-
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్‌తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్‌తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. లెగ్‌సైడ్ దిశగా మెక్‌కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్‌కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్లో చేరిన జైస్వాల్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారీ సెంచరీ (179) చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న టీమిండియా భవిష్యత్ తార, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Reaching a Test Hundred with a SIX for India Umrigar Kapil Dev Tendulkar (6 times) Azharuddin Dravid Sehwag Irfan Pathan Gambhir (2 times) MS Dhoni Harbhajan KL Rahul (twice) Rohit (3 times) Ashwin Pujara Pant (2 times) JAISWAL pic.twitter.com/ExOjCFhUQR — Cricketopia (@CricketopiaCom) February 2, 2024 సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ ఖాతాలో ఉంది. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. విశేషమేమిటంటే హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఫుల్‌టైమ్ బౌలర్లు కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పైపేర్కొన్న వారు కాకుండా కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) తక్కువ స్కోర్లకే ఔటైనా యశస్వి కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశాడు. యశస్వితో పాటు అశ్విన్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, టామ్ హార్ట్లీ తలో వికెట్ దక్కించకున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రాకాసి సిక్సర్.. కొడితే ఏకంగా..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రాకాసి సిక్సర్ బాదాడు. లియామ్ డాసన్ బౌలింగ్‌లో క్లాసెన్ బాదిన ఈ సిక్సర్ ఏకంగా 105 మీటర్ల దూరం వెళ్లి, లీగ్ చరిత్రలోనే భారీ సిక్సర్‌గా రికార్డైంది. కళ్లు చెదిరే ఈ షాట్ చూసి అభిమానులు ముగ్దులవుతున్నారు. ఆధునిక క్రికెట్లో అతి భారీ సిక్సర్ అంటూ కొనియాడుతున్నారు. భారీ కాయుడైన క్లాసెన్ బలంగా బాదడంతో బంతి ఏకంగా స్టేడియం రూఫ్ ఎక్కింది. క్రికెట్ చరిత్రలో లాంగెస్ట్ సిక్సర్‌కు సంబంధించిన పూర్తి డేటా లేకపోవడంతో ఈ సిక్సర్‌కు ఎలాంటి అధికారిక గుర్తింపు దక్కలేదు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వరకైతే ఇదే అతి భారీ సిక్సర్ అని లీగ్ నిర్వహకులు ప్రకటించారు. మొత్తానికి ఈ రాకాసి సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరవలవుతుంది. Just the longest six of the #Betway #SA20 so far… no big deal. 🫨🙌#WelcomeToIncredible #DSGvSEC pic.twitter.com/7F4xjI9Rxi — Betway SA20 (@SA20_League) January 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో వియాన్ ముల్దర్ (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయాడు. బ్రీట్జ్కీ (35), క్లాసెన్ (31), ప్రిటోరియస్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ వారెల్, బార్ట్‌మన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (66 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జన్సెన్ (24 నాటౌట్), మార్క్రమ్ (38), హెర్మన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్టోయినిస్ 2, రీస్ టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సన్‌రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. -
CWC 2023 AUS VS NZ: అతి భారీ సిక్సర్ నమోదు
2023 వన్డే ప్రపంచకప్లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్ ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో నమోదైంది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్‌ను సాధించాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్ బాదాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్‌పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అతి భారీ సిక్సర్. మ్యాక్స్‌వెల్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అయ్యర్‌కు ముందు డేవిడ్ వార్నర్ 98 మీటర్ల సిక్సర్, డారిల్ మిచెల్ 98 మీట్లర సిక్సర్, డేవిడ్ మిల్లర్ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. Glenn Maxwell smashes the biggest six of the 2023 World Cup. 104M at the Dharamshala Stadium. pic.twitter.com/soR1PNxPNm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023 కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరి 3 వికెట్లు, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్‌వుడ్‌కు దక్కాయి. -
Pak Vs SA: టీ20 వరల్డ్‌కప్‌లోనే అత్యంత భారీ సిక్సర్..!
టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యంత భారీ సిక్సర్ నమోదైంది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని ఇఫ్తికార్ అహ్మద్.. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సాగనంపాడు. ఇఫ్తికార్ ఈ షాట్ ఆడిన విధానాన్ని చూసి బౌలర్ ఎంగిడి అవాక్కయ్యాడు. ఈ షాట్ తర్వాత సిడ్నీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతుంది. #PAKvSA #T20WorldCup Iftikhar Ahmed hits the BIGGEST 6️⃣ of T20 World Cup 2022 💥 pic.twitter.com/MRWhl43TkG — MK CHAUDHARY 03 (@LovelyKhateeb) November 3, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్సర్), ఎయిడెన్ మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగానే ఆడినా ఒకే ఒవర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో సఫారీల కష్టాలు అధికమయ్యాయి. ఈ దశలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా మొదలుకావడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. వర్షం మొదలయ్యే సమయానికి ఆ జట్టు స్కోర్ 9 ఓవర్ల తర్వాత 69/4గా ఉంది. సఫారీలు గెలవాలంటే 66 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమయితే దక్షిణాఫ్రికా ఇంకా 15 పరుగులు వెనకపడి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. వర్షం ఎడతెరిపినివ్వడంతో మళ్లీ మొదలైన మ్యాచ్.. సౌతాఫ్రికా టర్గెట్ ఎంతంటే..? వర్షం ఎడతెరిపినివ్వడంతో పాక్-సౌతాఫ్రికా మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఇప్పటికే ఆ జట్టు 9 ఓవర్లు ఆడేయడంతో మరో 5 ఓవర్లలో 73 పరుగులు సాధించాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement