-
తలకు షాంపూ.. ఇలా ఐతే మంచిది!
ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. తలకు నూనె పట్టించడం షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది. తల దువ్వుకోవడం షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్ ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది. తలకు చన్నీరే మంచిది జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. (చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!) -
వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!
సాక్షి, ముంబై: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ధరలు మోత మోగనున్నాయి. ముఖ్యంగా ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్ (ఎస్ఎఫ్ఏ)’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో రాబోయే నెలల్లో సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (MG Comet EV: ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్ల తయారీలో వినియోగించే కీలక ముడిపదార్థమైన ‘శాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్’పై యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీని పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనకు కనున కేంద్రం ఆమోదం లభిస్తే ధరలు భారం తప్పదు. ఎస్ఎఫ్ఏ అనేది సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో కీలకమైంది. అలాగే ఈ పన్ను పెంపు ద్వారా ఇతర పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే సోడియం లారెత్ సల్ఫేట్ (SLS) ఉత్పత్తిదారుపై ప్రభావాన్ని చూపుతాయని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఇండియాకుశాచురేటెడ్ ఫ్యాటీ ఆల్కహాల్స్ ఇండోనేషియా, మలేషియా, థాయిల్యాండ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. దీంతో అధిక యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ విధించాలని రెండు నెలల క్రితం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ కేంద్రానికి సూచించింది. దీంతో ఇప్పటికే మన దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నందున ఇది మరింత ధరల పెరుగుదలకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది. ప్రతిపాదిత సుంకం సరుకు ఖర్చు, బీమా, సరుకువిలువలో 3 శాతం నుండి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) మరోవైపు ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది కొత్త టారిఫ్ నిర్మాణాన్ని వర్తింపజేయవద్దని ఇండియన్ సర్ఫ్యాక్టెంట్ గ్రూప్ (ఐఎస్జీ) కన్వీనర్, మనోజ్ ఝా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఈ చర్యతో దిగువ ఉత్పత్తుల దిగుమతుల ధరలు పెరుగుతాయని, కంపెనీల లాభ దాయకతపై కూడా ప్రభావం చూపుతుందని, ఇది తదుపరి ఉద్యోగాల కోతకు దారితీయవచ్చని పేర్కొన్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
Hair Care: ఉంగరాల జుట్టుతో ‘చిక్కులు’! సోంపు ఆకులను ఇలా వాడితే..
Hair Care Tips In Telugu: ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం. ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం, అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం. కొంచెం రింగులు తక్కువ ఉండి, అలలలాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా నురగతో శుభ్రపరుచుకోవడం చేసుకుంటే ప్రయోజనాలుంటాయి. ఒత్తైన కేశాల కోసం సోంపు ఆకులు ►సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మృదుత్వం సంతరించుకుంటాయి. ►రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంపు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. ►నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ►ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి. చదవండి: Hair Care Tips: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా షాంపూ తయారు చేసుకోండి! Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
డవ్ షాంపూ వాడే వాళ్ళకి షాక్... రీకాల్ చేసిన కంపెనీ
-
అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్ వద్దు ఎందుకంటే?...
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అదీగాక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ సేనలు పుంజుకుంటూ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయ ఢంకా మోగించనుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కి అడ్డుకట్టేవేసేలా... రష్యా అధ్యక్షుడు పుతిన్ పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక వేళ రష్యా ఓడిపోతానన్న అనుమానం తలెత్తిన వెంటనే అణుదాడులకు దిగుతుందని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అణుయుద్ధం జరిగేటప్పుడూ జుట్టుకి కండిషనర్‌ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని స్వయంగా పుతిన్ చెప్పినట్లు అమెరికా చెబుతుంది. ఈ మేరకు అమెరికా తన పౌరులకు అలాంటి విపత్కర సమయాల్లో చేయాల్సినవి, చేయకూడనవి విషయాలు గురించి వివరించింది. అణు యుద్ధం సమయంలో హెయిర్ కండీషనర్ వినియోగించటం ప్రాణాంతకమని పేర్కొంది. అంతేగాదు అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి సమయాల్లో వీలైనంత త్వరగా షాంపుతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతమని తెలిపింది. తలస్నానం చేసిన వెంటనే కండీషనర్‌ని మాత్రం వినియోగించొద్దు అని సలహ ఇచ్చింది. షాంపూ జుట్టుని శుభ్రపరిస్తే..కండీషనర్‌లోని సర్ఫ్యాక్టెంట్లు నీటీని, నూనెను ఆకర్షిస్తాయని చెప్పింది. ఈ కండీషనర్, మీ జుట్టుకి రేడియోధార్మిక వంటి పదార్థాల మధ్య జిగురులా పని చేస్తుంది. దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టును గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోతాయని, దీంతో ప్రాణాంతకంగా మారుతోందని అమెరికా హెచ్చరించింది. అలాగే ఇలాంటి అణు విస్పోటనం జరిగినప్పుడూ...రేడియేషన్‌ని నివారించటానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనంలో ఆశ్రయం పొందాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదని సూచించింది. (చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్‌తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement