-
స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్‌తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. రాబోయే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..! టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. అలర్ట్‌గా ఉండడమే..! సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెర్షన్స్‌తో సమస్య..! ఫోర్భ్స్ ప్రకారం...గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. గూగుల్ ప్రయత్నాలు..! ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్సైట్లను సందర్శించేటప్పడు వెర్షన్ 100 స్థానంలో రెండంకెల వెర్షన్ పొందేలా గూగుల్ ప్రయోగాలు చేస్తోంది. చదవండి: అమెరికా టెక్ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..! -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో అధిక తీవ్రతతో కూడిన సమస్య ఉన్నట్లు గుర్తించింది. CERT-In ప్రకారం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది.గూగుల్ క్రోమ్ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్లో మాల్వేర్ను ఇంజెక్ట్ చేసేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్-ఇన్ తెలిపింది. గూగుల్..నివారణ చర్యలు..! గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్‌లో సమస్యలు ఉన్నట్లు గూగుల్ కూడా గుర్తించింది. అందుకోసం నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్ క్రోమ్ అప్డేట్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది.గూగుల్ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్, మ్యాక్, లైనెక్స్ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్ చేసింది. మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్డేట్ చేయండి • Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి. • కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి •హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవండి: జియో కమాల్: ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్.. కస్టమర్లకు పండగే! -
బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 అప్డేట్ వెర్షన్
ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డోమినార్ నుంచి మరో కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన ‘‘బజాజ్ డొమినార్ 400’’ మోడల్ అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టూరింగ్ యాక్ససరీసులతో పాటు టూరింగ్ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలతో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణన్ తెలిపారు. -
WhatsApp: వాట్సాప్ మెసేజ్‌లకు ‘రియాక్ట్’ అవుతారా?
వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే.. ఎమోజీలు, కొంచెం కష్టపడి జిఫ్ ఫైల్స్‌తో రియాక్షన్ ఇస్తుంటారు చాలామంది. 2017 నుంచి స్టిక్కర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వాట్సాప్ మెసేజ్‌లకు డిఫాల్ట్‌గా రియాక్షన్లు ఇచ్చే ఆఫ్షన్ ఎలా ఉంటుంది? యస్.. త్వరలోనే ఆ ఫీచర్ రాబోతోంది. మెసేజింగ్-కాలింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఇందులో భాగంగా ముందు అప్డేట్గా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ స్క్రీన్ షాట్స్ కొన్నింటిని వాట్సాప్ సన్నిహిత సంస్థ వాబేటాఇన్ఫో షేర్ చేసింది. ఇక ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఇదివరకే మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని వాట్సాప్‌కు సైతం తేబోతున్నారు. ఇది వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ రియాక్షన్ ఫీచర్ తరహాలో(ఆఫ్షన్స్) ఉండొచ్చని వాబేటాఇన్ఫో అంచనా వేస్తోంది. అతిత్వరలో ఈ ఫీచర్ రానుందని, యాప్ అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు వినియోగించుకోవచ్చని వాబేటాఇన్ఫో చెబుతోంది. చదవండి: వాక్సిన్ కోసం వాట్సాప్.. ఇలా ఉపయోగించుకోండి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement