-
రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహచరుడు, మిజోరాం రాష్ట్ర జట్టు మాజీ కెప్టెన్ తరువార్ కోహ్లి ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 35 ఏళ్ల తరువార్ ప్రొఫెషనల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. పంజాబ్‌లోని జలందర్‌లో పుట్టి పెరిగిన తరువార్.. ఆ రాష్ట్రం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో మిజోరాంకు వలస వెళ్లాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన తరువార్.. 97 ఇన్నింగ్స్‌ల్లో 53.80 సగటున 4573 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 18 అర్దసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తరువార్ అత్యధిక స్కోర్ 307 నాటౌట్‌గా ఉంది. తరువార్ ఖాతాలో రెండు ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2008 అండర్-19 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన తరువార్.. ఆ టోర్నీలో వరుసగా మూడు అర్దసెంచరీలు సాధించి, మూడో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ వేసే తరువార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 74, లిస్ట్ ఏ క్రికెట్లో 41, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ, టీ20ల్లోనూ (బ్యాటింగ్) తరువార్కు మెరుగైన రికార్డే ఉంది. లిస్ట్-ఏలో తరువార్ 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1913 పరుగులు (72 మ్యాచ్‌ల్లో) చేయగా.. టీ20ల్లో 7 అర్దసెంచరీల సాయంతో 1057 పరుగులు (57 మ్యాచ్‌ల్లో) చేశాడు. దేశవాలీ క్రికెట్‌తో పాటు తరువార్ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2008, 2009 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువార్.. కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2008 అండర్-19 వరల్డ్‌కప్‌లో విరాట్, తరువార్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా యంగ్ ఇండియా టీమ్‌కు ప్రాతినిథ్యం వహించారు. -
డబుల్ సెంచరీతో విరుచుకుపడిన కోహ్లి
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (4/2) మాయ చేసిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. కోహ్లి, రాల్టే (4/21), నవీన్ (1/22), అవినాశ్ యాదవ్ (1/17) ధాటికి 304 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్ కాగా.. కుమార్ న్యోంపు (24), కమ్షా (17), నబమ్ అబొ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరం.. తరువార్ కోహ్లి, గోస్వామి (50) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. మిజోరం ఇన్నింగ్స్‌లో కోహ్లి, గోస్వామి, ఆండర్సన్ (28) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. అరుణాచల్ బౌలర్లలో నబమ్ అబొ 4, యబ్ నియా 3, అఖిలేశ్ సహాని 2, చేతన్ ఆనంద్ ఓ వికెట్ పడగొట్టారు. మిజోరం తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 275 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. టెకీ నెరీ (27) ఔట్ కాగా.. కుమార్ న్యోంపు (31), కెప్టెన్ సూరజ్ తయమ్ (18) క్రీజ్‌లో ఉన్నారు. టెకీ నెరీ వికెట్ అవినాశ్ యాదవ్‌కు దక్కింది. ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్ ఇంకా 198 పరుగుల వెనకంజలో ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇద్దరూ మంచి మిత్రులు, 2008లో భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలీదు. నాటి ప్రపంచకప్‌లో విరాట్‌తో (235) సమానంగా పరుగులు చేసిన తరువార్ (218, 3 వరుస హాఫ్ సెంచరీలు).. ఆతర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. మరోవైపు విరాట్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోగా.. మీడియం ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన తరువార్.. సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున సరైన అవకాశాలు రాక మిజోరంకు వలస వెళ్లి కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా, టాలెంట్ పరంగా చూస్తే విరాట్‌కు తరువార్ ఏమాత్రం తీసిపోడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement