-
RIP Magawa: ‘చిట్టి హీరో’ అస్తమయం
మగావా.. డ్యూటీలో చాలా సిన్సియర్. రోజూ ఫీల్డ్‌లోకి దిగి ల్యాండ్మైన్లను పసిగట్టడం. వందల మంది ప్రాణాలు రక్షించడం. ఇదంతా ఇన్ ది స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. ఇట్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్.. ఇట్ ఈజ్ ఆల్ టైం రికార్డ్!!. సూపర్ హీరోకి అర్హతలేంటని అడిగితే.. ఏవేవో చెప్తుంటారు కొందరు. కానీ, ఆ అర్హతలేవీ లేకుంటే?.. ఆ సూపర్ హీరో అసలు మనిషి కాకుంటే!! యస్.. మాగావా మనిషి కాదు. ఓ ఎలుక. సాధారణమైంది మాత్రం కాదు. ల్యాండ్ మైన్లను గుర్తించడంలో కఠోర శిక్షణ తీసుకుంది. తన విధి నిర్వహణలో నిబ్ధదత ప్రదర్శించిన ఈ ఎలుక.. ఈమధ్యే కన్నుమూసింది. అందుకే సోషల్ మీడియాలో అంత ఎమోషనల్ అవుతున్నారు. టాంజానియా బ్రీడ్‌కు చెందిన మగావాను కంబోడియా తీసుకొచ్చి.. ల్యాండ్మైన్లను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో వందకి పైగా ల్యాండ్ మైన్లను గుర్తించింది. తద్వారా ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ఈ చిట్టి హీరో. 2020లో మాగ్వా యూకేకి చెందిన ఓ ఆర్గనైజేషన్ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకుంది మగావా. కిందటి ఏడాది జూన్‌లో విధుల నుంచి రిటైర్ అయిన ఈ ఎలుక.. చివరికి ఎనిమిదేళ్ల వయసులో ఈమధ్యే కన్నుమూసింది. ఈ విషయాన్ని దానికి శిక్షణ ఇచ్చిన APOPO అనే బెల్జియం ఎన్జీవో ప్రకటించింది. అంతర్యుద్ధంతో దశాబ్దాలపాటు నలిగిపోయిన కంబోడియా.. ల్యాండ్మైన్ల గనిగా ఒక పేరు దక్కించుకుంది. వీటి ధాటికి వందల మంది ఏటా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అందుకే రిస్క్ లేకుండా ఎలుకలకు ల్యాండ్మైన్లను గుర్తించే శిక్షణ ఇప్పిస్తున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో ల్యాండ్మైన్లతో పాటు టీబీ రోగి శాంపిల్స్ గుర్తించేందుకు ఎలుకలను ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే.. చాలా సందర్భాల్లో ఇవి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేస్తున్నాయి కూడా. అందుకే ఆ ర్యాట్హీరోలకు ఓ సలాం కొడుతూ.. RIP Magawa. -
'హైడీ' ఆమె జీవితాన్ని కాపాడింది!
శునకాలు వాసనల ద్వారానే అన్నింటినీ పసికడతాయి. అలాగే పెంపుడు జంతువులైతే యజమాని, వారికి సంబంధించిన వ్యక్తులను గుర్తుపడతాయి. ముఖ్యంగా వాటిలో స్నఫింగ్ డాగ్స్ ఎంతో తెలివితేటలను ప్రదర్శిస్తాయన్నది తెలిసిన విషయమే. అందుకే వాటికి పోలీసులు వాసనను గుర్తించడంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. అదే జాతి శునకానికి యజమాని ఇచ్చిన ట్రైనింగ్... ఇప్పుడు ఏకంగా అమె జీవితాన్నే రక్షించింది. క్యాన్సర్ బారినుంచీ బయట పడేసింది. యజమానిపై అత్యంత ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలను ముందు వరుసలో చేరుస్తాం. యజమానులూ వాటిని ప్రాణప్రదంగా చూస్తారు. అయితే మిచిగన్ కు చెందిన 53 ఏళ్ళ ఆన్నె విల్స్... తన పెంపుడు జంతువుకు ఇచ్చిన ట్రైనింగ్... ఆమె జీవితాన్ని ఒడ్డున పడేసింది. ఆమెకు సోకిన రోగాన్ని ముందుగానే గుర్తించిన ఎనిమిదిన్నరేళ్ళ.. జర్మన్ షెఫర్డ్ స్నఫింగ్ డాగ్ 'హైడీ'... యజమాని చుట్టూ ఆవేదనతో తిరగడం ప్రారంభించింది. పదే పదే ఆమె ఛాతీపై వాసన చూడటం మొదలు పెట్టింది. దీంతో విషయం అర్థంకాక ఆన్నె విల్స్ ఆందోళన చెందింది. తన పెంపుడు కుక్కకు ఏమైందోనని కంగారు పడింది. హైడీకి ఎనిమిదేళ్ళపాటు... తప్పిపోయినవారిని, పెంపుడు జంతువులను వాసనను బట్టి గుర్తించడంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే హైడీ పదే పదే తన ఛాతీపై వాసన చూడటం మాత్రం ఆ యజమానికి ఎంతో అనుమానం కలిగించింది. దీంతో హైడీని ఓ ప్రముఖ మెటర్నిటీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి దానికేమైందోనని అన్ని పరీక్షలూ చేయించింది. వైద్యులు హైడీ ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి సమస్యా లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే ఎందుకలా చేస్తోంది అన్న అనుమానం మాత్రం ఆన్నె విల్స్ ను వీడలేదు. ఎందుకైనా మంచిదని ఆమె కూడా పరీక్షలు చేయించుకుంది. ''హైడీ నా జీవితాన్ని రక్షించింది. అదే కనుక నా రోగాన్ని గుర్తించకపోయి ఉంటే ఈ పాటికి శవంగా మారేదాన్ని'' అంటూ పదే పదే గుర్తు చేసుకుంటోంది యజమాని ఆన్నె. ఒకవేళ హైడీ కనుక గుర్తించకపోయి ఉంటే.. ఆన్నె విల్స్ కు సోకిన లంగ్ క్యాన్సర్.. శరీరంలోని మిగిలిన అన్నిభాగాలకూ సోకి ఉండేదని, ముందుగానే తెలియడం వల్ల ఈ జబ్బును నయం చేసే అవకాశం ఉందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్సర్ కోలే చెప్పారు. ఎక్కడైతే పదే పదే హైడీ వాసన చూసిందో అదే స్థానంలో ఆమెకు లంగ్ కాన్యర్ ఉండటం వైద్యులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై మీరు రెండు పీహెచ్ డీలు చేసిన వైద్యుల సమక్షంలో ఉన్నట్టుగా హైడీని చూసి ఫీలవ్వచ్చు అంటూ సెయింట్ ఆగ్నెస్ ఆస్పత్రి ఆంకాలజీ ఛీఫ్ అనడం విశేషం. నిజంగానే ఓ శునకం వైద్యులకన్నా వేగంగా రోగాన్ని గుర్తించడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు హైడీకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు.. దాని ముక్కు ఎంతో గ్రహణ శక్తిని కలిగి ఉండటం నిజంగా ఎంతో గ్రేట్ అని ఏకంగా డాక్టర్లే మెచ్చుకుంటున్నారు. ఆన్నె విల్స్ నిర్వహిస్తున్న డాగ్స్ ఫైండింగ్ డాగ్స్ సేవాకార్యక్రమంలో భాగంగా ఏడేళ్ళలో సుమారు 2 వేల వరకూ తప్పిపోయిన పెంపుడు జంతువులను హైడీ గుర్తించింది. పెంపుడు శునకం.. యజమానిపై విశ్వాసాన్ని చూపడమే కాదు.. ఏకంగా ఆమె జీవితాన్నే రక్షించడంతో ఆన్నే విల్స్ ఎంతో ఆనందంలో తేలిపోతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement