-
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్‌లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్‌లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్‌ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
స్పీడందుకున్న కారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త వెనుకంజగా కనిపించిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీకి పునరై్వభవం వస్తుందన్న ధీమా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా.. కొందరు నేతలు పార్టీని వీడటం, ఎంపీలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల తరఫున లోక్‌సభ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని అంటున్నాయి. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, తన ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సంధిస్తున్న విమర్శనా్రస్తాలు.. ఉద్యమకాలం నాటి సభలను తలపిస్తున్నాయని నేతలు చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా.. మళ్లీ మీరే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ గణనీయమైన స్థాయిలోనే లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకం వస్తోందని కార్యకర్తలు ఆశావహంగా ఉన్నారు. జనం నుంచి మంచి స్పందనతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలకే కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజులపాటు బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.కేసీఆర్‌కు మహిళలు మంగళ హారతులు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారని.. బస్సుయాత్ర సాగే మార్గంలో రైతులు, యువకులు కేసీఆర్‌ను చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల కోసం పార్టీపరంగా జన సమీకరణ చేస్తున్నా.. అంచనాలకు మించి జనం కూడా వస్తున్నారని అంటున్నాయి. స్థానికులతో మమేకం.. రాత్రి బసతోనూ.. బస్సుయాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులతో, వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్ తాగుతూ, స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. రైతులతో ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. తాను చేస్తున్న పోరాటంలో కలసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్ స్థానికంగా బస చేస్తున్నారు.ఆ సమయంలో, మరుసటి రోజు ఉదయం.. స్థానిక నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ముఖ్య నేతల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలను మరింతగా ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీలో సమన్వయం.. ప్రచార వ్యూహాలు కూడారాత్రి బస వద్ద సంబంధిత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ప్రచార తీరుతెన్నులపై సమీక్షిస్తున్నారు. బూత్ స్థాయి వరకు ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ నేరుగా కలసి చేస్తున్న సూచనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకం కనిపిస్తోందని అంటున్నారు.ఈ క్రమంలోనే బస్సుయాత్ర, రోడ్ షోలను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని.. నియోజకవర్గాల్లో తమ సత్తా చూపాలని ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు భావిస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శనా్రస్తాలతో.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం.. తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, వరికి రూ.500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ.. బీఆర్ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ.. కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పడం ప్రభావం చూపుతోందని చెప్తున్నాయి. ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమా! లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా ప్రచార ఆరంభంలో విమర్శలు చేశాయి. కానీ కేసీఆర్ బస్సుయాత్ర, ప్రజా స్పందనతో ఆ అభిప్రాయాన్ని మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో బీఆర్ఎస్కు 8 సీట్లలో సానుకూలత ఉందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 12 సీట్ల వరకు వస్తాయని చెప్తుండటం గమనార్హం. ఈసారి కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్తున్నాయని ఉదహరిస్తున్నారు. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. -
ప్రశ్నిస్తే.. గొంతు నొక్కారు!
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన. వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు. పంటలు ఎందుకు ఎండాయి? ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. హామీల అమలు ఏది? కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా? పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు.. ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి. మీరు లేని లోటు కనిపిస్తోందిసారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణిమళ్లీ కరువు వచ్చిందిమీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లామాకు అండగా నిలవాలికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు -
నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం..
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత వెంటనే బస్సుయాత్ర తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన షెడ్యూల్ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలో రోడ్ షోకు కేసీఆర్ హాజరవుతారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రచారం నిలిపివేసిన కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్న కేసీఆర్ రాత్రికి రామగుండం చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో జరిగే రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ వరకు గతంలో నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగానే కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10న సిరిసిల్లలో రోడ్‌షో, సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గురువారం జమ్మికుంట, వీణవంకలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రజా స్పందన ఎలా ఉంది? బుధవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కేసీఆర్ గురువారం పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడి పార్టీ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటివరకు బస్సుయాత్ర, రోడ్ షోలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. రాబోయే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. ప్రచార లోపాలను సరిదిద్దుకుని పార్టీ యంత్రాంగంతో మరింత సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలతో జరిగే నష్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్‌చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement