-
వారఫలాలు : 12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలు, ఇతర సమస్యల నుంచి కొంత విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహం. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. మీనుంచి సన్నిహితులు సాయం కోరతారు. కొంత శ్రమపడ్డా అనుకున్న పనులు పూర్తి కాగలవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) రుణబాధలు, సమస్యలు తీరే సమయం. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సోదరులు, సోదరీలతో వివాదాల సర్దుబాటు. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత్తహోదాలు. లేతఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం ఉత్తమం. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకుపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు చేసేయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. అయితే వారం చివరిలో అనూహ్యంగా అనుకూల ఫలితాలు పొందుతారు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆదాయానికి లోటు ఉండదు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధించే దిశగా పయనిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నేరేడు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆలోచనలు కార్యరూపం. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు పురోగతి. పసుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న రాబడి పొందుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి పిలుపు రావచ్చు. ఒక అవకాశం అప్రయత్నంగా లభిస్తుంది, సద్వినియోగం చేసుకోండి. సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊరట. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ఆహ్వానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. మీ నేర్పు, ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. బంగారు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నిరుద్యోగులకు శుభవార్తలు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక సమస్యలు తీరి, రుణఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందే అవకాశం. యుక్తితో వ్యవహరించి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగులకు హోదాలు, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. నీలం, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) బంధుమిత్రుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆశయాలు సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఇంటిలో శుభకార్యాలు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు వారం చివరిలో అనుకూల పరిస్థితి. కళాకారులు అవకాశాలు దక్కించుకునేందుకు మరింత కృషి చేయాలి. నలుపు, లేత గులాబీరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. ఎరుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి. -
వారఫలాలు 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు తప్పవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. విమర్శలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పనులలో అవరోధాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో కొంత అనుకూలత. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చన చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. మీ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగులకు Sకీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు తథ్యం. తెలుపు, చాక్లెట్‌రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణాలయ దర్శనం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో సమస్యలు కొంతమేరకు పరిష్కారం. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు,మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు,బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వాహన,గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఈవారం పట్టింది బంగారమే. ఆశించినంత ఆదాయం. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు కూడా మీ దారికి వస్తారు. కార్యక్రమాలలో విజయం. వాహనయోగం. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత ్తపెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ప్రగతి. ఎరుపు, లేతపసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కుటుంబానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. సోదరులు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు,నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పూదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆదాయానికి మించి ఖర్చులు. పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలలో అస్థిరత. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. నిర్ణయాలలో నిదానం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో హామీలు వద్దు. ఇతరుల విమర్శలకు తలవొగ్గడం ఉత్తమం. పనులు వాయిదా వేస్తారు. రాబడి తగ్గినా అవసరాలు తీరతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సోదరుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు రద్దు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలులో పెడతారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు పురస్కారాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ చూపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశం. కళాకారులకు ఒక అవకాశం ఉత్సాహాన్నిస్తుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు,నిరుద్యోగులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొంత వరకూ అనుకూలం. పసుపు, నలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురుకావచ్చు. గులాబీ, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. -
వార ఫలాలు(29-01-2017 to 4-02-2017)
29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ఒత్తిడులు తొలగి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి, పెద్దల ప్రశంసలు అందుకుంటారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు జరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందవచ్చు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం అవుతాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లేదా జీతాల పెంపు ఉండవచ్చు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ప్రతికూలంగా ఉన్న కోర్టు కేసులు సైతం అనుకూల దిశగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం ఉంది. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారుల కృషి ఫలిస్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషులు సహాయపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అనుకున్న కార్యాలు కొంత మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం అవసరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలకు మంచి లాభాలు దక్కుతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడటం వల్ల ఉద్యోగులకు నూతనోత్సాహం కలుగుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా ఇతరులనుంచి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీరు కొంత మందకొడిగా, బద్ధకంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, సరదాగా గడుపుదామా అని ఎదురు చూస్తుంటారు. ప్రేమ సఫలమవుతుంది. ఇష్టమైన వారితో, మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రద్ధ తీసుకోవలసి వస్తుంది. అంతా సుఖాంతమై, విందు వినోదాలలో మునిగి తేలుతారు. కలిసొచ్చే రంగు: వెండి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆస్తుల కొనుగోలు కోసం మదుపు చేస్తారు. మీలో ఈవారమంతా ఆశ్చర్యానందాలు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. కెరీర్‌పరంగా రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. దూరప్రయాణం ఉండొచ్చు. చిక్కు సమస్యలలో ఉన్న మిత్రులను మీ తెలివితేటలతో బయట పడేసి, వారి అభిమానాన్ని చూరగొంటారు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలలో మునిగి తేలుతారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: గచ్చకాయ/బూడిదరంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి రావడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఆలోచనలలో అస్థిరత నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమే అయినా, ముఖ్య నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కలిసొచ్చే రంగు: రుద్రాక్ష వన్నె కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: అరిటాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థికంగా చాలా బాగుంటుంది. షాపింగ్ చేస్తారు. నూత్న వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టును పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. అంతమాత్రాన నిశ్చింత పనికిరాదు. జరగవలసిన కార్యాలమీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య పొరపచ్ఛాలు ఏర్పడతాయి. కలిసొచ్చే రంగు: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. బహుమతులు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని చిక్కుముళ్లు వాటంతట అవే విడిపోయి, గొప్ప స్వాంతన కలుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. కలిసొచ్చేరంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆదాయానికి మించి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లోనూ, వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడి, మీకు కొన్ని విషయాలలో భరోసా ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో సామరస్యంతో మెలగడం అవసరం. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాల్యజ్ఞాపకాలలో మునిగి తేలుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. అనవసర వివాదాలు. వాదోపవాదాలు జరగకుండా జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కొత్త శక్తి పుంజుకుంటారు. విదేశాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. ఆసక్తికరమైన వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు టారో ఇన్సియా అనలిస్ట్ -
అంతా విజయమే!
2017 సంవత్సర ఫలితాలు మేషం (మార్చి 21– ఏప్రిల్ 20) రాశులలో వీరు మొదటి రాశికి చెందిన వారు కనుక జీవితంలో కూడా ఏదైనా ట్రెండ్ సృష్టించడంలో మొదటి వరుసలో ఉంటారు. 2017 సంవత్సరం వీరికి కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంవత్సరపు మొదటి భాగం చాలా బాగుంటుంది. మీకు సహకరించని అంశాలను ప్రకృతి తన సహజపద్ధతిలో తొలగిస్తుంది. కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు తమ లోపలి విషయాలు ఒకరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాము అనుకున్నది చేస్తారు. వృత్తి పరంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక అందమైన ప్రదేశంలో సొంత ఇల్లు కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పుట్టినరోజు, ఇతర వేడుకలకు వృత్తి నుంచి విరామం తీసుకొని వినోదం పొందండి. ఈ విరామంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తియుక్తులను కూడగట్టుకోండి. మిమ్మల్ని నొప్పించే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ప్రేమలో సరైన భాగస్వామిని ఎంచుకోండి. ఈ సంవత్సరం మీరు కోరుకునే అనుబంధాలు దక్కుతాయి. కలిసొచ్చేవి : రంగు: ఆరంజ్; వారం: ఆదివారం; అంకె: 1 వృషభం (ఏప్రిల్ 21–మే 20) వృషభరాశికి వాడి అయిన కొమ్ములతో ఉండే వృషభం చిహ్నం. ఇది స్థిరత్వానికీ, దృష్టికోణానికి సంకేతం. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం మందకొడిగా నడిచే అవకాశం ఉంది. ఆశలు, ఆశయాలు భారీగా ఉన్నా ఆ సంగతి బయటకు చెప్పక మనసులోనే పెట్టుకుని ఉంటారు. అసలు గత సంవత్సరం కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నామా అని ఒకసారి పరికించుకోండి. కొంచెం ఓపిక అవసరం. టీమ్‌తో పాటు కలిసి పని చేయడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామిక ధోరణి ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు, వివాహానికి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. మిమ్మల్ని మీరు వెతుక్కోవడంలో మరింత లోతులకు వెళతారు.మీ పనే మీకు దైవం. మీ పనిలో మిమ్మల్ని కొట్టే చెయ్యి ఉండదు. ఆర్థిక పరంగా మంచి లబ్ధి కనిపిస్తోంది. పెట్టుబడులకు ఇది కలిసివచ్చే కాలం. ఏవైనా కోర్సులు చదవాలనుకునేవారికి కూడా ఈ కాలం కలిసి వస్తుంది. కలిసొచ్చేవి : రంగు: పసుపు; వారం: మంగళవారం; అంకె: 2 మిథునం (మే 21–జూన్ 21) ఈ 2017వ సంవత్సరం మీకు కలిసొస్తుంది. గతంలో చేసిన కృషికి తగ్గ ఫలితం ఈ కొత్త ఏడాదిలో లభిస్తుంది. అందుకే ఈ 2017లో వచ్చే కొత్త అవకాశాలను అందుకోవడం కోసం మీ మనసును తెరచి ఉంచుకోండి. భావోద్వేగపరమైన పరిణతి వస్తుంది. అయితే, ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద మీ మానసిక భావోద్వేగాలు పెచ్చుమీరి, పరిస్థితులపై వాటిదే పైచేయి కాకుండా చూసుకోండి. కొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈ కొత్త ఏడాది భలే మంచి టైమ్. ఎప్పటిలానే, ఆరోగ్యం మీదే మీ చూపు అంతా! చాలా మంది ఆరోగ్యబాటలో పయనించడానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ 2017లో మీకు లాటరీలు తగిలే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విజయాలు అందుకుంటారు. మీ అదృష్టం మరింత పెరగాలంటే, దక్షిణపు దిక్కున ఫినిక్స్ బొమ్మను ఉంచండి. దీని వల్ల బోలెడన్ని అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటన్నిటినీ మీరు బంగారంలా వాడుకోవచ్చు. కలిసొచ్చేవి: రంగు: బంగారం; వారం: ఆదివారం; అంకె: 9 కర్కాటకం (జూన్22–జూలై 23) ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం. విజ్ఞానం పెంచుకోవడానికీ, నైపుణ్యాలను అలవరచుకోవడానికీ ఇదే తగిన సమయం. రానున్న సంవత్సరాల్లో బలంగా నిలదొక్కు కొని నిలబడడానికి ముందుగానే లక్ష్యం నిర్దేశించుకొని, ముందడుగు వేయడం అవసరం. కొత్త ఏడాదిలో మీకు వేసవి కన్నా, శీతకాలం చాలా బాగా కలిసొస్తుంది. ఈసారి మీరు మరీ కొట్టొచ్చినట్లుండే ముదురు రంగు దుస్తులు వాడకండి. మీకు ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా జీవితమే లేదని భావిస్తారు. అందుకే, ఆ ప్రేమాన్వేషణలో ఉంటూ, ఎవరితోనైనా ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో అన్ని ప్రేమలూ ఫలించవు కాబట్టి, కాస్తంత గుండె దిటవు చేసుకొని ముందుకు అడుగేయండి. మీ మనసుకు నచ్చేవాళ్ళను వెతుక్కోవడానికి ఇది సరైన సమయం కాకపోతేనేం, ఈ ఏడాది కాకపోతేనేం వచ్చే ఏడాదైనా దొరుకుతారని గుర్తించండి. ఈ ఏడాది మీ పుట్టినరోజు తరువాత మీ ప్రేమ జీవితం మరింత మెరుగవుతుందని గ్రహించండి. కలిసొచ్చేవి : అదృష్ట సంఖ్య: 6; రంగు: సీ గ్రీన్; వారం: గురువారం సింహం (జూలై 24–ఆగస్టు 23) సగర్వంగా, కొండొకచో అహంకారంగా అనిపిస్తున్నా, నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగడం సింహ రాశి వారి లక్షణం. సౌహార్దంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో, మంచి ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ప్రయాణాలు, లాటరీలు – అన్నీ మీకు ఈసారి కలిసొస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఇతరులను ఎవరినీ మీ మార్గంలోకి అడ్డుగా రానివ్వకండి. ఉద్యోగం, పని విషయంలో ఈ ఏడాది మీకు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం ఉంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో మీరు పట్టిందల్లా బంగారమే. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రేమ విషయంలో మీ మనసులోని మాటను నిజాయతీగా చెప్పేయడం మంచిది. సింహరాశి వారికి తగిన వ్యక్తులు దొరుకుతారు. ఇంట్లో దక్షిణ మూలలో రెండు ఎర్ర కొవ్వత్తులు వెలిగించండి. దాంతో, మీకు మరింత ప్రేమ, ప్రణయం లభిస్తాయి. కలిసొచ్చేవి: అదృష్ట సంఖ్య: 4; రంగు: అగ్ని జ్వాల లాంటి కమలాపండు రంగు; వారం: ఆదివారం కన్య (ఆగస్టు24–సెప్టెంబర్ 23) ఈ రాశి వారికి ఈ ప్రపంచం ఒక్కటే నాకు చాలదు అనే ధోరణి ఉంటుంది కనుక వీరి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. వీళ్లు జీవితం నుంచి ముక్తసరిగా కాకుండా ఎక్కువ ఆశించడం దానికి కారణం. ఇది మీరు మీ జీవిత గమనాన్ని విశ్వసించాల్సిన సమయం. మీకు ఆ సంగతి తెలుసు. అందుకు సిద్ధపడండి. కొంచెం అనిశ్చితి మొదట చోటు చేసుకున్నా మమ్మిల్ని మీరు స్థిరపరుచుకొని ముందుకు సాగండి. అంతేతప్ప మిమ్మల్ని మీరు వెనక్కు లాక్కోండి. సమయం వచ్చేసింది. ధైర్యంగా అడుగువేస్తే మీరు ఏమేమి కోరుకున్నారో అవన్నీ పొందుతారు. న్యాయపరమైన లావాదేవీలు పరిష్కృతమవుతాయి. జూన్ తర్వాత అంతా బాగుంటుంది. కొన్ని ఊహించని పరిణామాలు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా మారుతాయి. మీ పాత స్నేహితులు, పాత అనుబంధాలు మళ్లీ తారసపడి మీ గతంలోని హుషారును, కొంత కోలాహాలాన్ని తీసుకొని వస్తాయి. భౌతిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల మధ్య సమన్వయం పాటించండి. కలిసొచ్చేవి: రంగు: లేలేత గులాబీ (టెర్రకోట పింక్); సంఖ్య: 3; వారం: బుధవారం తుల (సెప్టెంబర్ 24– అక్టోబర్ 23) మీ స్నేహం, మీ సమ్మోహన శక్తి, మీ ఆతిథ్యం... కొత్త సంవత్సరంలో అందర్నీ మీ చుట్టూ తిప్పుకుంటాయి. 2017 మీ జీవితానికి మంచి మలుపు. రోజులు సాఫీగా, సమతులంగా గడుస్తాయి. అనుకున్నదాన్ని సాధించడానికి మీకున్న పరిమితులను దాటుకుని మరీ ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే దుస్తులపై దృష్టి పెడతారు. మనసులను వశం చేసుకుంటారు. అభిమాన్ని చూరగొంటారు. కొత్త వ్యక్తులకు మీరు ఆత్మీయులైపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జీర్ణకోశంపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇతర విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దూకుడు తగ్గించాలి. ఆలోచనల వేగాన్ని నియంత్రించుకోవాలి. ప్రారంభ మాసాలు కొంచెం అయోమయంగా ఉంటాయి. అలాగని ఆందోళన చెందనవసరం లేదు. 5వ అంకెకు దూరంగా ఉండండి. మే నెలలో డబ్బుకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో ప్రయాణాలు. కలిసొచ్చేవి : రంగు : లేత నీలం (పాస్టల్ బ్లూ); వారం : బుధవారం; అంకె : 3 వృశ్చికం (అక్టోబర్ 24–నవంబర్ 22) సమర్థత మీ రహస్య ఆయుధం. దెబ్బ తగిలినా కోలుకోగల సామర్థ్యం మీ సొంతం. కొత్త అవకాశాల కోసం మీరు ఎంతోకాలంగా వేచిచూస్తున్నారు. కానీ ఎన్నో అవకాశాలు ఈ ఏడాది మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఒత్తిళ్లు ఎదుర్కోవడం అన్నది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మీ వెన్నంటే ఉన్నా... ఆ తర్వాతి విజయాలు ఆ ఒత్తిడుల తాకిడికి ఉపశమనంలా పనిచేస్తాయి. కొన్ని విజయాలు మిమ్మల్ని వరించడానికి ఈ ఏడాది సంసిద్ధంగా ఉన్నాయి. ఒక మార్మికమైన, దివ్యమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు సంసిద్ధం చేసుకునే కొత్త కొత్త వ్యూహాల కారణంగా భవిష్యత్తులో మీకు భద్రత సమకూరుతుంది. పోరాటపటిమను ప్రదర్శిస్తుంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మరింతగా ఇష్టపడటానికి మీకు ఉన్న ఈ గుణమే దోహదపడుతుంది. ఫిబ్రవరి, ఆగస్టు, అక్టోబర్ నెలలు మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేస్తాయి. జనవరి, డిసెంబరు నెలల్లో దూరప్రయాణాలకు అవకాశం కలగవచ్చు. కలిసొచ్చేవి : రంగు : ఇటుక ఎరుపు (బ్రిక్ రెడ్); వారం : మంగళవారం; నంబరు : 2 ధనుస్సు (నవంబర్23–డిసెంబర్ 21) ఉన్న చోటే కుదురుగా ఉండిపోడానికి ఇష్ట పడరు. స్వేచ్ఛగా విహరించేందుకు నిత్యం మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తారు. తత్వవేత్తలు, చింతనాపరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. చర్చల్లో పాల్గొంటారు. వాదోపవాదాల కారణంగా మీ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు. కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తారు. మీరు కోరుకున్నది మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్టోబరులో మనసైన వారు చేరువవుతారు. జూన్ తర్వాత మాత్రమే చేతిలో కాస్త డబ్బుల ఆడతాయి. వ్యక్తిగత ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగ రీత్యా కూడా మీరు విదేశీయానం చేస్తారు. మీది వ్యాపారం అయితే కొత్త వ్యాపారం, మీరు ఉద్యోగి అయితే కొత్త ఉద్యోగం జత కలుస్తుంది. అవసరంలో ఉన్నవారికి అడక్కుండానే సహాయం చేస్తారు. జూలై నుంచి మీ జీవితం అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. కొండాకోనల్లో, పచ్చని ప్రకృతి నీడలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. కలిసొచ్చేవి : రంగు : లేలేత ఊదా (రాయల్ పర్పుల్); వారం : గురువారం; అంకె : 9 మకరం (డిసెంబర్ 22–జనవరి 20) ఆధిక్య భావన, తీవ్ర ఆకాంక్ష, పట్టువిడుపులేని స్వభావం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. అంచెలన్నీ దాటి చకచకా అందలం చేరుకుంటారు. పై అధికారులకు మీ ముక్కుసూటితనం కొంత అసహనం కలిగించినప్పటికీ మీరు వారికి ప్రియమైన వ్యక్తి అవుతారు. ఇది మీకు ‘సక్సెస్ ఇయర్’. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. వచ్చిన అనేక మెరుగైన అవకాశాల్లో నుంచి మరింత మెరుగైన దాన్ని ఎంచుకోవడం మీకు కష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మార్పును అంగీకరించని మీ తత్వాన్ని 2017 కొద్దిగానైనా సడలిస్తుంది. అదీ మంచికే. ప్రేమకు మీరు తల ఒగ్గుతారు. ప్రేమ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అంటే రాజీ పడతారు. ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇస్తారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు మీకు అనుకూలమైనవి. జూలై నుంచి ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుంది. కలిసొచ్చేవి : రంగు : ముదురాకు పచ్చ (ఫారెస్ట్ గ్రీన్); వారం : శనివారం; సంఖ్య : 12 కుంభం (జనవరి 21–ఫిబ్రవరి 19) ఈ ఏడాది ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. ప్రేమలో విజయాలు, మీ సంతోషం కొనసాగుతాయి. గతంలోని చేదు అనుభవాలు తుడిచిపెట్టుకుపోతాయి. మీ దిగులు, బెంగ వంటి వాటిని ఎలా అధిగమించాలా అని తర్కబద్ధంగా ఆలోచిస్తారు. మీ జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించి, మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఆమె కీలకమైన భూమిక పోషిస్తుంది. ఒకవేళ మీరు మహిళ అయి ఉంటే మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. ఈ ఏడాది మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబం నుంచి అమితమైన ఆనందం లభ్యమవుతుంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. సంతోషాలు, ఆనందాలు అందరితో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా ఏడాది మీకు అత్యుత్తమమైంది. అనంత విశ్వం నుంచి మీకు సమకూరే సంతోషాలతో ఈ ఏడాది మీకు ఎంతగా కలిసి వస్తుందంటే... ఆనందాల సింహాసనంపై కూర్చున్న రారాజులాగా మీరు ఫీలవుతారు. గుడిగంటల వంటి సంతోషాల ప్రకంపనలు మిమ్మల్ని ఎప్పుడూ సందడిగా ఉండేలా చేస్తాయి.కలిసొచ్చేవి : రంగు : నీలిమందు రంగు; వారం : శని; అంకె : 9 మీనం (ఫిబ్రవరి 20–మార్చి 20) మీరు ఒకింత సున్నిత మనస్కులు. మీ మనసుకు తగ్గట్లుగానే ఒక అద్భుతమైన కలల ప్రపంచం మీ ముందు ఆవిష్కృతమైనట్లుగా ఈ ఏడాది అంతా అనిపిస్తుంటుంది. ఈ ఏడాది ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యలు ముందు ఉన్నా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. కొన్ని పొరబాట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ గత అనుభవాల కారణంగా మీరు వాటిని దొర్లనివ్వకుండా జాగ్రత్తపడతారు. మీ బాంధవ్యాల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా మీ ఆలోచనలను పంచుకోడానికి సిద్ధంగా ఉండండి. దాంతో మీ ఆలోచనలను వారూ సానుకూలంగా తీసుకుంటారు. దాంతో ఎన్నో ఇక్కట్లు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మీ ఆదాయానికీ, ఖర్చులకూ సమన్వయం ఉంది. అయితే కొత్త ఆస్తులు సమకూర్చుకోడానికి తగిన అవకాశాలను సైతం ఈ కొత్త ఏడాది మీ ముందుకు తీసుకువస్తుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు మరింత సానుకూలంగా ఉంటుంది. కలిసొచ్చేవి : రంగు : నీలిపచ్చ (సీ గ్రీన్); వారం : గురువారం; నంబరు : 4 టారో అనలిస్ట్, టారో ఇన్సియా -
వారఫలాలు (25-12-2016 to 31-12-2016)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి. కొన్ని విషయాలలో కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. ఉద్యోగయోగం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు అనుకూలం. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులకు సన్మానయోగం. లేత ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. కొంత నిరుత్సాహంగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. రాబడికి లోటు ఉండదు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సమస్య నేర్పుగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. అయినవారే సమస్యలు సృష్టించే పరిస్థితులు ఉండవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులో ఆనందంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నీలం, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృపిక్తరం. కొన్ని రుణాలు తీరతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులు,బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు శ్రమకు ఫలితం పొందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. నలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుందరకాండ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటిలో శుభకార్యాలు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వారం ప్రారంభంలో స్వల్ప అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చే స్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (25 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్, 2016 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆస్వాదిస్తారు. మనసు చెప్పినట్లు నడచుకోండి. కలిసి వచ్చే రంగు: మబ్బురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ సహ^è రుల వల్ల కాదు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి. ప్రకృతి ఉత్పాదనల వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఒడిలో మీకు మంచి స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడంలో బిజీగా ఉంటారు. ఆఫీసులో పనులు చురుగ్గా జరుగుతాయి. ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోతే వినమని బలవంతపెట్టకండి. గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటాబయటా కూడా మంచి మార్పులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. శాలరీ పెరగవచ్చు. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో బిజీగా ఉంటారు. కలిసి వచ్చే రంగు: లేత అరిటాకు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యం, ప్రజాసంబంధాల సాయంతో మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రేమలో విజయాన్ని అందుకుంటారు. మీరు అనుకున్న పనులను చేయడానికి ఇది తగిన సమయం. పనిలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ వ్యాపార భాగస్వాములు మీపట్ల పూర్తి సానుకూల ధోరణిలో ఉంటారు. పనిలో ఆందోళనలను, అవరోధాలను అధిగమిస్తారు. మీ ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. మీ పనిలో ఉత్పాదకతను సాధించేందుకు ఇది తగిన సమయం. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కలిసి వచ్చే రంగు: బూడిద రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కొత్తదుస్తులు కొనుగోలు చేస్తారు. కలిసి వచ్చే రంగు: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. ఇతరుల ప్రేమను గెలుచుకుంటారు. మీ ఆధ్యాత్మికత, భక్తిభావం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతూ వున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే వాటి విషయంలో. మీకు ఇష్టమైన వారితోనూ, మిమ్మల్ని ఇష్టపడేవారితోనూ ఎక్కువ సమయం గడపండి. కలిసి వచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తిపరంగా విజయం సాధించాలంటే దానికి అనుగుణంగా నడుచుకుంటూ, కష్టపడి పని చేస్తేనే సాధ్యమని గ్రహించండి. ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. పురాతన నగలు, వస్తువులు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు. అందరితో కలసి మెలసి ఉండటం ద్వారా సానుకూల భావనలను నింపుకోండి. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ టారో ఇన్సియా అనలిస్ట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement