-
Saba Azad HD Photos: హృతిక్ రోషన్ గర్ల్‌ఫ్రెండ్ గురించి ఈ విషయాలు తెలుసా?(ఫోటోలు)
-
స్టార్ హీరో గర్ల్ఫ్రెండ్లో ఈ టాలెంట్ కూడా ఉందా?
ఆమె ఆ స్టార్ హీరో గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అతడితో ప్రేమలో పడింది. పలు సందర్భాల్లో ఈ జంట కలిసి కనిపిస్తుంటారు. ఆమె నటి అని చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు ఎవరికీ తెలియని ఓ కొత్త టాలెంట్ ని బయటపెట్టి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) బాలీవుడ్ స్టార్ హీరోల్లో హృతిక్ రోషన్ కాస్త డిఫరెంట్. త్వరగా సినిమాలు చేసేయకుండా విభిన్న కథలతో మూవీస్ చేస్తుంటాడు. వ్యక్తిగత జీవితానికి వస్తే దాదాపు 14 ఏళ్లపాటు సంసారం చేసిన సుస్సానే ఖాన్‌కి విడాకులు ఇచ్చేశాడు. ప్రస్తుతం నటి, డైరెక్టర్ సబా ఆజాద్‌తో రిలేషన్లో ఉన్నాడు. హృతిక్ కంటే సబా ఆజాద్‌ది చాలా చిన్న వయసు. ఈ విషయమై అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. సరే అదంతా పక్కనబెడితే రీసెంట్గా ఓ ఫ్యాషన్ షోలో పాటలు పాడిన సబా ఆకట్టుకుంది. ఇప్పటివరకు అందరికీ ఈమె నటి అని మాత్రమే తెలుసు. ఇప్పుడు అదిరిపోయే ర్యాప్ సాంగ్స్ పాడి ఆశ్చర్యపరిచింది. అయితే ఈమె ఎప్పటినుంచో సింగర్ అని, సొంతంగా ఓ బ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
ఆ వార్తలు నా మనసును తీవ్రంగా బాధపెట్టాయి: సబా
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనితో నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉందంటూ చాలా సార్లు బీటౌన్‌లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరు జంటగా పలు ఈవెంట్లకు హాజరు కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కాగా.. సబా ఆజాద్ ప్రస్తుతం హూ ఈజ్ యువర్ గైనెక్? అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సబా ఆజాద్ తనపై వస్తున్న రూమర్స్‌పై తొలిసారి స్పందించారు. తమ రిలేషన్షిప్ గురించి చాలామంది ట్రోల్స్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. వాటితో తాను చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపింది. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) సబా ఆజాద్ మాట్లాడుతూ.. 'ఇతరుల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే నేనేం రాయిని కాదు కదా. వారు చేసే కామెంట్స్ నా మనసును బాధపెట్టాయి. ఆ ట్రోలింగ్స్ చూసి నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నా ఇష్టం కదా. మీరు కూడా మీ లైఫ్‌ను మీకు ఇష్టమొచ్చినట్లు జీవించండి అని చెప్పాలనుకున్నా.' అని అన్నారు. అయితే కొన్ని రోజులకు ఇలాంటి మాటలను పట్టించుకోకూడదని పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేసి మనశ్శాంతితో జీవిస్తున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్, నటి సబా ఆజాద్ రిలేషన్లో ఉన్నట్లు అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తన ప్రేమ చూపిస్తూ వచ్చారు. వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్ద వ్యక్తితో ప్రేమలో ఉండటంపై సబాను పలువురు ట్రోల్ చేశారు. విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమాయణం ఏంటి? అని ప్రశ్నించారు. కాగా.. హృతిక్ డిసెంబర్ 20, 2000లో సుస్సానే ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు హ్రేహాన్, హృదాన్ ఉన్నారు. దీంతో హృతిక్, సబా జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం హృతిక్ ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'లో నటిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనిల్ కపూర్ కనిపించనున్నారు. (ఇది చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
హృతిక్ రోషన్ రూ.100 కోట్ల భారీ ఖర్చు.. లవర్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈ బాలీవుడ్ స్టార్ రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. కొంత కాలంగా అతని స్నేహితురాలు, సింగర్ సబా ఆజాద్‌తో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆ మూడు అంతస్తుల భవనాల్లోకి మారునున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. (చదవంండి: హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్) హృతిక్ రోషన్ 2014లో తన సతీమణి సుజేన్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సబా ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ జంట ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముంబైలో డిన్నర్ డేట్ తర్వాత మొదటిసారి కనిపించిన ఈ జంట.. అప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. రోషన్ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్లో సబా పాల్గొనటం, పార్టీల్లో ఇద్దరు చేతులు పట్టుకుని కనిపించడంతో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. హృతిక్ చివరిసారిగా ఇటీవల విడుదలైన విక్రమ్ వేదలో కనిపించారు. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విక్రమ్ వేద బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే, రోహిత్ సరాఫ్, యోగితా బిహానీ, షరీబ్ హష్మీలతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. మరోవైపు సబా తదుపరి చిత్రంలో నమిత్ దాస్, గీతాంజలి కులకర్ణితో కలిసి నటించనుంది. ఈ సినిమాలో ఆమె ఫ్రెంచ్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం సాంగ్ ఆఫ్ ప్యారడైజ్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement