-
సామాన్యుని సృష్టికర్తకు గూగుల్ నివాళి
'కామన్ మేన్' సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘనంగా నివాళి అర్పింపించింది. ఆర్కే లక్ష్మణ్ 94వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోను 'డూడుల్'గా పెట్టింది. తన డెస్క్ వద్ద దీక్షగా పనిచేసుకుంటున్న ఆర్కే లక్ష్మణ్, ఆయన కార్టూన్ కేరెక్టర్ 'కామన్ మేన్' లు కలిసి ఉన్న చిత్రాన్ని డూడుల్ గా రూపొందించింది. ఆర్కే లక్ష్మణ్ గా సుపరిచితులు అయిన ఈ కామన్ మేన్ సృష్టికర్త పూర్తి పేరు రాశిపురం కృష్ణ స్వామి అయ్యర్ లక్ష్మణ్, ఆయన అక్టోబర్ 23, 1924లో మైసూర్ లో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. కుటుంబంలోని ఆరుగురు కుమారుల్లో లక్ష్మణ్ చివరి వారు. మాల్గుడి సృష్టి కర్త ఆర్ కే నారాయణ్, లక్ష్మణ్ ఇద్దరూ సోదరులు కావడం విశేషం. ముంబాయి నుంచి ప్రచురించే ఇంగ్లీష్ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా లో కార్టూనిస్టుగా పనిచేశారు. కన్నడ వ్యంగ్య పత్రిక కొరవంజిలో ఇలస్ట్రేటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆయన పద్మవిభూషణ్, మెగసెసే , తదితర విశేష పురస్కారాలు ఎన్నోఅందుకున్నారు. కామన్ మేన్ పాత్రను సృష్టించి, దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానంకల్పించిన లక్ష్మణ్ సామాన్యుని పక్షాన నిలచి రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్ర్తాలు సంధించేవారు. ఆయన జనవరి 26న పూనేలో మరణించారు. -
ఆర్కే లక్ష్మణ్‌కు తుది వీడ్కోలు
సాక్షి, ముంబై/పుణే: పదునైన కార్టూన్లతో కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌కు దేశం కంటతడితో తుడి వీడ్కోలు పలికింది. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను మంగళవారం పుణేలోని వైంకుఠ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ‘కామన్ మేన్’ కార్టూన్ల సృష్టికర్తకు గౌరవంగా సైనిక వందనం చేశారు. లక్ష్మణ్ తనయుడు శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. అంతకుముందు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, విద్యామంత్రి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే, లక్ష్మణ్ పనిచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాజీ సంపాదకుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులు ల క్ష్మణ్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని జవదేకర్ అందజేశారు. ‘గొప్ప కార్టూనిస్టును, పొద్దుటిపూట నవ్వును శాశ్వతంగా కోల్పోయాం’ అని మోదీ అందులో పేర్కొన్నారు. అంత్యక్రియలకు ముందు లక్ష్మణ్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శన కోసం సింబయోసిస్ ఇన్స్టిట్యూట్లో ఉంచారు. లక్ష్మణ్ సృష్టించిన కామన్ మేన్ ప్రపంచం ఉన్నంతవరకు ఉంటాడని, రాజకీయ వ్యవస్థకు అతడు చెక్ పెడతాడని ఫడ్నవిస్ పేర్కొన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు లక్ష్మణ్ పేరిట స్మార కాన్ని నిర్మిస్తామని తెలిపారు. తన తండ్రి బాల్ ఠాక్రేతో లక్ష్మణ్కున్న అనుబంధాన్ని ఉద్ధవ్ గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల లక్ష్మణ్ దీర్ఘకాల అనారోగ్యంతో సోమవారం పుణేలో మృతిచెందడం తెలిసిందే. ఆయన మృతికి బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అమీషా పటేల్ తదితరులు ట్వీటర్లో నివాళి అర్పించారు. లక్ష్మణ్ కుటుంబం వద్ద వందలాది చిత్రాలు లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో సంభాషణల సమయంలో వేసిన వందలాది చిత్రాలు(డూడుల్స్) పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ప్రచురితం కాని ఇవి ఆయన అన్న కుమారుడు ఆర్ఎస్ కృష్ణస్వామి వద్ద ఉన్నాయి. ల క్ష్మణ్ 1975-1991 మధ్య సెలవుల కోసం మైసూర్, బెంగళూరు వెళ్లినప్పుడు వీటిని గీశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement