-
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’గా గుర్తుండిపోతుంది'
'తొలి పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది. మా చిత్రాన్ని ఇండియాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూపించాలనేది మా లక్ష్యం' అని డైరెక్టర్ శివమ్ అన్నారు. బేబీ నేహా, బేబీ ప్రణతి రెడ్డి, మాస్టర్ వేదాంత్ వర్మ తదితరులు నటించిన బాలల చిత్రం ‘లిల్లీ’. శివమ్ దర్శకత్వంలో కె. బాబురెడ్డి, సతీష్ కుమార్ .జి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూలై 7న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ సందర్భంగా శివమ్ మాట్లాడుతూ– 'కృష్ణా జిల్లాలోని పెదమద్దాలి నా స్వస్థలం. డైరెక్టర్ కావాలనుకుని 13ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చా. రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, యాడ్ ఫిల్మ్ మేకర్‌గా చేశాను. మణిరత్నంగారి ‘అంజలి’ స్ఫూర్తితో చిన్న పిల్లలతో ఓ సినిమా చేద్దామని ‘లిల్లీ’ కథ రాశాను. నేనే డైరెక్టర్‌గా, నిర్మాతగా ఈ సినిమాని స్టార్ట్ చేశాను. నా కాన్సెప్ట్, ఔట్పుట్ బాబురెడ్డిగారికి నచ్చడంతో ‘లిల్లీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేద్దామన్నారు. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరూ కడపకు చెందిన కొత్తవారే. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసింది. నేను డైరెక్టర్ అయ్యేందుకు ప్రోత్సహించిన మా నాన్న నాంచారయ్య, అమ్మ వెంకటలక్ష్మి, నా భార్య సుధా శక్తి, ఫ్రెండ్స్‌కి, చాన్స్ ఇచ్చిన బాబురెడ్డిగారికి కృతజ్ఞతలు. గోపురం బ్యానర్లోనే నాలుగు సినిమాలు సైన్ చేశాను' అన్నారు. -
వివాదానికి తెర తీస్తున్న హీరో
శాండల్ వుడ్‌లోనే కాదు టాలీవుడ్లో కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉపేంద్ర. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ, రా, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా సంచలనాలు నమోదు చేశాయి. అందుకే ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమాలో తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా శివం. ముందుగా ఈ సినిమాకు బసవణ్ణ అనే టైటిల్‌ను నిర్ణయించిన వివాదాలు రావడంతో శివం పేరుతో రిలీజ్ చేసి విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేసిన రిలీజ్ చేయనున్నారు. శివం సినిమా తెలుగు వర్షన్‌కు బ్రాహ్మణ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇప్పటికే తెలుగు సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారంటూ చాలా రోజులుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఉపేంద్ర ఏకంగా ఓ యాక్షన్ సినిమాకు బ్రాహ్మణ అనే టైటిల్‌ను పెడితే ఊరుకుంటారా..? అయితే కథ కోసం ఈ టైటిల్‌ను పెట్టారా..? లేక వివాదాలతో పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆలోచనలో పెట్టారో గాని.. ఉపేంద్ర సినిమా టైటిల్ మరోసారి టాలీవుడ్లో వివాదాలకు కారణం అవ్వటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. -
కందిరీగ కాంబినేషన్లో మరో సినిమా
శివమ్ సినిమా రిజల్ట్‌తో డీలా పడ్డ రామ్, వెంటనే తేరుకొని స్పీడు పెంచుతున్నాడు. ప్రస్థుతం కిశోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు. గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన కాంబినేషన్లోనే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు రామ్. దేవదాస్, రెడీ లాంటి హిట్స్ తరువాత కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో రామ్‌ను ఆదుకున్న సినిమా కందిరీగ. సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించి, రామ్ కెరీర్‌ను గాడిలో పెట్టింది. కందిరీగ తరువాత ఎన్టీఆర్ హీరోగా రభస సినిమా చేశాడు సంతోష్. అయితే ఆ సినిమా తఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. శివమ్ సినిమాతో ఆకట్టుకోలేకపోయిన రామ్ మరోసారి సక్సెస్ కోసం సంతోష్ శ్రీనివాస్‌నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం కిశోర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే కందిరీగ కాంబినేషన్లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కష్టాల్లో ఉన్న రామ్, సంతోష్ శ్రీనివాస్‌ల కెరీర్లను ఈ రిపీట్ కాంబినేషన్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. -
'హరికథ' కాదు 'నేను శైలజ'
యంగ్ హీరో రామ్ మరోసారి ఆలోచనలో పడ్డాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన యంగ్ హీరో చాలా రోజులుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్ నెట్టుకొస్తున్నాడు. 'పండగ చేస్కో' సినిమాతో కాస్త ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన 'శివమ్' సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. రొటీన్ కథా కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సెకండ్ హ్యాండ్' ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా ప్రారంభానికి ముందే ఈ సినిమాకు 'హరికథ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే రామ్ ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడట. హరికథ అనే టైటిల్ పాతగా అనిపిస్తోందన్న ఉద్దేశంతో 'నేను శైలజ' అనే సాఫ్ట్ టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం యంగ్ హీరోలందరూ 'నాన్నకు ప్రేమతో', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అత్తారింటికి దారేది' లాంటి సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తుంటే తను మాత్రం ప్రయోగం చేయటం ఎందుకు అని భావించిన రామ్, 'నేను శైలజ' టైటిల్‌కే ఫిక్స్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే చిత్రయూనిట్ ఈ టైటిల్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయనున్నారట. -
మూడేళ్ల తరువాత నిర్మాతలుండరేమో!
అరవై ఏళ్ళ జీవితం... నిర్మాతగా ముప్ఫై ఏళ్ళ కెరీర్... రిలీజ్‌కు రెడీగా 34వ సినిమా (‘శివమ్’)... షూటింగ్లో మరో సినిమా (‘హరికథ’)... వెరసి ‘స్రవంతి’ రవికిశోర్‌కు పాత జ్ఞాపకాలు, కొత్త అనుభవాలూ బోలెడు. వ్యాపారంగానే సినిమాల్లోకి వచ్చినా, తీస్తున్న సినిమాల్లో మనసు లెక్కలు మర్చిపోరీ ఆలిండియా సి.ఏ. ర్యాంకర్. ముప్ఫై ఏళ్ళ క్రితం ‘లేడీస్ టైలర్’తో మొదలుపెట్టిన ఆయన - ఈ అక్టోబర్ 2న ‘శివమ్’తో పలకరించ నున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ఈ ముప్ఫై ఏళ్ళ జర్నీని తలుచుకొంటే ఏమనిపిస్తుంటుంది? వ్యాపారంగానే సినిమాల్లోకొచ్చా. వచ్చాక వంశీ, తనికెళ్ళ, సీతారామ శాస్త్రి, ఇళయరాజా మొదలు ఇవాళ్టి దేవిశ్రీ ప్రసాద్ దాకా ఎందరో క్రియేటివ్ పీపుల్‌తో కలసి జర్నీ చేశా. ఈ అదృష్టం ఎందరికొస్తుంది! సినిమాల్లోకి రాక పోతే, ఎవరి లెక్కల్లోనో తప్పులు దిద్దుతూ, పి.వి. రవికిశోర్గా మిగిలేవాణ్ణి. అసలు సినిమా రంగంలోకి తొలి అడుగు ఎలా వేశారు? సినిమాల్లోకి రావడం నా డ్రీమ్ ఏమీ కాదు. అప్పట్లో దర్శకుడు వంశీతో పరిచయంతో ‘ఆలాపన’ లాంటి షూటింగ్లకెళ్ళేవాణ్ణి. జర్నలిస్టు వేమూరి సత్యనారాయణ లాంటి వాళ్ళు తోడయ్యారు. ఒకసారి అరకులో ఉండగా తొలిచిత్రం ‘లేడీస్టైలర్’ (1986)కి బీజం పడింది. అది గట్టి పునాది. అప్పటి నుంచి ‘నువ్వేకావాలి’ మీదుగా ఇప్పటి దాకా జర్నీ కంటిన్యూస్. నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నట్లున్నారు? అవును. 1987 నుంచే డిస్ట్రిబ్యూషన్లోనూ ఉన్నా. కాకపోతే, నిర్మాతగా చేతిలో 13 పేకముక్కలుంటాయి. ఉన్న ముక్కలేమిటో మనకు తెలుసు. కానీ, డిస్ట్రిబ్యూషన్ మూడు ముక్కలాట లాంటిది. ఏ ముక్కలో ఏముందో తెలియకుండా పందెం కాస్తాం. అలా చాలా డబ్బులు పొగొట్టుకున్నా. చేదు అనుభవాలెదురైనా, పెట్టాబేడా సర్దుకొని వెళ్ళిపోదామని అనుకోలేదు. లేడీస్ టైలర్’ నాటికీ, ఇప్పటికీ చిత్ర నిర్మాణంలోని మార్పులపై మీ వ్యాఖ్య? అప్పట్లో నూటికి 90 మంది గుడికెళ్ళినంత పవిత్రంగా ఈ రంగాని కొచ్చేవారు. ఇవాళ నూటికి 70 మంది సినిమాపై మోజుతో వస్తు న్నారు. నౌ ఉయ్ ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ అవర్ హెడ్స. నాట్ విత్ అవర్ హార్ట్స. ఇవాళ ఆడియన్సలో కూడా చాలా మార్పు వచ్చింది కదా? ఒకప్పుడు అర్థవంతమైన పాటలు, సినిమా చూశాక మంచి విషయం ఇంటికి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండేవి. ఇప్పుడు వినోదమే ఆశిస్తున్నారు. అప్పట్లో కథెక్కువ, కామెడీ తక్కువ. ఇప్పుడు కామెడీ ఎక్కువ, కథ తక్కువ. కానీ, మారిన కాలానికి తగ్గట్లు దర్శక, నిర్మాతలం మారాల్సిందే. లేకపోతే, మనం హిస్టరీగా మారతాం. ఐ డోంట్ వాంట్ టు బికమ్ పాస్ట్ ఆర్ హిస్టరీ. మీ సమకాలీన నిర్మాతల మధ్య పోటీ ఉండేదట... శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, అరవింద్, పోకూరి బాబూరావు, గోపాలరెడ్డి - ఇలా చాలామంది ఉండేవాళ్ళం. హెల్దీ కాంపిటీషనుండేది. ‘భలే భలే మగాడి వోయ్’ హిట్ తర్వాత అరవింద్ పార్టీ ఇచ్చి, నెక్స్ట్ పార్టీ మీదే అన్నారు. మరి మీ రాబోయే ‘శివమ్ ’, ‘హరికథ’ ఎలా ఉంటాయ్? ఫ్యామిలీ అంతా చూసే ఎంటర్టైనర్ ‘శివమ్ ’. తండ్రీ కూతుళ్ళ మధ్య అనుబంధంతో హార్టటచింగ్గా డిసెంబర్లో ‘హరికథ’ వస్తుంది. ఒక డబ్బింగ్‌తో కలిపి ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశారే? (నవ్వేస్తూ...) ‘రఘువరన్ బిటెక్’ (తమిళ ‘వి.ఐ.పి’) కూడా రీమేక్ చేద్దామనుకున్నా. కానీ, ధనుష్ బాగా చేశాడని డబ్బింగ్ చేశాం. మిగిలిన రెండు సినిమాలంటారా, వాటి స్క్రిప్ట్ ముందే చేసేశాం. ఇప్పుడు చేస్తున్నది కేవలం ఎగ్జిక్యూషనే. అందుకే, ఈసారి మూడు సినిమాలు తీయగలిగా. మీ తమ్ముడి కొడుకు రామ్‌తోనే కొన్నేళ్ళుగా సినిమాలు చేస్తున్నారేం? ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళనే తప్ప, అవసరమైతే హీరోనూ, దర్శ కుణ్ణీ ప్రశ్నించే నిర్మాతల్ని ఎవరూ ఇష్టపడడం లేదు. కోరుకోవడం లేదు. కోట్లమంది ప్రేక్షకులకు నచ్చేది కాకుండా, హీరో ఒక్కడికి నచ్చితే చాలు... కోట్ల మందికి నచ్చుతుందనే భ్రమలో సినిమా తీయడం వేస్ట్. అందుకే, 2008 నుంచి రామ్‌తోనే చేస్తున్నా. మా వాడితో అయితే, ఆ సమస్య ఉండదుగా! రామ్ అనే హీరో చేయూత లేకపోతే, నేనూ ఇబ్బంది పడేవాణ్ణి. ఇంటి హీరో కావడంతో ఆర్థికంగానూ మీకు వెసులుబాటు ఉంటుందేమో! (నవ్వుతూ) భారీ అడ్వాన్సులివ్వక్కర్లేదు. దానికి అప్పులు తేనక్కర్లేదు. రామ్ కెరీర్లో, నిర్ణయాల్లో మీ ప్రభావం? సిన్మా చేసేముందు మంచీచెడు చర్చించుకుంటాం. తీసుకెళ్ళిన ప్రాజె క్ట్‌లు తనకు సరిపోవని, ఎనాలిసిస్‌తో నన్ను కన్విన్స చేసిన ఘట్టాలున్నాయి. మరి, మీరు అతణ్ణి కన్విన్స చేసిన సందర్భాలు ? రామ్ పూర్తిగా ఇష్టపడకుండా చేసింది ‘మసాలా’. మల్టీస్టారర్ చేయడం ఇష్టమైనా, క్యారెక్టరైజేషన్ తనకు నచ్చలేదు. నా వల్ల చేయాల్సి వచ్చింది. పెదనాన్నగా కాకుండా, హీరోగా రామ్ లో మీకు నచ్చే విషయం? ఇంటెలిజెంట్ బాయ్. ఆల్వేస్ ఫోకస్డ్. విశ్లేషణా సామర్థ్యం ఎక్కువ. పైగా అంత హార్డవర్క చేసే హీరోను ఈ మధ్య చూడలేదు. అదే శ్రీరామరక్ష. ‘నువ్వేకావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మసాలా’ లాంటివి ఇతర నిర్మాత లతో పార్టనర్‌షిప్‌లో తీశారు. ఇప్పుడలాంటి ప్రయత్నాలు మానేశారేం? అలా చేస్తే, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇండిపెండెంట్‌గా పనిచేసినవాళ్ళం, మనకి మనం బాస్‌గా కాకుండా, మరొక బాస్ కింద పని చేయడం కొంత కష్టమే. నిర్ణయానికి మరొకరి కోసం నిరీక్షించడం ఇబ్బందే. ఇన్నేళ్ళ కెరీర్లో నిర్మాతగా మోస్ట్ డిజప్పాయింటింగ్ ఫిల్మ్? (క్షణం ఆలోచించి) ‘ఎందుకంటే ప్రేమంట’. నేను, రామ్ ప్రాణం పెట్టి పనిచేశాం. ఆడలేదు. అలాంటి తరహాదే ఆమిర్‌ఖాన్ ‘తలాష్’ చేస్తే అది ఆడింది. ఎక్కడో మేం తప్పు చేశామన్న మాట. ఇక, కెరీర్లో బెస్ట్ఫిల్మ్ ‘నువ్వు నాకు నచ్చావ్’. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ, చేశా. కెరీర్లో తీవ్రంగా పశ్చాత్తాపపడిన సందర్భం, సంఘటన? అలా ఏమీ లేదు. ప్రతి వ్యక్తినీ, సందర్భాన్నీ ఒకలా అంచనా వేస్తాం. అది తప్పని తేలితే రెండోసారి జాగ్రత్తపడతాం. అంతకు మించి పగ, ప్రతీకారం లాంటివుండకూడదు. నేర్చుకొంటే, ఇక్కడ ప్రతీదీ అనుభవమే. రాబోయే రోజుల్లో సినీ నిర్మాణం ఎలా ఉండనుంది? తెలుగు పరిశ్రమ గట్టి దెబ్బలు కొట్టడంతో కార్పొరేట్ సంస్థలు గుమ్మం దగ్గరే నిలబడిపోయాయి కానీ, అవి వస్తాయి. మూడేళ్ళ తర్వాత స్వతంత్ర నిర్మాతలంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అసోసియేట్, లైన్ ప్రొడ్యూసర్, వర్కింగ్ పార్‌టనర్‌సగా కార్పొరేట్స్‌తో చేతులు కలపాల్సి వస్తుంది. ‘నువ్వే కావాలి’ టైమ్ కే నేను ఊహించిన పరిణామం 15 ఏళ్ళు ఆలస్యమైంది. ఈ 30 ఏళ్ళ సినీ కెరీర్లో ఏం తెలుసుకున్నారు? అందరిలా తప్పులు చేశాం. సక్సెస్ ప్రమాదకరం. తలకెక్కి తప్పుదోవ పట్టిస్తుంది. సక్సెస్ ఒక్కరిది కాదు, టీమ్వర్కని మర్చిపోతుంటాం. అందుకే, ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ వచ్చినప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా రానున్న చిత్ర నిర్మాతలకు మీరిచ్చే సలహాలు, సూచనలు? ఇక్కడ ప్రతివాడూ పక్కవాడి కంటే తాను గొప్పనుకుంటాడు. కాబట్టి, సలహాలు చెప్పి, నవ్వులపాలు కాకూడదు. ఇక్కడ ఎవరూ వినరు, మారరు. మీ ‘స్రవంతి’ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి వారసులు సిద్ధమేనా? నా రెండో తమ్ముడి కొడుకు రామ్ హీరో. ఇక, న్యూజిలాండ్‌లో కమర్షి యల్ పైలట్ కోర్స చేసిన రామ్ వాళ్ళ అన్నయ్య కృష్ణచైతన్య నా వెంటే ఉంటూ ప్రొడక్షన్ చూస్తున్నాడు. నా మొదటి తమ్ముడు డాక్టర్ రమేశ్ కొడుకు రాజా నిశాంత్ అమెరికాలో డెరైక్షన్ కోర్స చేశాడు. భవిష్యత్తు వీళ్ళదే. - రెంటాల జయదేవ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement