-
అహంకారం చీకటికన్నా ప్రమాదకరం
దురహంకారం, మూర్ఖత్వం కవలపిల్లలు. విషాదమేమిటంటే తన మూర్ఖత్వమే తనకు గొయ్యి తవ్వుతుందన్నది దురహంకారికి తెలియదు. ఈజిప్టు చక్రవర్తి ఫరో దురహంకారి, పరమమూర్ఖుడు కూడా! అక్కడ నాలుగొందల ఏళ్లుగా బానిసలుగా దుర్భర జీవితాన్ననుభవిస్తున్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల చేయించడానికి దేవుడే పరోక్షంగా ఫరో మూర్ఖత్వం, దురహంకారంతో పోరాడవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసలే అయినా తమ ప్రతిభాపాటవాలతో, శ్రమతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వాళ్లు దేశం వదిలివెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఫరో వారిని విడుదల చేయడానికి ససేమిరా అన్నాడు. ఈజిప్టు ప్రజలు, జంతువుల తొలి సంతానాన్ని దేవుడు హతం చేయడంతో ఫరో దిగి వచ్చి ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు. అయితే దేవుడు దూరదృష్టితో వారిని కనానను దేశానికి దర్గరి దారిలో కాక, ఎర్రసముద్రం అడ్డుగా ఉన్న చుట్టు దారిలో నడిపించాడు (నిర్గమ 13: 17,18). ఇశ్రాయేలీయులను వదిలినట్టే వదిలి మనసు మార్చుకొని మూర్ఖత్వంతో వారి సంహారానికి ఫరో తన సైన్యంతో బయలుదేరాడు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలో ఉన్న ఇశ్రాయేలీయులకు, సముద్రాన్ని రెండు పాయలు చేసి మధ్యలో దారిని ఏర్పరచి, దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అంతదాకా ఇశ్రాయేలీయులకు నీడనిస్తూ, దారి చూపిస్తున్న మేఘస్తంభాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడు. అకారణంగా వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యానికి తాము ఎర్ర సముద్రంలోకి వచ్చామన్నది తెలియలేదు. ఇశ్రాయేలీయులంతా సముద్రపు దారిని దాటేటప్పటికి ఫరో సైన్యం ఆ దారిలో సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తిరిగి మేఘస్తంభాన్ని తొలగించి ఇశ్రాయేలీయులకు ముందు పెట్టినప్పుడు కాని ఫరోకు తామెంత ప్రమాదంలో చిక్కుకున్నామో అర్థం కాలేదు. కాని తప్పించుకునే మార్గం లేదు. దేవుడు సముద్రజలాల్ని యధాతథం చేయడంతో ఫరో, అతనితో పాటున్న వేలాదిమంది సైనికులు జలసమాధి అయ్యారు. అలా ఇశ్రాయేలీయులకున్న శత్రుభయమనేది లేకుండా పోయింది. ఈ ఉదంతం రెండు విషయాలు స్పష్టం చేస్తుంది. దగ్గరి దారులుండగా వాటిని కాదని దేవుడు చుట్టు దారిన నడిపిస్తున్నాడన్నా, ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్నివ్వడంలో ఆలస్యం చేస్తున్నాడన్నా, దాంట్లో ఒక మహాగొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడన్నది మొదటి విషయం. తాను బలవంతుడనని దురహంకారంతో ఎంత విర్రవీగినా దేవుడు తలుచుకుంటే చివరికి మట్టి కరిచి చరిత్రహీనుడు కాక తప్పదన్నది రెండవ అంశం. ప్రతికూలత ఎదురైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా సాగనప్పుడు కృంగిపోకుండా, దేవుడు చుట్టుదారిలో నడిపించినా తుదకు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేర్చుతాడని మనం నమ్మాలి. ఫరో బలం ముందు బానిసలైన ఇశ్రాయేలీయులెంత? కాని ఇశ్రాయేలీయుల వెనుక దేవుని బలం ఉన్నదని, ఆ బలాన్ని తానెదుర్కోలేనన్న వివేచనను ఫరో తన దురహంకారం కారణంగా కోల్పోయి దిక్కులేని వాడిలాగా దుర్మరణం చెందాడు. రాత్రి చీకటున్నా పగలు వెలుగుంటుంది. కాని దురహంకారి జీవితంలో పగలు, రాత్రి కూడా చీకటే, అనుక్షణమూ అశాంతే! ఫరో దురహంకార నిర్ణయానికి వేలాదిమంది సైనికులు బలైనట్టే, కొందరు నాయకుల మూర్ఖత్వం, దురహంకారం మొత్తం దేశాన్ని అశాంతిమయం చేయడం ఇప్పుడూ చూస్తున్నాం. కొండను కూడా పెకిలించగల శక్తి మంచితనానిది, మృదుత్వానిదైతే, ఉన్నట్టుండి కొండంత అశాంతికి గురి చేసే శక్తి దురహంకారానిది!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసి శక్తికి మూలం... దేవుడే!
దైవప్రజలైన ఇశ్రాయేలీయులకు వారి బద్ధ శత్రువులైన ఫిలిష్తీయులకు ఒకసారి యుద్ధం జరుగుతోంది. గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీలేని గొర్రెల కాపరియైన దావీదు, తనతో దేవుడున్నాడన్న విశ్వాసం, విశ్వాసియైన తన ముందు సున్నతి లేని అల్పుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిశెలతో చిన్న రాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించిపెట్టాడు (1 సమూ 17:17-54). విశ్వాసానికి మరోపేరు రోషం. విజయసాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా మన దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాగ ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తితో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తిస్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేనివారిని వికలాంగులంటారు. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు, శక్తి కూడా తనదేనన్న గ్రహింపు లేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మన పిడికిట్లో వెయ్యేళ్లున్నా, మొలకెత్తని విత్తనం, నేలలోపడ్డ మరుక్షణం మరో సృష్టి రూపమవుతుంటుంది. అది మొలకెత్తి మహావృక్షమై, ఫలదాతయై మానవాళి కల్యాణానికి కారకమవుతోంది. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్ముని సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడకొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలయదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లు ఉండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. అంతటి తన సర్వజ్ఞత, అసమాన శక్తి మానవునికి అర్థమై అందుబాటులో ఉండేందుకే దేవుడు దాన్నంతా తన కుమారుడైన యేసుక్రీస్తులో నింపి మానవరూపంలో ఈ లోకానికి పంపాడు. యుగయుగాల మానవుని ఒంటరితనానికి, సందేహాలకు, ప్రశ్నలకు దేవుడు జవాబివ్వడం కాదు, దేవుడే జవాబై యేసుక్రీస్తుగా ఈ లోక సందర్శనకు వచ్చాడు. అదే క్రిస్మస్!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement