-
సలార్‌లో లేనిది ‘బబుల్గమ్’లో ఉంది: దర్శకుడు
‘సలార్ సినిమాకి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. వచ్చేవారం(డిసెంబర్ 29) 'బబుల్గమ్' సినిమా రిలీజ్ కాబోతుంది. సలార్‌లో లేని కంటెంట్ మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేని కంటెంట్ సలార్‌లో ఉంది(నవ్వుతూ..). కాబట్టి ప్రభాస్ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడియన్స్‌కి నచ్చితే రెండు సినిమాలను చూస్తారు. ‘బబుల్గమ్’ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి 'బబుల్గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత మా జర్నీ మొదలైయింది. ► ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ? డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా? ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది. ► ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా. ► రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు. ► మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది. ►ప్రస్తుతానికి నా దృష్టి 'బబుల్గమ్' విడుదలపై ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాను. -
పోలీస్ గెటప్‌లో అనసూయ
చెన్నై : వెండి తెరపై అనసూయ మళ్లీ మెరవనుంది. ఇటీవలే సొగ్గాడే చిన్నినాయనా చిత్రంలో తళుక్కన మెరిసిన అనసూయ... ఈసారి మాత్రం పవర్ఫుల్ పాత్రలో నటించనుంది. 'క్షణం' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆమె ఒదిగిపోనుంది. నీతి నిజాయితీకి మారు పేరుగా మలిచిన పాత్రలో అనసూయ నటించనుంది. పీవీపీ సినిమా నిర్మిస్తున్న 'క్షణం' చిత్రానికి రవికాంత్ పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం చెన్నైలో వెల్లడించింది. ఈ చిత్రంలో ఆ పాత్ర పోషించేందుకు పలువురు మహిళా పోలీసు అధికారులను అనసూయ దగ్గర నుంచి పరిశీలించారని తెలిపింది. ఆ పాత్రలో నటించేందుకు ఆమె చాలా ప్రిపేరయిందని ... ఆ తర్వాతే నటించేందుకు అనసూయ ఒప్పుకుందని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలోని అనసూయ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సస్పెన్స్, శృంగారం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు, అదా శర్మ ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్‌పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement