-
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
-
డీఎన్ఏ టెస్టు చేయించుకున్నా.. నేనెవరంటే!
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన లౌకికవాదాన్ని తెలియజెప్పేందుకు ఓ మంచి ప్రయత్నం చేశాడు. దేశ ప్రజలందరికీ తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. ఒక చిన్న వీడియో రూపొందించి.. దాని ద్వారా తన మతం ఏంటో అందరికీ తెలియజేశాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఆ వీడియోకు 16.66 అనే టైటిల్ పెట్టాడు. తనది ఏ మతమో తెలుసుకోడానికి తాను డీఎన్ఏ టెస్టు్ చేయించుకున్నానని ముందుగా అందులో చెబుతాడు. వీడియోలో ఎక్కడా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని నవాజుద్దీన్.. అన్నింటినీ తెల్లటి ప్లకార్డుల మీద నల్లటి మార్కర్‌తో రాసి వివరిస్తాడు. ''హాయ్ నేను నవాజుద్దీన్ సిద్దిఖీని. నేను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నా. దాని రిపోర్టు వచ్చింది. అందులో నేను ఎవరని ఉందంటే..'' అంటూ మొదలుపెడతాడు. అప్పటివరకు మామూలు ప్యాంటు, షర్టులలో ఉన్న నవాజ్.. ఆ తర్వాతి నుంచి ఒక్కో డ్రస్ మారుస్తుంటాడు. తెల్లటి కుర్తా పైజమా ధరించి, నుదుటన సింధూరం పెట్టుకుని, భుజం మీదుగా కాషాయ వస్త్రం ఒకటి కప్పుకొని.. తాను 16.66% హిందువునని చెబుతాడు. ఆ తర్వాతి షాట్లో నల్లటి బంద్గలా సూట్ వేసుకుని, తలమీద తెల్లటి ఫర్టోపీ పెట్టుకుని తాను 16.66% ముస్లింనని అంటాడు. ఆపై గెడ్డం, మీసాలు, తలమీద ఎర్రటి తలపాగాతో కనిపించి 16.66% సిక్కునని వివరిస్తాడు. అంతేకాదు, తెల్లగా పైనుంచి కింది వరకు ఒకటే డ్రస్ వేసుకుని, మెడలో శిలువ చైన్ ధరించి తాను 16.66% క్రిస్టియన్ అని కూడా చెబుతాడు. ఆ తర్వాత బౌద్ధులు ధరించే కాషాయ దుస్తులు ధరించి, తాను 16.66% బౌద్ధుడినంటాడు. మిగిలిన 16.66% ప్రపంచంలో మిగిలిన అన్ని మతాలు కలిసి ఉన్నాయంటాడు. చివరగా.. తన తన ఆత్మను కనుగొన్నప్పుడు మాత్రం, తాను నూటికి నూరుశాతం కళాకారుడినని స్పష్టం చేస్తాడు. దేశంలో లౌకివాదం మీద పెరుగుతున్న చర్చ నేపథ్యంలో అందరూ సమానమేనని చెప్పడానికి నవాజుద్దీన్ తనదైన శైలిలో ఇలా ఒక ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నవాజ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. మున్నా మైఖేల్, మంటో, మామ్, బాబుమొషాయ్ బందూక్‌బాజ్ సినిమాల్లో అతడు నటిస్తున్నాడు. Sixteen Point Six Six...https://t.co/MKS9gBY6R1 — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 24 April 2017
ఓటు ఎలా వేయాలో తెలుసా..?
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Priyanka Kholgade: స్టైలిష్ లుక్‌లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
మేతకొచ్చాడు.. మరో నేత!
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ
చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై టీడీపీ మూకల రాయి దాడి
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
Advertisement