-
సీనియర్ నటి రేవతి డైరెక్షన్లో హీరోయిన్ కాజోల్
Kajol Begins Shooting For Revathy Salaam Venky Film: ‘సలామ్ వెంకీ’ అంటున్నారు నటి కాజోల్. నటి రేవతి ఈ సినిమాకు దర్శకురాలు. శుక్రవారం ఈ సినిమా ప్రారంభమైంది. ‘‘అందరికీ చెప్పాల్సిన ఓ కథతో మా జర్నీ మొదలుపెట్టాం. గమ్యం చేరుకోవడానికి తీసుకోవాల్సిన మార్గం, జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనే అంశాలతో ఈ సినిమా కథ ఉంటుంది. నమ్మలేని ఓ నిజమైన కథను ప్రేక్షకులకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు కాజోల్. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
హీరోయిన్ని డైరెక్ట్ చేయనున్న నటి
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా చేయనున్నారు. వారే కాజోల్, రేవతి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజోల్. రేవతి దర్శకత్వంలో పని చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని నటి తెలిపింది. ఆ సినిమా పేరు ‘ది లాస్ట్ హుర్రే’. హృదయానికి హత్తుకునే ఆ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే నటి నుంచి దర్శకురాలిగా మారిన రేవతి ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఐదో మూవీని కాజోల్ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని బీలైవ్ ప్రోడక్షన్స్, టేక్ 23 స్టూడియోస్ ప్రోడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: అమితాబ్ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) pic.twitter.com/s1shrnknlK — Kajol (@itsKajolD) October 7, 2021 -
నా కొడుకును చంపిందెవరు? ఎందుకు చంపారు?
టైటిల్ : ఇట్లు అమ్మ నటీనటులు : రేవతి, పోసాని కృష్ణమురళి, రవి కాలే తదితరులు నిర్మాత : బొమ్మకు మురళి దర్శకత్వం : సీ. ఉమామహేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: ‘‘అంకురం’’ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన గొప్ప సందేశాత్మక చిత్రం "ఇట్లు అమ్మ". సోనీ ఓటీటీ ద్వారా ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. అనూహ్యంగా తనకు శాశ్వతంగా దూరమైన కొడుకు కోసం తల్లి పడే తపన... ఆరాటమే ‘ఇట్లు అమ్మ’ కథాంశం. ఒక మనిషిని ఇంకో మనిషి పట్టించుకోనితనాన్ని ప్రశ్నించిన వైనమే ఈ సినిమా. దర్శకత్వంతోపాటు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను కూడా స్వయంగా ఉమామహేశ్వరరావు తన నెత్తిన వేసుకొని హృద్యంగా రూపొందించారీ సినిమాను. వైయుక్తిక బాధను ప్రపంచం బాధతో మిళితం చేస్తూ.. సామాజికత్వాన్ని చాటిన ఆలోచనాత్మక మూవీ ఇట్లు అమ్మ. ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా తను చెప్పదలచుకున్నఅంశం నుంచి ఎక్కడా డీవీయేట్ అవ్వకుండా చాలా పకడ్బందీగా కథను నడించారు. ముఖ్యంగా పేదరికంలో మగ్గిపోతున్న యువత ఆకలి కేకలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో అర్థం చేయించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయ్నతంలో జాతీయ, అంతర్జాతీయంగా పెచ్చరిల్లుతున్న హింసతోపాటు, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు సత్యాన్నే వధిస్తున్న వైనాన్ని చాలా తీవ్రంగానే ప్రశ్నించారు. ఈ విషయంలో ఉమా మహేశ్వరరావు మరో మెట్టు ఎక్కినట్టే చెప్పవచ్చు. ఎడతెగని వర్షం, హోరు గాలితో మొదలైన సినిమా, ప్రేక్షకుడి హృదయాంతరాళాలలో సునామీ రేపి ముగిస్తుంది. ఇక "ఇట్లు అమ్మ" కథ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన స్త్రీగా, తన కొడుకే లోకంగా బతికే తల్లి బాల సరస్వతిగా (రేవతి) అద్భుత నటన ఈ సినిమాకు హైలైట్. అనూహ్య పరిస్థితుల్లో బిడ్డను కోల్పోతుంది సరస్వతి. ఏ పాపమూ ఎరుగని అసలు చీమకు కూడా హానీ తలపెట్టని తన బిడ్డ అర్థాంతరంగా ఎందుకు మాయమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారనే ప్రశ్నలు ఆ ‘పిచ్చి తల్లి’ని నిద్ర పోనివ్వవు. అందుకే ఎలాగైనా తన కొడుకును పొట్టనపెట్టుకున్న వారి గురించి తెలుసు కోవాలనుకుని రోడ్డు మీదికి వస్తుంది. ఈ సత్యశోధనలో తల్లిగా ఆమెకెదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాలను చాలా చక్కగా దృశ్యీకరించాడు దర్శకుడు. అయితే తన కొడుకును చంపిందెవరు.. ఎందుకు లాంటి విషయాలను తెలుసుకోగలిగిందా? హంతకుడిని కనుక్కోగలిగిందా, తన కొడుకుతో పాటు, నేరస్తుడికి పట్టిన దురవస్థకు కారణాలను అన్వేషించే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు తదితర విషయాలను తెరపై చూడాల్సిందే. సీనియర్ నటి రేవతి తన పాత్రలో అద్భుతంగా నటించారు. మాతృహృదయ ఆవేదనను సంపూర్ణంగా ఆవిష్కరించారు. ఇంకా పోసాని కృష్ణమురళి తదితరులు తమ, తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హంతకుడుగా, అనాథగా నటించిన అబ్బాయి తన పాత్రలో లీనమై కన్నీళ్లు పెట్టిస్తాడు. ఎన్నో ప్రశ్నలతో అతని పాత్ర మన్నల్ని వెంటాడుతుంది. అలాగే కార్పొరేట్ మాయాజాలంపై ప్రజాగాయకుడు గోరటి వెంకన్న అప్పీరియన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. కామ్రేడ్లీ జంట కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. -
జ్యోతిక, రేవతిల జాక్‌పాట్
తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా జ్యోతి సుపరిచితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను పెళ్లాడిన తరువాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జాక్‌పాట్. సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విటర్ ద్వారా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో జ్యోతిక, రేవతి రకరకాల వేశాల్లో ప్రజలను మోసం చేసే పాత్రల్లో కనిపిస్తున్నారు. అంతేకాదు జ్యోతిక ఈ సినిమాటో యాక్షన్ సీన్స్‌కు ఇరగదీశారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కల్యాణ్ దర్శకుడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
నటి రేవతిపై ఫిర్యాదు
పెరంబూరు: నటి రేవతిపై ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కేరళ రాష్ట్రం, కొచ్చికి చెందిన సియాజ్ జమాస్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఎర్నాకులం క్రైం పోలీసులకు రేవతిపై ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని ఏళ్ల క్రితం షూటింగ్లో ఒక 17 ఏళ్ల బాలికపై ఎవరో అత్యాచారయత్నం చేసినట్లు నటి రేవతి చెప్పారన్నారు. అయితే ఆ బాధితు రాలు ఎవరన్నది రేవతి బయట పెట్టకుండా దాచారని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని, లైంగిక వేధింపులకు గురైన ఆ నటి ఎవరన్నది చెప్పకుండా దాచిపెట్టిన నటి రేవతిపైనా కేసు నమోదు చేయాలని పేర్కొన్నాడు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన నటి రేవతి 17 ఏళ్ల నటి అర్ధరాత్రి తాను బస చేసిన హోటల్ గది తలుపు తట్టి భయంతో కాపాడండి అంటూ కేకలు వేసింది నిజమేనన్నారు. అయితే ఆ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు తాను చెప్పలేదని అన్నారు. అర్ధరాత్రి ఎవరో తన గది తలుపులు తట్టడంతో ఆ బాలిక, బామ్మ భయంతో తన గదికి వచ్చారని ఆ రాత్రి తాము ముగ్గురం నిద్రలేకుండా గడిపినట్లు తెలిపారు. వృతి రీత్యా వచ్చిన మహిళలకు రక్షణ కల్పించాలనే తాను ఆ సంఘటన గురించి చెప్పానని నటి రేవతి వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement