-
ఇది లైబ్రరీలాంటి సినిమా
‘‘కొత్తవారందరూ కలిసి చేసిన ఈ సినిమాను సపోర్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ బాగుంటే ఏ కొత్త సినిమాకైనా నా వంతు సపోర్ట్ చేస్తా’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విశ్వక్సేన్, సుప్రజ , శ్వేత హీరో హీరోయిన్లుగా యాకుబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెళ్లిపోమాకే’. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు సతీష్ వేగేశ్న విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మన పక్కింటి అమ్మాయిలు, అబ్బాయిలు, సహోద్యోగు లు ఉన్నట్టే ఈ కథలోని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రొత్సహిస్తే మంచి కథనాలతో మరిన్ని సినిమాలు వస్తాయి. రాబోయే సినిమాలకు ఈ సినిమా లైబ్రరీలా ఉంటుంది’’అన్నారు. ‘‘దిల్’ రాజుకు కథ నచ్చడంతో మూడేళ్ల కష్టాన్ని ఇట్టే మర్చిపోయాం’’ అని యాకూబ్ అలీ అన్నారు. ‘‘ఏఆర్ రెహమాన్ దగ్గర పనిచేశా. ఈ చిత్రానికి క్లాసికల్ టచ్ ఉన్న వెస్ట్రన్ మ్యూజిక్ అందించా’’ అని ప్రశాంత్ విహారి చెప్పారు. -
నచ్చింది... అందుకే ముందుకొచ్చా
ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం ‘వెళ్లిపోమాకే’. యాకూబ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘పెద్ద చిత్రాల్లో ‘బాహుబలి’, చిన్న చిత్రాల్లో ‘పెళ్లి చూపులు’ ఘన విజయం సాధించి తెలుగు సినిమా గమనం మారుతోందని నిరూపించాయి. ఫీల్‌గుడ్ ప్రేమ కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఈ చిత్రం నాకు నచ్చడంతో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తీసుకెళ్లాలని మా బ్యానర్లో విడుదల చేస్తున్నా. హీరో విశ్వక్ సేన్ నటన బాగుంది. కొత్త టీమ్ కలిసి సరికొత్తగా చేసిన ప్రయత్నమిది. మంచి కథతో వస్తున్న ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ఈ తరహా చిత్రాలు మరిన్ని వస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల కిందట ప్రారంభించిన ఈ సినిమా ఇప్పటికి పూర్తయింది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మా చిత్రం నచ్చి, విడుదల చేసేందుకు ‘దిల్’ రాజుగారు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. హీరో విశ్వక్ సేన్, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement