన సూపర్ ... సైఫ్ భార్య కరీనా కపూర్ Another masterpiece by #VishalBhardwaj Power packed performances & magical cinematography! Cinema at its best! #SaifAliKhan #KanganaRanaut pic.twitter.com/QZOfgiv5Ku — Suniel Shetty (@SunielVShetty) 23 February 2017 Woke up with "Bloody Hell" in my head!☺️ Specially loved Julia-Nawab Malik together!❤️ @shahidkapoor
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
Advertisement