-
మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
న్యూఢిల్లీ: ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్సైట్లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్టీటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది. -
‘నిషా’చరుడి రికార్డు
బీఏసీ ఏకంగా 550 ఎంజీ 12 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు ఈ స్థాయిలో శిక్ష పడటం ఇదే తొలిసారి సాక్షి, సిటీబ్యూరో : పీకల దాకా మందు కొట్టి... లారీ పట్టి... నివ్వెరపరిచే రికార్డు సాధించాడో ‘నిషా’చరుడు. మహారాష్ట్రలోని ఉనార్గాకు చెందిన బాలాజి అత్యంత ప్రమాదకర మొత్తంలో మద్యం సేవించి అక్కడికి చెందిన లారీనే నడుపుతూ వచ్చి బహదూర్‌పుర ప్రాంతంలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. భారత మోటారు వాహనాల చట్టం-1988 ప్రకారం ప్రతి 100 మిల్లీ లీటర్ల (ఎంఎల్) రక్తంలో 30 మిల్లీ గ్రాములకు (ఎంజీ) మించి ఆల్కహాల్ ఉంటే అది నేరం. దీన్నే సాంకేతిక పరిభాషలో 30/100 బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అని అంటారు. అయితే మహారాష్ట్ర నుంచి లారీ తీసుకుని వచ్చిన ఇతగాడి బీఏసీ ఏకంగా 550 ఎంజీ/100 ఎంఎల్ రావడంతో తనిఖీ చేసిన బహదూర్‌పుర ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిర్ఘాంత పోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కౌన్సెలింగ్ అనంతరం బుధవారం ఎర్రమంజిల్‌లోని మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి బి.చెంగల్రాయనాయుడు ఇతనికి 12 రోజుల జైలు శిక్ష విధించారు. 2011 నవంబర్ 4 నుంచి డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో దాదాపు 4 వేల మంది జైలుకు వెళ్లినప్పటికీ 12 రోజుల శిక్ష పడటం మాత్రం ఇదే తొలిసారి. మరోపక్క ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహ నాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వాహనచోదకుల్లో బాలాజీతో సహా 31 మందికి చెంగల్రాయనాయుడు జైలు శిక్ష వేశారు. వీరిలో 22 మందికి మూడు రోజులు, ఆరుగురికి ఐదు రోజులు, ఇద్దరికి ఏడు రోజులు జైలుశిక్ష విధించారు. అలాగే నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివశంకర్ ప్రసాద్ 10 మందికి ఒకరోజు శిక్ష వేశారని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) జితేందర్ తెలిపారు. వీరితో పాటు మిగిలిన వారికి సైతం రూ.2,600 వరకు జరిమానా విధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్యం తాగి వాహనాలు నడుపుతూ మొత్తం 1722 మంది పట్టుబడగా... వీరిలో 315 మందికి జైలుశిక్ష పడిందని ఆయన వివరించారు.
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
కిక్కిరిసిన కర్నూల్
డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
"కూటమి కట్టినా ఓటమి తప్పదు"
చెలరేగిన కోహ్లి, పటిదార్ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement