-
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్‌లోని తొలి సింగిల్స్‌లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్‌పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్‌లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్‌గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్‌గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్...!
జెనీవా: జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఎనిమిదో ర్యాంకర్ ఫెడరర్‌కు 75వ ర్యాంకర్ పాబ్లో అందుహర్ (స్పెయిన్) షాక్ ఇచ్చాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అందుహర్ 6–4, 4–6, 6–4తో ఫెడరర్‌ను ఓడించాడు. చివరి సెట్లో అందుహర్ 2–4తో వెనుకబడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలుపొందడం విశేషం. చదవండి: Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు -
Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు
పార్మా (ఇటలీ): డబ్ల్యూటీఏ ఎమిలియా రొమానో చాలెంజర్ టోర్నీలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సెరెనా 6–3, 6–2తో క్వాలిఫయర్ లీసా పిగాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. మూడు నెలల తర్వాత సెరెనాకు దక్కిన తొలి విజయం ఇదే కావడం విశేషం. ఇక చివరి సారిగా సెరెనా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో గెలుపొందింది. అయితే ఈ చాలెంజర్ టోర్నీలో ఆఖరి నిమిషంలో వైల్డ్ కార్డ్‌గా బరిలోకి దిగిన సెరెనా బలమైన ఏస్‌లతో పాటు ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ మ్యాచ్‌ను 68 నిమిషాల్లో ముగించింది. చదవండి: Tejaswin Shankar: అద్భుత ఫీట్.. మరో స్వర్ణం సొంతం -
విష్ణు-బాలాజీ జోడీదే టైటిల్
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ (ఎఫ్-10) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో నగరానికి చెందిన విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. షామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు-శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడి 6-4, 6-2 స్కోరుతో ఎస్కాఫీర్ ఆంటోన్-గ్రెనీర్ హ్యుగో (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలోనూ విష్ణువర్ధన్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విష్ణు 7-6(7), 5-7, 6-4 తేడాతో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్‌ను ఓడిం చాడు. మరో వైపు ఫ్రాన్స్ ప్లేయర్ ఎస్కాఫీర్ ఆంటోన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అతను 6-4, 6-2, 6-3తో భారత ఆటగాడు బాలాజీ శ్రీరామ్‌పై గెలుపొందాడు. -
శ్రేయస్, జైవంత్ ముందంజ
ఏస్టర్ మైండ్స్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఏస్టర్ మైండ్స్ మెంస్టేట్ ర్యాంకింగ్ జూనియర్ టెన్నిస్ టోర్నట్లో శ్రేయస్ శంకర్, జైవంత్ గణేష్ శుభారంభం చేశారు. బోయిన్‌పల్లిలోని కృష్ణస్వామి టెన్నిస్ అకాడమీలో గురువారం తొలి రౌండ్ పోటీలు జరిగాయి. అండర్-10 బాలుర సింగిల్స్‌లో శ్రేయస్ 6-0తో విభువంత్ తేజపై, జైవంత్ 6-2తో శౌర్యపై గెలుపొందారు. ఇతర పోటీల్లో శ్రీశరణ్ 6-0తో సాయి ఆకాశ్‌పై, అమోఘ్ రెడ్డి 6-1తో కృష్ణ ఆదిత్యపై, నిలయ్ త్రివేది 6-0తో కబీర్‌పై, అభిషేక్ 6-4తో లిఖిత్ రెడ్డిపై, ఆర్య జాదవ్ 6-0తో నెహన్పై, వర్షిత్ 6-3తో హేమంత్పై, ప్రణీత్ 7-6 (7/2)తో కావ్యాన్ష్ శర్మపై విజయం సాధించారు. అండర్-12 బాలుర సింగిల్స్‌లో జైవంత్ గణేష్ 7-4తో ఆదిత్యపై, శ్రీరామ్ 7-5తో నిఖిల్ భట్‌పై, హేమంత్ 7-3తో నిలయ్ త్రివేదిపై, హితేశ్ 7-3తో ఆర్య గోపాల్‌పై, సాత్విక్ రాజు 7-4తో క్రిష్‌పై, శ్రీశరణ్ 7-2తో అనురాగ్‌పై, ఫజల్ 7-0తో సాయికిరణ్‌పై, సాయి నివేద్ 7-0తో కృష్ణవంశీపై, ఆదిత్య 7-4తో రుత్విక్‌పై గెలుపొందారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement