-
ఐశ్వర్యరాయ్‌తో వివేక్ ప్రేమాయణం.. నటుడు ఏమన్నాడంటే?
కొన్ని ప్రేమకథలు సుఖాంతం అవుతే మరికొన్ని ప్రేమకథలు మధ్యలోనే ఆగిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు వివేక్ ఒబెరాయ్- ఐశ్వర్యరాయ్ లవ్‌స్టోరీ రెండో కోవలోకి చెందుతుంది. వీరు గాఢంగా ప్రేమించుకున్నారు, కట్ చేస్తే ఇద్దరూ చెరొకరిని పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే ఐష్‌తో తన కొడుకు ప్రేమాయణం గురించి మొదట్లో ఏమీ తెలియలేదన్నాడు సురేశ్ ఒబెరాయ్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 'చాలా విషయాలు నాకసలు తెలియనే తెలీదు. వివేక్ ఎప్పుడూ నాతో ఓపెన్‌గా చెప్పలేదు. రాము (రామ్ గోపాల్ వర్మ)యే అదంతా నాతో చెప్పాడు. ఐశ్వర్యతో లవ్.. వద్దని వారించా రాము కంటే ముందు కూడా ఎవరో చెప్పినట్లు గుర్తు. కానీ తను ఏదైతే చేస్తున్నాడో అది వెంటనే ఆపేయమని చెప్పాను. ఎందుకనేది అతడికి అర్థమయ్యేలా వివరించాను' అని చెప్పుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ చెప్పిన వెంటనే వివేక్‌తో ప్రేమలో పడింది ఐష్. కానీ వీరి బంధం కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో త్వరగా బ్రేకప్ చెప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడి అమితాబ్ ఇంటికి కోడలిగా వెళ్లింది ఐశ్వర్య రాయ్. ఎవరీ సురేశ్- వివేక్.. సురేశ్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈయన సహజ నటుడు. ఏడేళ్ల వయసులోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాడు. మిర్చ్ మసాలా, ఐత్బార్, లావారిస్, ఘర్ ఏక్ మందిర్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో మరణ మృదంగం వంటి సినిమాలు చేశాడు. ఇటీవలే యానిమల్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. ఈయన తనయుడు వివేక్ ఒబెరాయ్.. రక్త చరిత్ర, క్రిష్ 3 వంటి పలు సినిమాల్లో నటించాడు. పీఎమ్ నరేంద్రమోది బయోపిక్‌లో ప్రధాని మోది పాత్రను పోషించాడు. తాజాగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. చదవండి: దావూద్ పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. ఒక్క ఫోటోతో జీవితం నాశనం! -
రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్!
సిసలైన హైదరాబాదీలైన బాలీవుడ్ ఒబెరాయ్‌లు ఎప్పటికీ హైదరాబాద్‌ను మాత్రం మర్చిపోరు, మర్చిపోలేరు. ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూనే ఉంటారు. అందుకోసం సోషల్ మీడియాను కూడా బాగానే ఫాలో అవుతారు. హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు. సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు, 'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు. దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు. Wow!Super impressive Ram Anna! Bcoz of ur efforts its not just #HappeningHyderabad but it's also #TerrificTelengana https://t.co/WHJvukRspj — Vivek Oberoi (@vivek_oberoi) November 9, 2015 Thanks Vivek Bhai! Appreciate your kind words. How is our Hyderabadi Oberoi Saab doing? Convey my regards please https://t.co/w8D4iBVlyH — K Taraka Rama Rao (@KTRTRS) November 10, 2015 -
నిలకడైన నిలువెత్తు నటుడు
నిలువెత్తు నటుడు అతడు. నిలకడైన నటన అతడిది. హావభావ విన్యాసాల్లో ఎక్కడా మోతాదు మించడు. ఆహార్యంలో హుందాతనాన్ని వదులుకోడు. పాత్రౌచిత్యాన్ని ఏమాత్రం భంగపరచడు. బాలీవుడ్లో సిసలైన ‘సపోర్టింగ్’ యాక్టర్ అతడు... సురేశ్ ఓబెరాయ్ పక్కా హైదరాబాదీ. దేశ విభజనకు ముందు బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో (ప్రస్తుతం ఇది పాకిస్థాన్‌లో ఉంది) 1946 డిసెంబర్ 17న పుట్టాడు. విభజన సమయంలో జరిగిన గొడవలకు అతడి తల్లిదండ్రులు ఆనంద్సరూప్ ఓబెరాయ్, కర్తార్దేవి భారత్‌కు వచ్చేశారు. ఆనంద్ సరూప్‌కు క్వెట్టా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది. - సురేశ్ ఓబెరాయ్ దేశ విభజనతో అన్నీ వదులుకుని, ఇక్కడకు వచ్చేశారు. తొలుత అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అప్పటికి సురేశ్ ఓబెరాయ్ పసికందు. నిజానికి అతడి అసలు పేరు విశాల్‌కుమార్ ఓబెరాయ్. హైదరాబాద్ వచ్చేసిన కొత్తలో ఓబెరాయ్ కుటుంబం చాలా కష్టాలు పడింది. ఆనంద్ సరూప్ దంపతులకు ఎనిమిది మంది సంతానం. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. తిండికి కూడా ఇక్కట్లు పడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆనంద్సరూప్ ధైర్యం చేసి, పాకిస్థాన్ వెళ్లారు. స్వస్థలంలోని ఆస్తులన్నీ అమ్మేసుకుని, హైదరాబాద్‌కు తిరిగి చేరుకుని, ఇక్కడ మెడికల్ షాపులు ప్రారంభించారు. సురేశ్ ఓబెరాయ్ ఇక్కడి సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు. స్కూల్లో టెన్నిస్, స్విమ్మింగ్‌లో చాంపియన్‌గా రాణించి, బాయ్స్ స్కౌట్లో రాష్ట్రపతి పతకాన్ని అందుకున్నాడు. డాక్టర్ కావాలనుకుని... సురేశ్ ఓబెరాయ్ సహజ నటుడు. ఏడేళ్ల పసితనంలోనే తొలిసారిగా ఆడపిల్ల వేషంలో రంగస్థలంపై అడుగుపెట్టాడు. చదువుకునే రోజుల్లో డాక్టర్ కావాలనుకున్నాడు. హైస్కూల్ చదువు పూర్తయ్యే సమయానికి వైష్ణోదేవి యాత్రకు వెళ్లిన తండ్రి ఆకస్మికంగా మరణించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. సోదరులతో కలసి వ్యాపార బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఓబెరాయ్ సోదరులెవరికీ పెద్దగా అనుభవం లేకపోవడంతో వ్యాపారాన్ని లాభసాటిగా నడపలేకపోయారు. వ్యాపారం తన వల్ల కాదనుకుని పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తిగా నటనలో పడితే పాడైపోతాడనుకుని, కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాల్సిన రోజే.. 1974 ఆగస్టు 1న యశోధరతో పెళ్లి జరిగింది. అయితే, ఆరోగ్యం బాగాలేదని, వారంలోగా వచ్చి చేరతానని పుణే ఇన్స్టిట్యూట్కు రాశాడు. మూడు నెలల డెరైక్షన్ కోర్సు చేసి వచ్చేస్తానని భార్యతో అబద్ధమాడి బయలుదేరాడు. నిజానికి రెండేళ్ల యాక్టింగ్ కోర్సుకు అతడు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి వారాంతంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేవాడు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన రెండేళ్లకే వివేక్ పుట్టాడు. ఏక్‌బార్ ఫిర్... వివేక్ పుట్టిన ఏడాదికి ముంబైకి కాపురాన్ని తరలించేశాడు. అప్పటికి ఒకటీ అరా రేడియో అసైన్మెంట్లు తప్ప సురేశ్ ఓబెరాయ్ చేతిలో సినిమాలేవీ లేవు. రేడియో కార్యక్రమాల ద్వారా వారానికి యాభై రూపాయలు వచ్చేది. యాడ్ ఏజెన్సీల చుట్టూ తిరిగితే లైఫ్‌బాయ్ సోప్, చార్మినార్ సిగరెట్లకు మోడలింగ్ చేసే అవకాశం దక్కింది. చాలా సినిమా కష్టాల తర్వాత వినోద్ పాండే దర్శకత్వంలోని ‘ఏక్‌బార్ ఫిర్’లో తొలి అవకాశం దక్కింది. ఆ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ లేకపోవడంతో అది పూర్తయ్యాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రకాశ్ మెహ్రా తన రేడియో కార్యక్రమం ‘ముకద్దర్‌కా సికందర్’లో సురేశ్ ఓబెరాయ్కి ప్రధాన పాత్ర ఇచ్చాడు. అక్కడితో అతడి గొంతుకు గుర్తింపు వచ్చింది. తొలినాళ్లలో దొరికిన పాత్రనల్లా చేసుకుంటూ పోయినా, నటనలో ఎప్పుడూ దారి తప్పలేదు. ‘మిర్చ్ మసాలా’లో ముఖి పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ‘ఐత్బార్’, ‘లావారిస్’, ‘ఘర్ ఏక్ మందిర్’ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు. తెలుగులో ‘మరణమృదంగం’లో, కన్నడంలో వీరప్పన్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘అట్టహాస’లో రాజ్‌కుమార్ పాత్రలో రాణించడమే కాదు, ఫ్రెంచి, జపనీస్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. - పన్యాల జగన్నాథదాసు
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement