-
తెలుగు క్లాసిక్స్: విజయా వారి వేసవి
పిల్లలకు సెలవులు. ఈసారి ‘విజయా’ వారి వేసవి చూపించండి. అంటే? విజయ సంస్థ తీసిన సినిమాలు చూపించడమే. ఉపాయంతో మాంత్రికుణ్ణి హతమార్చే తోటరాముణ్ణి ‘పాతాళ భైరవి’లో, రాజ్యం లేకపోయినా శౌర్యానికి ఢోకా ఉండకూడదని చెప్పే అభిమన్యుడిని ‘మాయాబజార్’లో, లౌక్యం ఉంటే పనులు సాధ్యమవుతాయని చూపే ఎంటి.రావు, మేరీలను ‘మిస్సమ్మ’లో, గట్టిగా సంకల్పిస్తే ఏ కోరికైనా నెరవేర్చుకోవచ్చనే రాకుమారుడు ప్రతాప్‌ను ‘జగదేక వీరుని కథ’లో పరిచయం చేయడమే. పిల్లలకు ఈ సినిమాలు వినోదం మాత్రమే ఇవ్వవు... జీవన సూత్రాలను చెబుతాయి. తెలుగు మాట, పలుకు నేర్పుతాయి. ఇంకేటి... టివి ముందు కూచోబెట్టండి. ‘సాహసం సేయరా ఢింబకా’ అంటాడు నేపాళ మాంత్రికుడు ‘పాతాళ భైరవి’లో. సాహసం చేయకుండా ఉట్టినే కూచోడానికి కాదు పుట్టింది. చదువులోనో, ఉద్యోగంలోనో, బతుకులోనో ఏదో ఒక సందర్భంలో సాహసం చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. రాకుమారి కూడా. కాని సాహసం చేసే దారిలో ఎన్నో అడ్డంకులుంటాయి. మనల్ని కాటేసే పాములుంటాయి. వాటి తల అణచాలి. ‘దేవికి సాష్టాంగ దండ ప్రమాణం సేయరా’ అంటాడు మాంత్రికుడు రాకుమారుడితో. సాష్టాంగపడితే తల నరకాలని అతడి దుష్టపన్నాగం. కాని దేవి సలహా వల్ల రాకుమారుడు ఆ మాంత్రికుణ్ణే సాష్టాంగపడటం ఎలాగో చూపమని చెప్పి అదే అదనుగా ఆ దుర్మార్గుడి తల నరుకుతాడు. ఇదంతా పిల్లలకు పాఠమే. ‘పాతాళ భైరవి’ చూస్తే వారికి సమయస్ఫూర్తి వస్తుంది. ప్రమాదం నుంచి బయటపడటం తెలుస్తుంది. మొదట కష్టాలు ఎదురైనా గట్టిగా కష్టపడితే విజయం వరిస్తుందని కూడా తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కనిపించే ముచ్చటైన జానపద చిత్రం ఇది. ‘జగదేక వీరుని కథ’లో అర్ధరాత్రి అడవిలో నిదురిస్తుంటాడు రాకుమారుడు ఎన్.టి.ఆర్. తోడు రేలంగి. రెండు దెయ్యాలు వీరిని ఆటపట్టించడానికి బయలుదేరుతాయి. ఆ అరుపులు ఈ అరుపులు అరిచి రేలంగిని భయభ్రాంతం చేస్తాయి. కాని రాకుమారుడు భయపడతాడా? వాటి పిలకపట్టి సీసాలో బంధిస్తాడు. మూడు కోర్కెలు నెరవేరిస్తేనే వదులుతానంటాడు. వాటినే వాహనంగా చేసుకుని తాను వెళ్లాల్సిన చోటుకు వెళతాడు. దెయ్యాలు భూతాలు మనం భయపడే వరకే. మనం ధైర్యంగా ఉంటే వాటి పని అంతే. ఇదే సినిమాలో మూర్ఖపురాజు రాజనాల ఉంటాడు. అతడు రాకుమారుణ్ణి మంటల్లో తోద్దామనుకుంటే రాకుమారుడే తెలివిగా అతణ్ణి మంటల పాలు చేస్తాడు. పిల్లలకు ‘జగదేక వీరుని కథ’ మంచి కాలక్షేపం. క్లయిమాక్స్‌లో ఒకే రామారావు ఐదుగురిలా మారి పాడే ‘శివశంకరి’ పాట వాళ్లు ఇప్పుడూ ఎంజాయ్ చేస్తారు. మిస్సమ్మలో డిటెక్టివ్ ఏఎన్ఆర్ చాలా చురుగ్గా ఉంటాడు. చిన్నప్పుడు తప్పిపోయిన సావిత్రిని వెతికే పని అతనిదే. అతను వెతుకున్నది సావిత్రినే అన్నది మొదటి రీలులోనే తెలిసిపోతుంది. పిల్లలు కూడా నాగేశ్వరరావుతో పాటు సావిత్రిని ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాలని చూస్తుంటారు. బతుకు బాదరబందీ కోసం ఎన్.టి.ఆర్, సావిత్రిలు ఆడే దొంగ నాటకాల వంటివి అవసరమే అన్నది తెలుసుకుంటారు. స్త్రీలతో ఎంత చక్కగా వ్యవహరించాలో కూడా. ఈ సినిమాలో ఎన్టిఆర్ సావిత్రితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. బతకనేర్చిన రేలంగి కూడా వాళ్లు తెలుసుకోదగ్గ మోడలే. ఇక ‘జస్టిస్... జస్టిస్... ఐ వాంట్ జస్టిస్’ అంటూ తిరిగే అసలు సిసలు కేటుగాడు రమణారెడ్డిని కూడా వాళ్లు గమనిస్తారు. కొందరికి ముక్కు మీద కోపం వున్నా వారి మనసు మంచిది అని సావిత్రిని చూసి అర్థం చేసుకుంటారు. వెన్నెలను చూసి ‘రావోయి చందమామ’ అని పాడటం కూడా. ఇక ‘మాయాబజార్’లో పిల్లలకు నచ్చనిది ఏది? కృష్ణుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, శకుని... అందరూ వారి అభిమాన పాత్రలే. బాణం కొట్టి మెట్లు కట్టడం, ప్రియదర్శినిలో నచ్చిన మనుషులతో వీడియో కాల్, మనుషులు డబ్బుంటే ఒక లాగా డబ్బు లేనప్పుడు ఒకలాగ వ్యవహరిస్తారని చెప్పే రేవతి (ఛాయాదేవి) పాత్ర, అన్నింటినీ చక్రం తిప్పే శ్రీకృష్ణుడు, అమాయకంగా ఉండి అసాధ్యుడిగా మారే ఘటోత్కచుడు... అతని మాయలు... పొగడ్తలతో బతికిపోయే శర్మ, శాస్త్రులు, నోరు తిరగని రాక్షస శిష్యులు, తమాషా గురువు చిన్నమయ్య... ఈ వేసవిలో పిల్లలు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడాల్సిన సినిమాలు. ఈ సినిమాలలో మూడిటికి కె.వి.రెడ్డి, ఒకదానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. అన్నింటిని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. పింగళి నాగేంద్రరావు కొత్త కొత్త మాటలు కనిపెట్టడం నేర్పుతారు. ఆహ్లాదం ఇచ్చే వినోదం ఎలా ఉంటుందో ఈ సినిమాలు చూపుతాయి. పిల్లలకు తప్పక చూపించండి. -
విజయా సంస్థలో విక్రమ్?
తమిళసినిమా: విజయా ప్రొడక్షన్స్ సంస్థలో సియాన్ విక్రమ్ నటించనున్నారా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే టాక్ వినిపోస్తోంది. ఎన్నో గొప్ప కళాఖండాలను భారతీయ సినీ ప్రేక్షకులకు అందించిన సంస్థ విజయాప్రొడ„క్షన్స్. ఎంజీఆర్ నుంచి ఇప్పటి విజయ్ వరకూ భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇటీవల నిర్మించిన చిత్రం భైరవా. కాగా ఈ సంస్థ అధినేతలు బి.వెంకటరామిరెడ్డి మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో సియాన్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. విక్రమ్ ప్రస్తుతం విజయ్‌చందర్ దర్శకత్వంలో స్కెచ్ చిత్రాన్ని పూర్తి చేసి గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత హరి దర్శకత్వంలో సామి–2 చిత్రం చేయనున్నారు. తదుపరి కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. సూర్య హీరోగా అయన్, మాట్రాన్, ధనుష్‌తో అనేగన్, ఇటీవల విజయ్‌సేతుపతి కథానాయకుడిగా కవన్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన కేవీ.ఆనంద్ ఇటీవల నటుడు విక్రమ్‌ను కలిసి కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో అందులో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు, ఈ చిత్రాన్ని విజయాప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
ఇళయదళపతి దుమ్మురేపే ఇంట్రో సాంగ్
ఇళయదళపతి విజయ్ చిత్రాల్లో ఆయన అభిమానులను ఖుషీ పరిచే దుమ్మురేపే ఇంట్రోసాంగ్ చోటు చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. విజయ్ ఇంట్రో సాంగ్స్ అన్నీ విశేష ఆదరణ పొందాయన్నది గమనార్హం. అలాంటి సాంగ్ ఆయన తాజా చిత్రంలోనూ ఉంది. విజయ్ భైరవా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. కీర్తీసురేశ్ నాయకి. అపర్ణా వినోద్, జగపతిబాబు, సతీష్, డేనియల్ బాలాజీ, శ్రీమాన్, వైజీ.మహేంద్రన్, హరీష్ ఉత్తమన్, తంబిరామయ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. విజయ్ ఇంత వరకూ పలు చిత్రాల్లో నటించినా భైరవా చిత్రం లాంటి కథా చిత్రంలో ఆయన ఇంత వరకూ నటించలేదని దర్శకుడు అంటున్నారు. చిత్రంలో సమాచారానికి అవసరం అయిన విషయం, నేటి తరానికి కావలసిన అంశాలు ఉన్నాయని తెలిపారు. కాగా భైరవా చిత్రంలో మొత్తం ఐదు గీతాలు ఉంటాయట. వాటన్నిటినీ గీత రచయిత వైరముత్తునే రాశారు. అందులో పట్టైయ కిలప్పు పట్టైయ కిలప్పు పట్టి తొట్టి ఎలామ్ అనే ఇంట్రో సాంగ్ ఉందట. ఈ సాంగ్‌ను ఇటీవలే బిన్ని మిల్లులో చిత్రీకరించారు. ఇందులో విజయ్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ, హేయ్ బ్రో హిందీ చిత్రం ఫేమ్ నుపుర్‌శర్మ స్టెప్లు వేశారని తెలిసింది. -
20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ
వీరం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆరంభం చిత్రం తరువాత అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న చిత్రం వీరం. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరువై శివా దర్శకుడు. నటి తమన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. యువతను అలరించే విధంగా రూపొందిన ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రం పాటలే కాదు చిత్రం కూడా జనరంజకంగా రూపొందిందని ముఖ్యంగా అజిత్ పాత్ర చాలా వైవిద్యభరితంగా ఉంటుందని, దర్శకుడు శివ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement