-
పిల్లలతో కఠినంగా మాట్లాడొద్దు.. కారణం ఏంటంటే!
లాలయేత్ పంచ వర్షాణి దశవర్షాణి తాడయేత్ ‘ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్’ పిల్లలను ఐదు సంవత్సరాల పాటు లాలించాలి. పది సంవత్సరాల పాటు దండించాలి. పదహారో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పిల్లలను స్నేహితుల్లాగ చూడాలి అంటాడు చాణుక్యుడు. మనం కన్న బిడ్డలే కదా, వారి మీద మనకు సర్వాధికారాలు ఉన్నాయి కదా, వారిని ఏమన్నా చెల్లిపోతుంది అనుకోవటం తప్పు అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లల్ని చిన్నతనంలో అనవసరంగా తిడుతూ, కఠినంగా మాట్లాడుతూ వారిని అవమానించినట్లుగా మాట్లాడుతుంటే వారిలో బుద్ధి వికాసం తగ్గిపోతుందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తెలిసింది. పిల్లల్ని ప్రేమగా మందలించాలే కానీ, కఠిన శిక్షలు విధిస్తూ, మనసు గాయపడేలాంటి ములుకుల్లాంటి మాటలతో బాధించటం వల్ల వారు మానసికంగా ఎదగలేకపోతారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి అనురాగం, అభిమానం ఆశిస్తారు. అందుకు బదులుగా తిట్లు శాపనార్థాలు వస్తుంటే, ఆ పసి మనసు తట్టుకోలేకపోతుంది. పసి హృదయాలను గాజు బొమ్మల్లా పదిలంగా కాపాడుకోవాలంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. అందుకే వారు ఏది చెప్పినా జాగ్రత్తగా వింటూ, వారి ఆలోచనలను స్వాగతిస్తూ, వారు సక్రమమార్గంలో ఎదిగేలా తల్లిదండ్రులు సహకరించాలి. పదే పదే కోపం తెచ్చుకోవటం, కొట్టడం, భయపెట్టడం, వేధించటం... వంటి అస్త్రాలను పిల్లల మీదకు సంధిస్తుంటే, వారి మెదడు ఎదుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా కౌమార దశలో అంటే టీనేజ్‌లో ఉన్న వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ‘డెవలప్మెంట్ అండ్ సైకాలజీ’ వారు ప్రచురించారు. డా. సబ్రీనా సఫ్రెన్.. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఈ విషయాలను వెల్లడించారు. పిల్లల పట్ల కటువుగా ఉండటం తప్పేమీ కాదనుకుంటారు పెద్దలు. సమాజం కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తుంది. ఏదో ఒక దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తల్లిదండ్రులు ఇదే ఆలోచనతో ఉంటారని ఈ పరిశోధన చెబుతోంది. ‘మాట్లాడే మాటలు పిల్లల ఎదుగుదలలో మార్పులు తీసుకువస్తాయి. తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే... మాటిమాటికీ పిల్లల్ని దండించటం వల్ల పిల్లల మానసిక ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుందని’ అంటారు సఫ్రెన్. పిల్లల్ని లైంగికంగా, శారీరకంగా, మానసికంగా బాధకు గురి చేస్తుంటే, వారిలో ఏదో తెలియని ఆరాటం, విచారం పెరుగుతాయి. వారు ఎదుగుతున్న కొద్దీ ఈ విచారం ఒత్తిడిగా మారుతుంది. అందుకే పిల్లల్ని బాల్యం నుంచి మంచి మాటలు, మంచి కథలు చెబుతూ పెంచాలి. ఎటువంటి సమయంలోనైనా తల్లిదండ్రుల అండదండలు ఉంటాయనే భరోసా కల్పించాలి. కొట్టడం, తిట్టడం, నిందించం, అసభ్య పదాలు ఉపయోగించటం వల్ల... పిల్లలలో తెలివితేటలు తగ్గిపోతాయని ఈ సర్వే చెబుతోంది. -
'ఆన్లైన్ రివ్యూలపై ఆధారపడొద్దు'
బోస్టన్: వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లోని రివ్యూలపై ఆధారపడుతున్నారా? అయితే, మీకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఎలాంటి ఉత్పత్తి లేదా వస్తువుకైనా యావరేజ్ స్కోరింగ్‌తో పాటు రివ్యూలను భారీగా ఇవ్వటం వెబ్సైట్లు, యాప్‌లలో సర్వసాధారణంగా జరిగేదే. ఆన్లైన్లో రివ్యూలను చూసి వస్తువులను కొనుగోలు చేసే అలవాటున్న 132 మందిని సర్వే చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని స్టాన్ఫోర్డ్ వర్సిటి పరిశోధకుడు డెరెక్ పావెల్ వెల్లడించారు. ఉదాహరణకు అమెజాన్.కామ్ వెబ్సైట్లో లభ్యమయ్యే ఉత్పత్తులకు సంబంధించి చూస్తే.. ఇందులోని రివ్యూలకు, వాటికిచ్చే సరాసరి రేటింగ్‌లకు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు విశ్లేషించారు. ఎవరైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు.. ఎక్కువమంది ఏ బ్రాండ్‌కు చెందిన లేదా ఎలాంటి వస్తువును కొనుగోలు చేశారనేది తెలుసుకునేందుకు కొందరు పెట్టిన రివ్యూలపై ఆధారపడుతున్నారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో సదరు కొనుగోలు దారులు నష్టపోతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉండే తప్పుడు రివ్యూలను నమ్మి నాసిరకం వస్తువులను వీరు కొనుగోలు చేస్తున్నట్లు రుజువైంది. తక్కువ రేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కువ రివ్యూలు ఉన్న ప్రొడక్టులను కొనుగోలు చేయటం తెలివైన పని కాదని పరిశోధనకులు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement