-
ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది. చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్ -
బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్
త్వరలో మొహెంజోదారో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు. గతంలో మరే హీరో చేయని విధంగా స్టార్ నెట్‌వర్క్‌తో భారీ డీల్‌కు అంగీకరించాడు. రాబోయే హృతిక్ సినిమాల కోసం స్టార్ టివి ఏకంగా 550 కోట్ల మొత్తానికి హృతిక్ రోషన్‌తో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హృతిక్ తన రాబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆ టివి చానల్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. కాగా బాలీవుడ్ చరిత్రలోనే ఇదే బిగెస్ట్ డీల్ అంటున్నారు విశ్లేషకులు. జిందగీ నా మిలేంగే దుబారా, అగ్రిపథ్, క్రిష్ 3, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో పాటు.., ఆ సినిమాల శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తాలకు అమ్ముడు పోవటంతో స్టార్ టివి ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్‌ఫోన్‌తో హై బీపీ!
- ఐదేళ్లలో మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు
Advertisement