-
డిసెంబర్లో వేలైక్కారన్
తమిళసినిమా: వేలైక్కారన్ చిత్ర విడుదల దాదాపు మూడు నెలల వెనక్కి వెళ్లిపోయింది. శివకార్తికేయన్, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తున్న క్రేజీ చిత్రం వేలైక్కారన్. ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు రెమో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 24 ఏఎం.స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. భారీ అంచనాలను సంతరించుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ముందుగానే వెల్లడించారు. తాజా పరిణామాల కారణంగా చిత్ర విడుదల డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఒక ప్రకటనలో వెల్లడించారు. అందుకు కారణాలను తెలుపుతూ వేలైక్కారన్ చిత్రం టాకీ పార్టును పూర్తి చేసుకుందని, అయితే ఇంకా రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిపారు. అదే విధంగా తనీఒరువన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్ర దర్శకుడు మోహన్‌రాజా తాజా చిత్రం కావడంతో అన్ని అంశాలు చాలా బలంగా ఉండాలని ఆశించడంతో ఆ దిశగా వర్క్ జరుగుతోందన్నారు. సెన్సార్ బోర్డు నూతన నిబంధనల ప్రకారం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావడానికి మూడు లేక నాలుగు వారాలు పడుతుందని తెలిపారు.ఇకపోతే అక్టోబర్‌లో దీపావళి పండగ సందర్భంగా ఇప్పటికే పలు చిత్రాలు బరిలో ఉన్నాయని, నవంబర్‌లో ఎలాంటి పండగలు లేకపోవడంతో వేలైక్కారన్ చిత్రాన్ని క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత వివరించారు. -
శివకార్తికేయన్‌తో మరోసారి..
తమిళసినిమా: యువ నటుడు శివకార్తికేయన్కిప్పుడున్న క్రేజ్ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో యమ జోరులో ఉన్న ఆయన తనతో రొమాన్స్ చేసే హీరోయిన్ల విషయంలోనూ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తొలి రోజుల్లో వర్ధమాన నటీమణులతో డ్యూయెట్లు పాడిన శివకార్తికేయన్ మాన్ కరాటే చిత్రంలో తొలిసారిగా క్రేజీ నటి హన్సికతో జోడీ కట్టారు. అప్పట్లో ఈ విషయాన్నే మీడియా ప్రసారం చేసింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాల్లో కీర్తీసురేశ్‌తో యుగళగీతాలు పాడారు. అవి సంచలన విజయాలను నమోదు చేసుకోవడంతో ఇప్పుడు అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతారతో వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తాజాగా సమంతతో జత కడుతున్నారు. పొన్రాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి నేట్రు ఇండ్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. ఆ తరువాత యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో చిత్రం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నది తాజా సమాచారం. ఇందులో కథానాయకి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.అయితే ఇందులో నయనతారను నటింపజేయడానికి ఆమెతో చర్చలు జరుగుతున్నాయన్నది కోలీవుడ్ వర్గాల టాక్. దర్శకుడు విఘ్నేశ్‌శివకు నయనతారకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న ప్రచారం చాలా కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రేమ జంట ఇప్పటికే సహజీవనం సాగిస్తున్నారన్నది ప్రచారంలో ఉన్నదే. అదే విధంగా నయనతార ఇంతకు ముందు తన లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నానుమ్రౌడీదాన్ చిత్రంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించి సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసే అవకాశం మెండుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
వేలైక్కారన్ విశేషాలు
తమిళసినిమా: రెమో వంటి సంచలన చిత్రం తరువాత నేటి క్రేజీ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం వేలైక్కారన్. దీంతో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టైటిల్‌తో వస్తున్న శివకార్తికేయన్‌కు జంటగా అగ్రనాయకి నయనతార నటించడం మరో విశేషం. ఇక తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం వేలైక్కారన్. రెమో వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన 24ఏఎం.స్టూ డియోస్ అధినేత ఆర్డీ.రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు షాహిద్ ఫాజిల్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలో ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు నటుడు ఫాహిద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8వ తేదీన చిత్ర రెండో పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. అదే విధంగా చిత్ర టీజర్‌ను పంద్రాగస్ట్ సందర్భంగా ఈ నెల 14న రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా చిత్రాన్ని సెప్టెంబరు నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాత ఆర్డీ.రాజా ఇప్పటికే వెల్లడించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
‘కాంగ్రెస్ గూండాల దాడి.. ఇదా రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం?’
గుర్తు పెట్టుకోలేనన్ని హామీలిచ్చి.. ఇప్పుడు గుర్తుకు రావడం లేదంటే ఎలా సార్! గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదంటారా!!
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
రాజమాత మాధవి రాజే సింధియా కన్నుమూత
లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్‌లో రాజస్తాన్
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
Advertisement