-
'రాయబారి'ని పక్కన పెట్టేశారా..?
కంచె సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్‌కు మంచి సక్సెస్ అందించిన దర్శకుడు క్రిష్. మరోసారి అదే హీరోతో పని చేయాలని భావించాడు. కంచె సినిమాలో వరుణ్‌ను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సైనికుడిగా చూపించిన క్రిష్, రెండో సినిమాలో రా ఏజెంట్‌గా చూపించాలని భావించాడు. ఈ సినిమాకు రాయబారి అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశాడు క్రిష్. అయితే ఇక పట్టాలెక్కటమే తరువాయి అనుకున్న తరుణంలో రాయబారి ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవటంతో పాటు ఎక్కువ శాతం సినిమా విదేశాల్లో షూట్ చేయాల్సి ఉండటంతో అక్కడి లోకేషన్ల పర్మిషన్లు కూడా కష్టంగా మారాయట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి వేరే సినిమా స్టార్ట్ చేయటం బెటర్ అని భావిస్తున్నాడు వరుణ్. ఇప్పటికే వరుణ్ తేజ్, దిల్ రాజు నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే రాయబారి తరువాత ప్రారంభం కావాల్సిన ఈ సినిమాను ముందుగానే పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
రాయభారీలో భారీ యాక్షన్
కంచె సినిమాతో మంచి సక్సెస్ సాధించిన హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ క్రిష్ మరోసారి కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. కంచె తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించని క్రిష్ మరోసారి వరుణ్ హీరోగా డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. లోఫర్ సినిమాతో కమర్షియల్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ఈ సినిమాలో గూడచారి పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను జార్జియాలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ భారీ స్కీ ఫైట్ సీక్వన్స్ ఉంది. జార్జీయాలోని వాతావరణం ఆ ఫైట్ సీక్వన్స్కు సూట్ అవుతుందన్న ఆలోచనతో అక్కడే సినిమాను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన కంచె సినిమాను కూడా జార్జీయాలోనే షూట్ చేశారు. మరోసారి వరుణ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తున్న, ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. -
క్రిష్ 'రాయబారి' ఎవరు.?
హీరోయిజానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం కథా బలాన్నే నమ్ముకొని సినిమా తీస్తున్న దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). తొలి సినిమా నుంచే తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ కంచె సినిమాతో కమర్షియల్‌గా కూడా ఆకట్టుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా కంచె మంచి కలెక్షన్లు సాధించటంతో పాటు దర్శకుడిగా క్రిష్ స్థాయిని కూడా మరో మెట్టు పైకి చేర్చింది. ప్రస్తుతం అదే జోష్‌లో మరో సినిమాకు కథా కథనాలు రెడీ చేసే పనిలో ఉన్న క్రిష్, ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. అచ్చమైన తెలుగు టైటిళ్లతో ఆకట్టుకునే క్రిష్ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 'రాయబారి' అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. అయితే ఈ టైటిల్‌తో తెరకెక్కనున్న సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరన్న విషయం పై మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు. తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, చాలా కాలంగా క్రిష్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. దీంతో క్రిష్ రాయబారి అఖిలే.. అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే క్రిష్ పండించే స్థాయి ఎమోషన్స్‌కు రెండో సినిమాతోనే అఖిల్ న్యాయం చేయగలడా..? అసలు అఖిల్ తదుపరి సినిమా క్రిష్ తోనే ఉంటుందా అన్న విషయం తెలియాలంటే మాత్రం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement