-
‘పవర్‌స్టార్’ అరెస్ట్‌కు కోర్టు ఉత్తర్వులు
చెన్నై : నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి హాజరుపరచాల్సిందిగా దురైయూర్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు పవర్‌స్టార్ శ్రీనివాసన్‌పై పలు మోసపు కేసులు నమోదయిన విషయం తెలిసిందే. పలు మార్లు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా తిరుచ్చి జిల్లా, దురైయూర్కు చెందిన వరదరాజన్ అనే వ్యక్తికి పవర్‌స్టార్ శ్రీనివాసన్ ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానని చెప్పి కమీషన్‌గా అతని వద్ద రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ తరువాత వరదరాజన్‌కు శ్రీనివాసన్ ఎలాంటి రుణం ఇప్పించలేదు. దీంతో వరదరాజన్ తాను ఇచ్చిన రూ.30 లక్షలు తిరిగి ఇవ్వవలసిందిగా అడగడంతో రెండేళ్ల క్రితం అతనికి శ్రీనివాసన్ చెక్కు ఇచ్చాడు. అది బ్యాంక్‌లో బౌన్స్ అవ్వడంతో తాను మోసపోయానని భావించిన వరదరాజన్ దురైయూర్ నేర విభాగ శాఖ కోర్టులో శ్రీనివాసన్‌పై పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు పలు సార్లు విచారణకు వచ్చినా శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాలేదు. మరోసారి గురువారం న్యాయమూర్తి వడివేలు సమక్షంలో విచారణకు వచ్చింది. మళ్లీ శ్రీనివాసన్ కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి... శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం
తిరువొత్తియూరు: భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపడంతో విరక్తి చెందిన సినిమా సహాయ నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓనాయుం, ఆటుకుట్టిం, డమాల్ డుమీల్, శకుని తదితర సినిమాల్లో సహాయ నటుడిగా నటించిన అరసు అనే ఇలవరసన్. ఇతను 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి శివ అనే కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలవరసన్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది చూసిన ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకుని విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఇలవరసన్ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కొడుంగయూర్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అతని ఇంట్లో లభించిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సినీ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు దీనంగా తన బాధను వ్యక్తం చేస్తూ రాసినట్టు తెలిసింది. అందులో తాను ఏడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని తనకు సినిమా రంగంలో తగిన జీతం అందలేదని, దీని వలన కుటుంబంలో తనకు తన భార్యకు మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని తాను విరక్తి చెంది ఉన్న సమయంలో తనకు తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు అందిందని, దీని వలన తన కుమారుడికి ఇబ్బందులు గురవుతున్నాడని దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం
మాస్ ఎంట్రీ.. చైనాలో పుతిన్‌కు గ్రాండ్ వెల్కమ్!
జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్
సన్నీ లియోన్ బర్త్‌డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ సినిమా టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
నేడు విజయవాడకు సీఎం జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్‌మెన్ దారుణ హత్య
- కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ మూకల హత్యాయత్నం
- తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- సెన్స్‌క్స్ డౌట్!
Advertisement