-
రూనీని వెనక్కునెట్టిన సునీల్ చెత్రి
కెరీర్లో 54వ గోల్ నమోదు న్యూఢిల్లీ: బెంగళూరులో జరుగుతున్న ఎఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రీ మరో ఘనత సాధించాడు. బుధవారం కిర్గిజిస్తాన్తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేసిన సునీల్ తన కెరీర్లో 54వ గోల్ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్, మాంచెస్టర్‌ల ఆటగాడు వేనీ రూనీ(53)ని వెనక్కునెట్టి ప్రస్తుతం ప్రపంచంలో చురుకుగా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ సాధించిన నాలుగో ప్లేయర్‌గా సునీల్ నిలిచాడు. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తరఫున సునీల్ ప్రాతినిథ్యం వహిస్తాడు. స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ (58) , క్లిన్ట్ డెంప్సే (56) గోల్స్‌తో సునీల్ కన్నా ముందున్నారు. మొత్తం 73 గోల్స్‌తో సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. -
మేం పుంజుకుంటాం: రూనీ
ఇంగ్లండ్ సాకర్ స్టార్ వేన్ రూనీ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు మూడడుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ఫుట్‌బాల్ సీజన్లో భాగంగా శనివారం అర్సెనల్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఈ మూడు గోల్స్ సాధిస్తే సర్ బాబీ చార్ల్ టన్ 249 గోల్స్ రికార్డును రూనీ అధిగమిస్తాడు. కొత్త మేనేజర్ నేతృత్వంలో జట్టు బాగా సిద్ధమైందన్న రూనీ ఈ సీజన్లో తమ మాంచెస్టర్ యునెటైడ్ పుంజుకుంటుందని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే... మాంచెస్టర్‌కు కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ రేసులో నిలుస్తారా? మాకిది చాలెంజింగ్ సీజన్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకుంటామన్న నమ్మకముంది. కొన్ని నెలలుగా మేనేజర్ మౌరిన్హో జట్టును బాగా తీర్చిదిద్దారు. జట్టు కూర్పు కూడా బాగుంది. మైదానంలో మా ఆటను చూసి మీరు అదే చెప్తారు. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో మీకు అవకాశముంటుందా? నేను బరిలోకి దిగుతాననే భావిస్తున్నా. కానీ ఇది ఫుట్‌బాల్. ఒక్కోసారి బెంచ్‌కే పరిమితమవ్వొచ్చు. అరుుతే ఇప్పుడు మాత్రం నేను ప్రాక్టీసులో చాలా బాగా చెమటోడ్చాను. తప్పకుండా ఆడతాననే అనుకుంటున్నాను. మీపై తరచూ వచ్చే విమర్శల్ని వింటే మీకేమనిపిస్తుంది? నేను ముందుగా నా కోచ్ సూచనల్ని వింటాను. జట్టు సహచరుల మాటలు వింటా. నా చుట్టూ మిగతా వాళ్లేమంటారో పట్టించుకోను. చాలా సందర్భాల్లో అర్థంలేని విమర్శలే ఎక్కుపెడతారని నాకనిపిస్తుంది. ఆటలో గెలుపోటములు సహజం. గెలిచినప్పుడు ఓ రకంగా... ఓడితే మరో రకంగా స్పందించాల్సిన అవసరం నాకు లేదు. బరిలో దిగేటప్పుడు మీరే స్థానంలో ఆడాలని కోరుకుంటారు? నేనిదివరకే ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు బదులిచ్చాను. ఇపుడు మళ్లీ అదే చెబుతున్నాను. మ్యాచ్ సమయానికి మేనేజర్ ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో ఆడతాను. ఇప్పటి వరకు నన్ను ఏ జట్టు కూడా ప్రత్యేకించి ఈ స్థానం కోసమని తీసుకోలేదు. ఇప్పటికే ఎన్నో స్థానాల్లో ఆడాను. మైదానంలో ఏ పొజిషన్కై నా నేను సిద్ధమనే నాకనిపిస్తుంది. (ఈపీఎల్ సీజన్ నేపథ్యంలో రూనీ ఇంటర్వూ ‘సాక్షి’కి ప్రత్యేకం)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement