-
క్వార్టర్స్‌లో వృశాలి
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు గుమ్మడి వృశాలి, చిట్టబోయిన రాహుల్ యాదవ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వృశాలి 11–8, 15–14, 11–6తో అనస్తాసియా షరపోవా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రాహుల్ యాదవ్ 11–13, 11–4, 11–6, 11–7తో నాలుగో సీడ్ శుభాంకర్ డే (భారత్)పై గెలుపొందాడు. టాప్ సీడ్‌కు కశ్యప్ షాక్ మరోవైపు కాలిఫోర్నియాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పారుపల్లి కశ్యప్, శ్రీకృష్ణప్రియ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో కశ్యప్ 21–16, 10–21, 21–19తో టాప్ సీడ్, ప్రపంచ 15వ ర్యాంకర్ లీ హున్ (కొరియా)ను ఓడించగా... శ్రీకృష్ణప్రియ 21–13, 21–16తో మాయా చెన్ (అమెరికా)పై గెలిచింది. అయితే రుత్విక శివాని 14–21, 27–25, 16–21తో అయా ఒహోరి (జపాన్) చేతిలో, ఉత్తేజిత రావు 25–23, 13–21, 16–21తో గేల్ మహులెట్టి (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మతోపాటు మహారాష్ట్ర అమ్మారుు అరుంధతి పంతవానె ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సిరిల్ 21-7, 21-11తో ఆండ్రీ జదనోవ్ (రష్యా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అరుంధతి 21-5, 21-9తో అనస్తాసియా షరపోవా (రష్యా)పై గెలిచింది. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అరుంధతితో రుత్విక శివాని; ఎకతెరీనా కుట్ (రష్యా)తో తన్వీ లాడ్; మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)తో సిరిల్ వర్మ తలపడతారు. రుత్విక, తన్వీలకు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మేఘన-పూర్వీషా రామ్ జంట, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ గురువారం బరిలోకి దిగుతారుు. పోరాడి ఓడిన కృష్ణప్రియ మరోవైపు బ్యాంకాక్‌లో జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు శ్రీ కృష్ణప్రియ తొలి రౌండ్లో పోరాడి ఓడింది. క్వాలిఫరుుంగ్ ద్వారా మెరుున్ ‘డ్రా’లో అడుగుపెట్టిన శ్రీ కృష్ణప్రియ మొదటి రౌండ్లో 17-21, 21-16, 15-21తో సుసాంతో యులియా యోసెఫిన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement