-
తానా నవలల పోటీ... విజేతలు వీరే
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన నవలల పోటీలో విశాఖపట్నంకి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్థనారి నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలిద్దరికి రెండు లక్షల రూపాయలను సమానంగా అందివ్వనున్నారు. అదే విధంగా ఈ నవలలను ప్రచురించే బాధ్యతలను తామే తీసుకుంటామని తానా కార్యవర్గం ప్రకటించింది. తానా ఆధ్వర్యంలో 1997 నుంచి నవలల పోటీలు జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల పాటు నవల, కథా పోటీలు నిరాటంకంగా జరిగాయి. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఈ పోటీలు నిర్వహించలేదు. తిరిగి 2017 నుంచి నవల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగిన నవలల పోటీకి మొత్తం 107 నవలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. -
ఖాకీల కాసుల లొల్లి
- నిర్వహణ నిధులతో కొత్త చిక్కులు - తలలు పట్టుకుంటున్న పోలీసులు - వాటాలు డబుల్..! కరీంనగర్ క్రైం : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఠాణాల నిర్వహణ నగదు ఖాకీల మధ్య కాసుల లొల్లికి తెరలేపింది. ప్రభుత్వం ఇస్తున్న మొత్తంలో తమ వాటా పంపాలని ఉన్నతాధికారుల హుకుంతో మండలాల్లోని ఎస్సైలు బెంబేలెత్తుతున్నారు. ఇటు ఠాణాను మెరుుంటేన్ చేయలేక.. అటు ఉన్నతాధికారులకు వాటాలు పంపిణీ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. మాట వినని అధికారులను మెమోల పేరిటా వారి దారిలోకి తెచ్చుకుంటున్నట్లు తెలిసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చే మూడు, నాలుగు వేలతో ఠాణా నిర్వహణకు ఇబ్బందులు పడేవారు. దీంతో ప్రతి పోలీస్‌స్టేషన్ రోజు వ్యవహారాల కోసం మూముళ్లు వసూలు చేసేవారు. ఇవి ఠాణాకు ఇంత అని ఉండేది. ఇలా వ చ్చిన మూముళ్లను నెలవారీ ఠాణా నిర్వహణకు పోను మిగిలిన వాటిలో సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల నిర్వహణకు వెచ్చించేవారు. ఈ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. వీటికి పోను చిన్నపాటి పనులకు స్టేషన్‌కు వచ్చే వారి నుంచి కొంత మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. ఆరోపణలను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఠాణాల నెలవారీ నిర్వహణ ఖర్చులు ఇచ్చేందుకు నిర్ణరుుంచింది. నగర ఠాణాలకు రూ.50 వేలు, రూరల్, మండల ఠాణాలకు రూ.25 వేల చొప్పున ఇస్తోంది. మొదటి మూడు నెలల డబ్బులు ఒకేసారి ఆయా ఠాణాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో పై నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ వాటి కోసం ఆశపడ్డారు. దీంతో అయా ఠాణా ఎస్‌హెచ్‌వోలకు కొత్త చిక్కులు మొదలయ్యూరుు. పాత లెక్క ప్రకారం పాత మామూళ్ల పంపకంతోపాటు కొత్తగా ప్రభుత్వం ఇస్తున్న వాటిలోనూ వాటాలు పంపాలని హుకుం జారీ చేస్తున్నారని.. వినని వారిపై అధికారాన్ని వినియోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిసింది. దీంతో కక్కలేక మింగలేక ఎస్‌హెచ్‌వోలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఓ సబ్ డివిజన్లోని ఓ ఠాణాకు మూడు నెలలకు రూ.75 వేలు రావడంతో ఆయా ఎస్‌హెచ్‌వో వాటిని స్టేషన్‌కు అవసరమైన సరంజామా కొనుగోలు చేద్దామని అనుకుని పై అధికారులకు విన్నవించాడు. సరంజామా విషయం పక్కన పెట్టి వచ్చిన డబ్బులో సర్కిల్ ఒక నెల, డీఎస్పీ కార్యాలయానికి ఒక నెల ఇవ్వాలని హుకుం జారీ చేశారు. ఖంగుతిన్న సదరు ఎస్సై అత్యవసరంగా స్టేషన్‌ను బాగు చేరుుంచాలని విన్నవించినా వారు ససేమిరా అన్నారు. మిన్నకుండిపోయిన ఎస్సై డబ్బును అలాగే ఉంచడంతోపాటు పాత బకాయిలు చెల్లించాలని అనుకున్నాడు. పంపకాలు రాకపోయే సరికి ఇది గిట్టని సదరు సబ్‌డివిజన్ అధికారి స్టేషన్ నిర్వహణ చేయడం లేదని ఏకంగా మెమో ఇచ్చినట్లు తెలిసింది. - మరో సబ్ డివిజన్లో ఓ డీఎస్పీ నెలవారీ మూముళ్లకు కొత్త పద్ధతికి తెరలేపారని సమాచారం. గతంలో లాగా నడుస్తున్న విధానంలో మామూళ్లు ఇవ్వడంతోపాటు ప్రతి ఠాణా ఎస్సై, సీఐ అదనంగా రూ.10 వేలు పంపాలని నిర్ణయించిన ట్లు తెలిసింది. ఐదారు నెలలుగా వారు ఇబ్బందులు పడుతూనే వాటిని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇవ్వకుంటే వారు న మోదు చేస్తున్న కేసుల విషయంలో వేలుపెడుతూ మెమోలు ఇస్తున్నారని తెలిసింది. - మరో సబ్ డివిజన్లో డీఎస్పీ పాత పద్ధతి ప్రకారం నెలవారీ మామూళ్లతోపాటు ప్రభుత్వం ఇస్తున్న వాటిలో వాటాలు, అదనంగా కేసుల్లో వచ్చే మామూళ్ల నుంచి వాటాలు పంపించాలని సూచిస్తున్నారని పలువురు అధికారులు వాపోతున్నారు. నలిగిపోతున్న ఎస్సైలు తాజా బదిలీల్లో కొత్త నేతల సిఫారసు తెరపైకి రావడంతో పలువురు ఎస్సైలు పోస్టింగ్‌ల కోసం ఆయూ నాయకులను ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. ప్రసన్నం చేసుకునే క్రమంలో అధికారులు అప్పులు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పై అధికారుల వైఖరితో ఎందుకు పోస్టింగ్‌కు వచ్చామా? అని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఉన్నతాధికారులు చాలా రోజులుగా జిల్లాలో పనిచేయడంతో నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో నేరుగా కేసులను డీల్ చేస్తున్నారని.. రాబడి సైతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మారని తీరు రాష్ట్రంలోని పోలీస్‌శాఖకు గతంలో ఎన్నడూ లేని విధంగా పలు రకాల సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం. ప్రతి ఠాణాకు వాహనాలు సమకూర్చడంతోపాటు డీజిల్ నిర్వహణ ఖర్చులు ఇస్తోంది. ఠాణా నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడం లేదని జనం చర్చించుకుంటున్నారు. కొత్తగా ప్రభుత్వం ఇస్తున నిర్వహణ నగదు వాటి వాటాల మొత్తం పెంచిందనే విమర్శలు వస్తున్నారుు. ఉన్నతాధికారులు స్పందించి మార్పు కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement