-
‘ర్యాంబో’గా వస్తున్న ‘ఉడుంబు’
Rambo Movie First Look: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే.. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి "ర్యాంబో" అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ "ర్యాంబో" చిత్రానికి పని చేస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని "ర్యాంబో" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. -
ఆ నిర్మాతకు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్..
Udumbu Telugu Remake Rights Went To Producer Gangapatnam Sridhar: మలయాళంలో మంచి హిట్ సాధించిన చిత్రం "ఉడుంబు". ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. నిర్మాత శ్రీధర్ ఇంతకుముందు అంజలి టైటిల్ పాత్రలో "చిత్రాంగద", సుమంత్ తో 'ఇదం జగత్" ఛార్మితో మంత్ర-మంగళ" వంటి పలు చిత్రాలతోపాటు.. సుకుమార్ "కుమారి 21ఎఫ్" చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయం సాధించారు. తాజాగా రమ్యకృష్ణతో కన్నడలో "శివగామి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఉడుంబు" చిత్రాన్ని మలయాళంలో కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన "ఉడుంబు" మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. పలు అగ్రనిర్మాణ సంస్థలు "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్ కోసం పోటీపడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు తమకు దక్కడంపై నిర్మాత గంగపట్నం శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువ ప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ క్రేజీ చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ "ఉడుంబు" మూవీని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా.. తమిళలంలో ఓ సీనియర్ హీరోయిన్ తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. -
‘ఉడుంబు’ తెలుగు రీమేక్ రైట్స్‌పై నిర్మాత క్లారిటీ
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మలయాళంలో అనూహ్య విజయం సాధించిన చిత్రం ‘ఉడుంబు’. అక్కడ ఈ చిత్రం పలు రికార్డులను సృష్టించింది. దీంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు. పలు అగ్రనిర్మాణ సంస్థలు ‘ఉడుంబు’ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. తెలుగు రీమేక్ రైట్స్ ఓ నిర్మాణ సంస్థ దక్కించుకుందని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై తాజాగా ఉడుంబు చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం స్పందించారు. తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘ఉడుంబు’ చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. భారీ తారాగణం లేకున్నా మలయాళంలో భారీ విజయం నమోదు చేసిన ‘ఉడుంబు’ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో జాన్ అబ్రహాం రీమేక్ చేస్తుండగా... తమిళంలో ఓ సీనియర్ హీరోయిన్ తన తనయుడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రీమేక్ చేస్తున్నారు. మరి తెలుగు రీమేక్ హక్కులను ఎవరు సొంతం కానున్నాయో వేచి చూడాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement