-
మరో సెల్ఫీ విషాదం.. బాలుడి మృతి
సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అలాంటి సంఘటనే ఆదివారం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట సెల్ఫీ తీసుకుంటూ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో తీవ్రంగా గాయపడ్డ యువకుడు నేటి సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి... పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. ఆయన వద్ద ఓ లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. ఈ క్రమంలో శుక్రవారం బంధువు ఇంట్లో శుభకార్యానికి భార్యతో సహా వెళ్లాడు. జరిగే దారుణాన్ని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఇంట్లో ఉన్న వారి 15 కుమారుడు ఏళ్ల రమన్‌దీప్ సింగ్ తన తండ్రి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.. రివాల్వర్‌ను కణతకు ఆనించుకుని సెల్ఫీకి ఫోజిస్తూ.. ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై నొక్కడంతో రివాల్వర్ పేలింది. పేలుడు శబ్ధం విన్న చుట్టుపక్కల వాళ్లు తీవ్రంగా గాయపడ్డ రమన్ దీప్ ను ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రులు కూడా ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చి కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డారు. రెండు రోజులపాటు లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో ప్రాణాలతో పోరాడిన రమన్ దీప్ నేటి సాయంత్రం మృతిచెందాడు. రమన్ దీప్ ఇకలేడన్న వార్త విన్న బంధువులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
రివాల్వర్‌తో సెల్ఫీ తీసుకోబోయి...
పంజాబ్: సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి. అలాంటిదే ఓ ఘటన శుక్రవారం పఠాన్‌కోట్‌లో జరిగింది. అయితే కుర్రాడి అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది. పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్ సింగ్ కాంట్రాక్టరు. అతని వద్ద లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది. శుక్రవారం తెలిసిన వారింట్లో శుభకార్యానికి భార్యను తీసుకొని వెళ్లాడు. ఇంట్లోనే ఉన్న అతని కుమారుడు, 15 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ సొరుగులోంచి రివాల్వర్ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. రివాల్వర్‌ను కణతకు ఆనించుకొని సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై వేలుపడి రివాల్వర్ పేలింది. తుపాకీ శబ్ధం విన్న ఇరుగుపొరుగు వచ్చి చూడగా అమన్‌దీప్ గాయపడి ఉన్నాడు. అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకం
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సన్న వడ్లకే బోనస్సా?
Lok Sabha Election 2024: సెన్స్‌క్స్ డౌట్!
అమెరికా బెదిరింపు ధోరణి
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
మళ్లీ ఓడిన రాజస్తాన్
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్‌క్స్ డౌట్!
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Advertisement