-
బాండ్ హీరో బ్యాచిలర్ కాదట..!
బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే ఆ పాత్రల్లో నటించే నటీనటులకు కూడా అదే స్ధాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇలాంటి సమయంలో బాండ్ సినిమాలను ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్‌ను ఓ న్యూస్ షాక్‌కి గురి చేసింది. తెర మీద బాండ్ గర్ల్స్‌తో హాట్ హాట్ సీన్లలో కనిపించే జేమ్స్ బాండ్ తెర వెనుక మాత్రం ఫ్యామిలీ మ్యాన్ అట. ఈ విషయం ఆయన భార్య రచెల్ వెయిజ్ స్వయంగా వెల్లడించింది. 2010లో 'డ్రీమ్ హౌస్' సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి కలిసిన వీరిద్దరు ...2011లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వివాహబంధాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్‌గానే మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్‌కు ప్రపంచ వ్యాప్తంగా లేడీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో క్రెగ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియనీయలేదని చెప్పింది రచెల్. ప్రస్తుతం డానియల్ క్రెగ్ బాండ్‌గా నటించిన 'స్పెక్టర్' ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా బాండ్ సీరీస్‌లో ఆఖరిది అన్న ప్రచారం జరుగుతుండటంతో, ఇక బాండ్ బ్యాచిలర్ కాదన్న విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదని భావించిన ఈ సెలబ్రిటీ కపుల్ తమ పెళ్లి గురించి, డానియల్ గురించి ఎన్నో విషయాలను 'మోర్' మేగజైన్‌తో పంచుకుంది. -
లండన్‌లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్
-
లండన్‌లో 'స్పెక్టర్' వరల్డ్ ప్రీమియర్
అంతర్జాతీయ సినీ అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బాండ్ మూవీ స్పెక్టర్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఎన్నో నెలలుగా బిజీ షెడ్యూల్ షూట్స్ తో, గాయాలతో, ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపిన చిత్రయూనిట్ ఫైనల్ గా తన కష్టాన్ని వెండితెర మీద చూపించే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రీమియర్ కు హాలీవుడ్ తారలు తరలి వచ్చారు. లండన్ లోని రాయల్ అల్బర్ట్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ ప్రీమియర్ లో బాండ్ పాత్రలో నటిస్తున్న డానియల్ క్రెగ్ తో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న లీ సెడాక్స్, మోనికా బెలుస్సీలు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రిన్స్ హారీ ఈ ప్రీమియర్ షోకు ప్రధాన ఆకర్షణ గా నిలిచారు. ప్రీమియర్ షోకు హాజరైన సెలబ్రిటీ అభిమానులతో పాటు సహనటులతో సెల్ఫీలు దిగుతూ సందడిగా కనిపించారు. డానియల్ క్రెగ్ నాలుగో సారి బాండ్ గా నటిస్తున్న స్పెక్టర్ నవంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. బాండ్ సీరీస్ లో 24వ సినిమాగా రిలీజ్ అవుతున్న స్పెక్టర్ ఈ సీరీస్ లో ఆఖరి చిత్రం అన్న ప్రచారం కూడా జరగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా స్పెటర్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సీరీస్ లో రిలీజ్ అయిన గత రెండు చిత్రాలు ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవటంతో యూనిట్ సభ్యులకు స్పెక్టర్ సక్సెస్ కీలకం కానుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement