-
క్షీణించిన కార్ల అమ్మకాలు
సియామ్ ఏప్రిల్ గణాంకాలు ఏడాది కాలంలో ఇదే అత్యధిక క్షీణత న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు గత నెలలో 10.15 శాతం క్షీణించాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ఒక ఏడాది కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే గత నెలలోనే కార్ల అమ్మకాలు అధికంగా క్షీణించాయని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, డిమాండ్ పుంజుకోలేదని ఫలితంగా కార్ల అమ్మకాలు క్షీణించాయని వివరించారు. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, ఇంధనం ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ అమ్మకాలు పుంజుకోలేదని. ప్రతికూల సెంటిమెంట్ నుంచి బయటపడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఇంతేనేమో!
న్యూఢిల్లీ: దేశీయ కార్ల అమ్మకాలు నవంబర్లో 8 శాతం తగ్గాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ మంగళవారం తెలిపారు. పండుగల సీజన్ ముగియడంతో అమ్మకాలు తగ్గాయని పేర్కొన్నారు. పండుగల సీజన్లో ఉన్నంతగా నవంబర్లో వాహన విక్రయాలుండవని అంచనా వేశామని, అందుకు తగ్గట్లుగానే అమ్మకాలు పడిపోయాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ పరిస్థితుల్లో మార్పుండకపోవచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి అద్భుత చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...., గత నవంబర్లో 1,55,535 కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది నవంబర్లో 1,42,849 కార్లు విక్రయమయ్యాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 8,67,508 నుంచి 1 శాతం వృద్ధితో 8,80,015కు పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 2,44,414 నుంచి 25 శాతం వృద్ధి చెంది 3,05,586కు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 61,403 నుంచి 29 శాతం క్షీణించి 43,730కు తగ్గాయి. మొత్తం మీద గత నవబర్లో 15,12,869గా ఉన్న మొత్తం వాహనాల అమ్మకాలు 0.90 శాతం వృద్ధితో ఈ ఏడాది నవంబర్లో 15,26,438కు చేరాయి. వడ్డీరేట్లు, ఇంధనం ధరలు పెరుగుతుండడం, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంట్ తక్కువగా ఉండడం వంటి అంశాలు వాహనాల డిమాండ్, అమ్మకాలపై ప్రభావం చూపాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్ అమ్మకాలు 4% చొప్పున తగ్గాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 42% పడిపోయాయి. హోండా అమేజ్ కారు కారణంగా హోండా కార్స్ ఇండియా విక్రయాలు మాత్రం 151 % పెరిగాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement