-
వావ్రింకా ఇంటిముఖం...
తొలి రోజు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒస్టాపెంకో తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... రెండోరోజు పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, 2015 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ అద్వితీయ ఆటతీరు కనబరిచి ఐదు సెట్ల పోరాటంలో వావ్రింకాను బోల్తా కొట్టించాడు. ఈ ఓటమితో జూన్ రెండో వారంలో విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ప్రస్తుత 30వ ర్యాంక్ నుంచి దిగజారి 256వ ర్యాంక్‌కు పడిపోనున్నాడు. మరోవైపు మాజీ చాంపియన్, 20వ సీడ్ నొవాక్ జొకోవిచ్, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. పారిస్: కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయిన స్విట్జర్లాండ్ అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకాకు ఫ్రెంచ్ ఓపెన్‌లో చేదు ఫలితం ఎదురైంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన అతను ఈసారి తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) 6–2, 3–6, 4–6, 7–6 (7/5), 6–3తో వావ్రింకాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే ఊహించని రీతిలో ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఐదుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఈ ఓటమితో నా ర్యాంక్ ఘోరంగా పడిపోతుందని తెలుసు. అయితే దీనిపై నాకేమీ ఇబ్బంది లేదు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది’ అని 33 ఏళ్ల వావ్రింకా వ్యాఖ్యానించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 20వ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–1తో ఇవాష్కా (బెలారస్)పై, 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–2, 7–6 (8/6)తో టియాఫో (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. వొజ్నియాకి ముందంజ... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి చేరగా... 20వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) తొలి రౌండ్లో పరాజయం చవి చూసింది. వొజ్నియాకి 7–6 (7/2), 6–1తో కోలిన్స్ (అమెరికా)పై, క్విటోవా 3–6, 6–1, 7–5తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. సెవస్తోవా 6–4, 1–6, 3–6తో మరీనో (కొలంబియా) చేతిలో ఓడింది. -
వావ్రింకా.. వావ్!
-
వావ్రింకా.. వావ్!
స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ సెర్బియన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ని వావ్రింకా మట్టికరిపించాడు. హోరా హోరీగా జరిగిన ఫైనల్లో 6-7(1), 6-4, 7-5, 6-3 సెట్లలో జకోవిచ్ ను ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన వావ్రింకా మూడు టైటిల్స్‌ను గెలుపొందాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ లలో వావ్రింకా విజేతగా నిలిచాడు. -
జొకోవిచ్‌తో వావ్రింకా ‘సై’
♦ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ♦ టైటిల్‌పై సెర్బియా, స్విస్ స్టార్స్ గురి ♦ సెమీస్‌లో మోన్ఫిల్స్, నిషికొరిలపై విజయం ♦ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో స్టానిస్లాస్ వావ్రింకా... యూఎస్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. వావ్రింకా నెగ్గితే మ్యాచ్ పారుుంట్ కాచుకొని యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా నిలుస్తాడు. న్యూయార్క్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు లభించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-3, 6-2, 3-6, 6-2తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స)పై గెలుపొందగా... మూడో సీడ్ వావ్రింకా 4-6, 7-5, 6-4, 6-2తో ఆరో సీడ్ కీ నిషికొరి (జపాన్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 19-4తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు. జొకోవిచ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో 13 టైటిల్స్‌తో ఒంటరిగా మూడో స్థానానికి చేరుకుంటాడు. ఫెడరర్ (స్విట్జర్లాండ్-17 టైటిల్స్) అగ్రస్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెరుున్) 14 టైటిల్స్‌తో ఉమ్మడిగా రెండో స్థానంలో, 12 టైటిల్స్‌తో జొకోవిచ్, ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన గేల్ మోన్ఫిల్స్ టాప్ సీడ్ జొకోవిచ్‌ను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ టోర్నీలో తన ప్రత్యర్థులు మధ్యలో వైదొలగడంతో మూడు పూర్తిస్థారుు మ్యాచ్‌లు ఆడకుండానే సెమీస్‌కు చేరిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 15 నిమిషాల్లోనే తొలి సెట్లో 5-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అరుుతే మోన్ఫిల్స్ తేరుకొని మూడు గేమ్‌లు గెలిచినా సెట్‌ను మాత్రం కోల్పోయాడు. రెండో సెట్లోనూ జొకోవిచ్ హవా కొనసాగింది. మోన్ఫిల్స్ ఉద్దేశపూర్వకంగా గట్టిపోటీ ఇవ్వడంలేదని భావించిన ప్రేక్షకులు అతణ్ని ఎగతాళి చేశారు. మూడో సెట్లో మోన్ఫిల్స్ సహజశైలిలో ఆడి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. అరుుతే నాలుగో సెట్లో మళ్లీ జొకోవిచ్ విజృంభించడంతో మోన్ఫిల్స్ చేతులెత్తేశాడు. 2 గంటల 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మోన్ఫిల్స్ 11 ఏస్‌లు సంధించి, 11 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ ఒకే ఏస్ కొట్టి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేశాడు. మాజీ రన్నరప్ నిషికొరితో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా తొలి సెట్‌ను కోల్పోరుునా వెంటనే తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతంలో రెండుసార్లు సెమీఫైనల్లో ఓడిన వావ్రింకా మూడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్లో డానియల్ ఇవాన్‌స (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సెట్లో మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న వావ్రింకా... వరుసగా మూడో మ్యాచ్‌లో నాలుగు సెట్లు ఆడి గెలిచాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో వావ్రింకా పది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. -
గట్టెక్కిన వావ్రింకా
ప్రిక్వార్టర్స్‌లోకి స్విస్ స్టార్ మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న మూడో యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా మూడో రౌండ్లో మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచిన ఈ స్విస్ ప్లేయర్ ఆ తర్వాత మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకొని అతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. అన్‌సీడెడ్ డాన్ ఇవాన్‌స (బ్రిటన్)తో ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో వావ్రింకా 4-6, 6-3, 6-7 (6/8), 7-6 (10/8), 6-2తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాలుగో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 5-6తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు. అరుుతే మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్న అతను 10-8తో టైబ్రేక్‌లో సెట్‌ను సాధించి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ‘మ్యాచ్ పారుుంట్‌ను కాచుకున్నాక విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని వావ్రింకా అన్నాడు. మాజీ చాంపియన్, రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మూడో రౌండ్లో ముర్రే 7-6 (7/4), 5-7, 6-2, 6-3తో పాలో లొరెంజీ (ఇటలీ)ను ఓడించాడు. ఫెరర్‌కు షాక్... మరోవైపు 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) మూడో రౌండ్లో నిష్కమ్రించాడు. మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7-6 (7/3), 6-2, 6-3తో ఫెరర్‌ను ఓడించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 1-6, 6-4, 6-4, 7-5తో కరెనో బస్టా (స్పెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-1, 6-2, 6-2తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స)పై, 21వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-6 (7/3), 6-3తో డొనాల్డ్సన్ (అమెరికా)పై, 22వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-4, 6-1, 3-6, 6-2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మర్చెంకో (ఉక్రెరుున్)తో జరిగిన మ్యాచ్‌లో 14వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) స్కోరు 6-4, 4-6, 1-6తో ఉన్నదశలో గాయం కారణంగా వైదొలిగాడు. క్వార్టర్స్‌లో విన్సీ, సెవస్తోవా గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), అన్‌సీడెడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ విన్సీ 7-6 (7/5), 6-2తో సురెంకో (ఉక్రెరుున్)పై గెలుపొందగా... సెవస్తోవా 6-4, 7-5తో 13వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement