-
వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా (39) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. కోవిడ్-19 మహమ్మారిపై చేసిన పోరాటానికి గాను సింగపూర్ ప్రముఖ దినపత్రిక ది స్ట్రెయిట్స్ టైమ్స్ అందించే “ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకి ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఈ ఘనతను సాధించిన ఆరుగురిలో ఒకరిగా పూనావాలా నిలిచారు.(ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన) కరోనాపై పోరులో వారి ధైర్యం, నిబద్ధత, క్రియేటివిటీకి సాల్యూట్ చెబుతున్నామంటూ సింగపూర్ డెయిలీ కితాబిచ్చింది. ఈ సంక్షోభ సమయంలో విశేష కృషితో ఆసియాతోపాటు ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచారని వ్యాఖ్యానించింది. మొత్తం ఆరుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో పనిచేసిన వీరులుగా వీరిని "వైరస్ బస్టర్స్"గా అవార్డు ప్రశంసాపత్రంలో కీర్తించింది. ఈ జాబితాలో పేర్కొన్న మరో ఐదుగురిలో చైనా పరిశోధకుడు కరోనా మహమ్మారి వైరస్ సార్స్-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు చాంగ్ యోంగ్జెన్, మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కృషి చేసినందుకుగాను చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు. నిబద్ధతతో తమకు తాము అంకితమైన కృషితో ఆసియాతోపాటు, ప్రపంచ ప్రజలకు ఆశలను చిగురింప చేశారని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారెన్ ఫెర్నాండెజ్ ప్రశంసించారు. ఇంతకుముందెన్నడూ లేని కృషితో వార్తల్లో నిలవడంతోపాటు, తద్వారా ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి నివారణకు పరిష్కారానికి సమాధానం కనుగొనడంలో సాయం చేసిన వ్యక్తులకు, టీంలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపొందించిన కోవిడ్-19వ్యాక్సిన్ ‘‘కోవిడ్‌షీల్డ్’’ తయారీకి తయారీకి పూణేకు చెందిన సీరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ప్రజలకు విముక్తి రావాలనే ఉద్దేశంతో తన సంస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి తన కుటుంబ సంపదలో 250 మిలియన్ డాలర్లను అందించినట్టు ఇటీవల వెల్లడించారు. ప్రధానంగా స్వల్ప, మధ్య-ఆదాయ దేశాలకు సరసమైన ధరలో కోవిడ్-19వాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు చెప్పారు. 1966లో పూనవాలా తండ్రి సైరస్ పూనావాలా సీరంను స్థాపించారు. ఆ తరువాత 2001లో సీరంలో చేరిన అదర్ పూనావాలా దినదినాభివృద్ధి చెందుతూ 2011లో సీఈవోగా అవతరించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. -
ఏషియన్ ఆఫ్ ది ఇయర్‌గా నరేంద్ర మోదీ!
సింగపూర్: ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. భారత అభివృద్ధి నాయకత్వం అందించినందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన ‘ది స్ట్రైట్ టైమ్స్’ దినపత్రిక ప్రకటించింది. ప్రధాని పదవికి మోదీ కొత్తయినా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్లతోపాటు పలువురు నేతలను కలిసి ఆసియాలో తనదైన ముద్ర వేయగలిగారంది. మోదీ జపాన్ పర్యటన, జపాన్ ప్రధాని అబేతో ఆయన సమావేశం విజయవంతమయ్యాయని ఆ పత్రిక ప్రచురణకర్త సింగపూర్ ప్రెస్ హోల్డింగ్ లిమిటెడ్ పేర్కొంది. దేశప్రజలకు ఆయన సరైన దిశ, దశ చూపించగలిగారని, భారత అభ్యున్నతిపట్ల ప్రపంచదేశాల్లో అంచనాలు పెంచగలిగారని తెలిపింది. మోదీ అందించిన ‘మేకిన్ ఇండియా’ పిలుపు దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని పత్రిక సంపాదకుడు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement