-
యువ కోచ్‌ను కబలించిన కరోనా
మాడ్రిడ్ : కరోనా వైరస్ సోకి స్పానిష్ పుట్‌బాల్ కోచ్ మృతి చెందడం ఆ దేశంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియా అనే పుట్‌బాల్ యువ కోచ్ వైరస్ కారణంగా సోమవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన ప్రస్తుతం అట్లెటికో పోర్టాడా ఆల్టా పుట్‌బాల్ టీంకు కోచ్‌కు వ్యవహరిస్తున్నాడు. గార్సియా గతకొంత కాలంగా లుకేమీయాతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యులు మెరుగైన చికిత్సకు ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కోచ్ మృతిపై టీం మేనేజ్మెంట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గార్సియా మృతి చెందడం తీవ్ర విషాదమని, దురదృష్టకరమని తెలిపింది. అతని సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. (తల్లి నుంచి బిడ్డకు ‘కోవిడ్’ రాదు) యువ కోచ్‌ను కరోనా కబలించడంతో దేశ క్రీడా రంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా కోవిడ్ కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు 345 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఆ దేశంలో వైరస్ కేసుల సంఖ్య పదివేలకు చేరుకుంది. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అతి తక్కువ వయసు వ్యక్తి గార్కియా కావడం విచారం. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. కరోనా క్రీడా రంగాన్ని సైతం చుట్టుముట్టడంతో దేశంలో జరిగే అన్ని టోర్నీలను రద్దు చేసింది. మాల్స్, విహారయాత్రలపై ఆంక్షలు విధించింది. -
రియల్ మాడ్రిడ్‌కు క్లబ్ వరల్డ్ కప్ టైటిల్
మర్రాకెచ్ (మొరాకో): అద్భుతమైన ఆటతీరుతో చెలరేగిన స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు ‘క్లబ్ వరల్డ్‌కప్’ విజేతగా నిలిచింది. క్లబ్‌స్థాయి ఫుట్‌బాల్‌లోని అన్ని గొప్ప టైటిల్స్‌ను దక్కించుకున్న రియల్ మాడ్రిడ్ ఈ టైటిల్‌ను తొలిసారి చేజిక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో రియల్ మాడ్రిడ్ 2-0 తో సాన్ లోరెంజో (అర్జెంటీనా)పై నెగ్గింది. ఈ ఏడాది రియల్ మాడ్రిడ్ సాధించిన నాలుగో ట్రోఫీ ఇది. చాంపియన్స్ లీగ్, కోపా డెల్ రే, యూరోపియన్ సూపర్ కప్ టైటిల్స్‌తో పాటు లా లిగా లీగ్‌లోనూ రియల్ టాప్‌లో నిలిచింది. వరుసగా 21 మ్యాచ్‌ల్లో అపజయం ఎరుగని రియల్ జట్టు... లోరెంజోతో జరిగిన టైటిల్ పోరులో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. రామోస్ (37వ ని.), బేల్ (51వ ని.) రియల్ జట్టుకు గోల్స్ అందించారు. న్యూజిలాండ్‌కు చెందిన ఆక్లాండ్ సిటీ క్లబ్ జట్టుకు మూడో స్థానం లభించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement