-
సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు..
సాక్షి, శ్రీకాకుళం : తొలకరి పలకరించింది. రైతు పొలం బాట పడుతున్నాడు. సాగు కష్టాలతో పాటు సర్ప భయాలు కూడా అన్నదాతను వెంటాడుతుంటాయి. పల్లెల్లో ఇది సర్పాలు బయటకు వచ్చే సమయం. ఎండలు తగ్గి కాసింత చల్లదనం ఉంటే సరి.. పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోతుంటారు. ఆస్పత్రుల్లో పాముకాటు మందులు ఉన్నా చాలా మంది నాటు వైద్యానికి, ఆర్ఎంపీల వద్ద వైద్యానికే వెళ్తుండడంతో ప్రాణనష్టం తప్పడం లేదు. అందుకే సాగు సమయంలో పాములతో కాసింత జాగ్రత్తగా ఉండాలని, కాటు వేశాక తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వానల్లో.. జూన్, జూలై మాసాలు రైతులకు చాలా కీలకం. పొలం పనులు మొదలుపెట్టి రాత్రీ పగలు ఆ గట్ల మీదుగానే తిరగాల్సి ఉంటుంది. ఇలా వెళ్లినప్పుడు, తన పని తాను చేసుకంటున్న సమయాల్లోను పాము కాటుకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు కూడా ఈ కాలంలో బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. రహదారులు, నివాసాల మధ్య కూడా ఈ మధ్య కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటోంది. పాము కాటు బారిన పడిన సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాము కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి అన్న అంశాలపై చాలా మందికి అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సొంతవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పాముకాటు జరిగిన గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళి తే ప్రాణాపాయం తప్పుతుంది. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రా మాల్లో తిరిగే కొందరు సంచి (ఆర్ఎంపీ) వైద్యులను నమ్మి మోసపోవడం కంటే ముందే మేలుకుని పాణాలు కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నాలుగు జాతులే విషపూరితం మన దేశంలో నాలుగు వందలకు పైగా సర్ప జాతులుండగా వాటిలో కేవలం నాలుగు జాతులు మాత్రమే విషపూరితమైనవిగా జీవావరణ వేత్తలు చెబుతున్నారు. నాగు పాము, పొడ పాము(రక్తపింజరి), కట్లపాము(తుట్ట), సముద్రసర్పాలు. ఇవి కరిస్తే ప్రాణానికి ప్రమాదం ఉంది. మిగిలిన జాతుల మాపులు కరిస్తే ఏమీ కాదంటున్నారు. విష సర్పాల్లో నాగుపాముకు పడగ ఉండగా, కర్త పింజరికి ని లువు చారలు ఉం టాయి. కట్ల పాములో రెండు రకాలుండగా ఇండియన్ క్రైట్ రాత్రి వేళల్లోనే సంచరిస్తుంటాయి. ఈ రకం పా ము అడవులు, కొండ కోనల్లోనే కనిపిస్తాయి. ఇక నలుపు, పసుపు చారలతో ఉంటే గౌరీబెత్తు సైతం విషపూరితమైనదే. కొండల్లోను, పంట పొలాల్లోను కనిపించే కింగ్ కోబ్రా జాతికి చెందిన రాచనాగు, వైరానాగులు అరుదైనవి. రాచనాగుకు రంగులు మార్చే స్వభావం ఉంటుంది. అది నివశించే ప్రాంతాన్ని బట్టి గోధుమ, చింత, మొగలి నాగులని పిలుస్తారు. తెలుపు, పచ్చ రంగుల్లో కనిపించే కొన్ని రకాల పాములు జన్యులోపాలతో పుట్టినట్లుగా చెబుతారు. సూచనలుపాటించాలి ⇔పాము కరవగానే మంత్రాలు, పచ్చిమిరపకాయలు తినిపిస్తారు. ఇవి అసలు చేయకూడదు. ⇔పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం మంచిది కాదు. మోసుకుని లేదా ఆటో, ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లాలి. ⇔ఆర్ఎంపీ, సంచి వైద్యుల సలహాలు పాటించి ఇంటి వద్దనే ఉంచవద్దు. జాప్యం చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. వీలైనంత తొందరగా నిపుణులైన డాక్టర్ వద్దకు చేర్చాలి. ⇔మూఢనమ్మకాలను అసలు నమ్మవద్దు. మంత్రాలు, పసర మందులతో ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అవగాహనే కీలకం ⇔ఏ పాము కరవగానే భయపడే కంటే ధైర్యంగా ఉండి నాకేమీ కాదన్న నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఏ జాతి, ఏ రకం పాము కరచిందో గమనించాలి. ⇔ఏ పాము కాటు వేసిన చోట శుభ్రంగా కడగాలి, విషం శరీరం అంతా ప్రసరణ జరగకుండా చేయాలి. ⇔ఏ పాము కాటేసిన వెంటనే కాటుకు కొంచెం దూరంలో ఏదైనా తాడు వంటి దానితో గట్టిగా కట్టాలి. దీంతో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తంలో కలిసిన విషం శరీర భాగాల్లోకి వెళ్లకుండా నిరోధించవచ్చు. ⇔ఏ రక్తపింజరి జాతికి చెందిన పాము కాటు వేసిన సందర్భాల్లో చిగుళ్లు, మూత్ర పిండాలు, మూత్రం, మలం నుంచి రక్త స్రావం జరుగుతుంది. ⇔ఏ నాగుపాము, కట్ల పాములు కరిస్తే కళ్లు మూత పడటం, వాపులు రావటం, నోటి నుంచి నురగలు రావడం, మాట్లాడలేని పరిస్థితి ఏర్పడటం వంటి లక్షణాలు ఉంటాయి. ⇔ఏ రాత్రులు పొలాలకు వెళ్లే రైతులు విధిగా టార్చిలైట్, చేతికర్ర వెంట తీసుకుని వెళ్లాలి, కాలిమొత్తం వరకు లుంగీ విడిచిపెట్టాలి, వీలైతే ప్యాంట్ వేసుకుంటే మంచిదే. ⇔ఏ పొలం గట్లపైన నడిచే సందర్భాల్లో చేతికర్రతో ముందు శబ్ధం చేసుకుంటూ అడుగులు వేయాలి. ⇔ఏ ఇంటి పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని లేకుండా చూడాలి. నాటు వైద్యం హానికరం పాము కాటుకు గురైన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలి. విషం విరుగుడుకు అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లోను అందుబాటులో ఉంచుతున్నారు. ఏ సమయంలో పాము కాటుకు గురైనా వెంటనే గ్రామాల్లోని ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వారే ఆస్పత్రికి సిఫార్స్ చేస్తారు. ఆస్పత్రిలో అన్ని పరిశీలనలు చేసిన తర్వాత అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయడం, సొంత వైద్యం చేయడం, మంత్రాలు, పసర మందుల వల్ల పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. పాముకాటు విషం విరుగుడు మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచడం జరిగింది. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలి. – రెడ్డి హేమలత, ప్రభుత్వ డాక్టర్, లక్ష్మీనర్సుపేట పీహెచ్సీ, ఎల్.ఎన్.పేట పాముల్ని చంపడం నేరమే కొండ చిలువలు, ఇతర పాముల్ని చంపడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఉల్లంఘణ కిందకు వ స్తుంది. ఇది పెద్ద నేరమే. ఇలాం టి చర్యలకు పాల్పడేవారికి వైల్డ్‌లైఫ్ చట్టం 1972లో సెక్షన్ 61(1), (2) ప్రకారం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కేవలం జరిమానాతో విడిచిపెట్టే అవకాశం లేదు. – జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజర్, పాలకొండ సెక్షన్ -
బుస్..స్స్
సాక్షి, మహబూబ్‌నగర్: వర్షాకాలంలో పాములు బయటకు రావడం సాధారణం. రాత్రివేళ ఇది ఎక్కువగా ఉంటుంది. పాముకాట్లు కూడా ఈ సీజన్లోనే అధికంగా ఉంటాయి. ఈ విషయం తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ కనీస ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో జూలైనుంచి ఇప్పటి వరకు 35మంది పాముకాటుకు గురయ్యారు. జూలై నెల మొదటి వారంలోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అధికంగా గ్రామీణప్రాంత వాసులు, గిరిజనులే. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పాములు పుట్టలోనుంచి బయటకు వచ్చి తిరుగుతుంటాయి. అవి ఇళ్లలోకి చేరి పడుకున్న వారిని కాటేస్తున్నాయి. పాముకాటుకు గురైన వారిని స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్తే పాముకాటు విరుగుడుకు వాడే యాంటీ స్నేక్ వీనమ్ (ఏవీఎస్) మందు దొరకడం లేదు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితులను వంద కిలోమీటర్లకు పైగా దూరం నుంచి మహబూబ్‌నగర్‌కు తీసుకువచ్చే సరికి ఆలస్యం జరిగి విషం శరీరమంతా వ్యాపించి మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు. పీహెచ్సీలలో ఏవీఎస్ నిల్ పాముకాటుకు గురవుతున్న గ్రామీణవాసులు అత్యంత దుర్భర పరిస్థితిని చవిచూస్తున్నారు. రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో విషసర్పాల బారిన పడి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వద్దకు బాధితులను తీసుకెళ్తే అక్కడ విషం విరుగుడు మందు ఉండడం లేదు. చాలా పీహెచ్సీలలో ఏవీఎస్ మందు లేక ప్రధాన ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం జిల్లావ్యాప్తంగా పాముకాటు నివారణ (ఏవీఎస్) మందులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాముకాటుకు వైద్యమిలా... పాముకాట్లకు విరుగుడుగా యాంటీ స్నేక్ వీనం (ఏవీఎస్)ను అందిస్తారు. విషం తీవ్రతను బట్టి వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాసనందిస్తూ ఐవీ ప్లూయిడ్స్‌తో పాటు యాంటీబయాటిక్స్ వాడుతారు. పాముకాటుకు గురైన వారికి కనీసం 24 నుంచి 48 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాలి. పాముకాటు వేసిన గంటలోపే చికిత్స అందిస్తే మెరుగైన ఫలితముంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది గ్రామీణులు నాటువైద్యులను ఆశ్రయించి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. నాటుమంత్రాన్ని ఆశ్రయిస్తే... తలకొండపల్లి మండలం సాలార్‌పూర్ తండాకు చెందిన వడ్యావత్ నారాయణ, లలితల కుమార్తె మహాలక్ష్మి (10). ఈ నెల 6వ తేదీన ఆమెను పాముకాటు వేసింది. అయితే, మహాలక్ష్మి తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి కాకుండా మంత్రగాళ్ల వద్దకు తీ సుకెళ్లారు. అక్కడ చాలాసేపు ఉంచారు. ఈ లోపు విషమంతా బాలిక శరీరం మొత్తం వ్యాపించింది. అక్కడికక్కడే నురగలు కక్కుకుంటూ తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణం విడిచింది. వెంటనే చికిత్స అందించాలి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో పాముకాటు బాధితుల సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా కప్పలు, ఎలుకలు ఉన్న ప్రాంతాల్లో పాముల సంచారం అధికం. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకు గురైనవారు చాలా మంది వెంటనే చికిత్స తీసుకోకుండా మంత్రగాళ్లను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పాముకాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రథమచికిత్స అనంతరం గంట వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లి యాంటీ స్నేక్ వీన ం మందు అందేలా చూడాలి. రెండు రోజుల పాటు డాక్టర్ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. -కె.అమరేందర్‌రెడ్డి, నిష్ణాతులు, జువాలజీ టీచర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement