-
సైన్స్‌కు ఆధారం ఆధ్యాత్మికతేనా?
శేర్ (సిరాజ్) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హర ఓం హర’. అశోక్ కుల్హర్, దేవేంద్ర మదన్ సింగ్ నేగి నిర్మిస్తు్తన్న ఈ చిత్రంలో గంగాధర్, కర్ణిక ఇతర ముఖ్య తారాగాణం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ తూర్పు గోదావరి జిల్లాలో ముగి సింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఆధ్యాత్మికత అంతా సైన్స్‌తోనే ముడిపడి ఉందని, సైన్స్‌కు ప్రధాన వనరు ఆధ్యాత్మికతేనని నిరూపిస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. తెలుగుతో ΄ాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో సుమన్, ఆమని కీలక ΄ాత్రధారులు. -
రజనీ సినిమాలో నాని?
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నాని సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. లైకా,ప్రోడక్షన్స్పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా హీరో నాని పేరు తెరపైకి వచ్చింది. కథ రీత్యా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు నానీని చిత్ర యూనిట్ సంప్రదించిందని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సో.. ఈ సినిమాకి నానీని అడిగారా? లేదా అనేది త్వరలో తెలిసిపోతుంది. -
'షేర్' మూవీ రివ్యూ
టైటిల్ : షేర్ తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, దర్శకుడు : మల్లికార్జున్ నిర్మాత : కొమర వెంకటేష్ సంగీతం : థమన్ 2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని దర్శకుడు మల్లిఖార్జున్ ఎంత వరకు నిలబెట్టుకున్నాడు. దశాబ్ద కాలం తరువాత హిట్ ట్రాక్‌లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ షేర్ సినిమాతో ఆ టెంపోను కంటిన్యూ చేశాడా..? రివ్యూలో చూద్దాం. కథ : గౌతమ్ ( కళ్యాణ్ రామ్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్‌గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి. తన జీవితంలో ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటుడిగా కళ్యాణ్ రామ్ తన మార్క్ చూపించాడు. పటాస్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ అదే జోరు చూపించాడు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్‌తోనూ ఆకట్టుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలన్న దర్శకుడి ప్రయత్నం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. కథకు అవసరం లేకపోయినా హీరోయిజం కోసం, కామెడీ కోసం ప్లాన్ చేసిన సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ షో తప్ప ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, విక్రమ్ జిత్ లాంటి విలన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. రోటీన్ కామెడీ సీన్స్ సినిమాకు చాలా పెద్ద మైనస్. ప్రమోషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే ఓపెనింగ్స్ బాగుండేవి. ప్లస్ పాయింట్స్ : కళ్యాణ్ రామ్ సోనాల్ చౌహాన్ గ్లామర్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ కామెడీ సీన్స్ సినిమా నిడివి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ ఓవరాల్‌గా కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ ల మూడో ప్రయత్నం కూడా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. -
షేర్ వార్
అతనికి నచ్చితే ఎంత రిస్క్ అయినా కేర్ చేయడు. మరి ఇలాంటి పవర్ఫుల్ డైనమైట్ అనుకోని పరిస్ధితుల్లో తన వాళ్ల కోసం వార్ ప్రకటించాడు. తనకు ఎదురొచ్చిన వాళ్ల మీద షేర్లా విరుచుకుపడ్డాడు. మరి అతని పోరాటం ఎందుకో తెలియాలంటే ‘షేర్’ చూడాల్సిందే అంటున్నారు నిర్మాత కొమర వెంకటేశ్. నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్‌చౌహాన్ జంటగా విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ‘‘కల్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కొత్త డైమన్షెన్లో కనిపిస్తారు. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్ కెరీర్లో మరో సూపర్‌హిట్ చిత్రమిది. మల్లికార్జున్ టేకింగ్, థమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్స్: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్, సమర్పణ: సాయి నిహారిక. -
నందమూరి షేర్
‘పటాస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న కల్యాణ్‌రామ్ ఇప్పుడు ‘షేర్’గా విజృంభించడానికి సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా కొమర వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది. ‘‘షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పాటలను అక్టోబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కల్యాణ్‌రామ్ పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత చెప్పారు. కల్యాణ్‌రామ్ నటన ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు చెప్పారు, ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: సర్వేశ్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement