-
విజయపురలో పరువు హత్య?
యశవంతపుర: ప్రేమ విషయంగా ఓ యువకుడిని హత్య చేసిన ఘటన విజయపుర జిల్లా తికోటా పరిధిలో కలకలం రేపింది. తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన యువకుడు మల్లికార్జున (19) బాగలకోట జిల్లా బీళగి తాలూకా హదరిహళ గ్రామం వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతంలో గోనసంచిలో శవమై కనిపించాడు. మూడు రోజుల క్రితం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. సహ విద్యార్థినితో ప్రేమ వివరాలు...ఘోణసగినకి చెందిన మల్లికార్జున బీఏ చదివేవాడు. సహ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరు కాలేజీకి వెళ్తున్నామంటూ విజయపుర వెళ్లేవారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియటంతో మొదట చదువు.. ఆ తరువాతే ప్రేమ అంటూ సర్ది చెప్పారు. పెద్దల మాటలను పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమాయణం సాగించారు. దీంతో తల్లిదండ్రులు మల్లికార్జునను బాగలకోట జిల్లా బనహట్టిలోని మిలిటరీ కాలేజీలో చేర్చారు. ఇద్దరు రోజూ ఫోన్లో గంటలకొద్ది మాట్లాడేవారు. ఇదిలా ఉంటే బీఏ పరీక్షలు రాయడానికి మల్లికార్జున గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ అదృశ్యం సెప్టెంబర్ 23న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. తన కూతురిని కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు కనిపించటంలేదంటూ మల్లికార్జున తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అక్టోబర్ 10న కృష్ణానది పరివాహక ప్రాంతంలో మల్లికార్జున శవాన్ని కనుగొన్నారు. యువతి ఎక్కడ ఉందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యువతి కుటుంబం ధనవంతులు కావటం వల్ల పరువు కోసం తన కొడుకును హత్య చేయించినట్లు యువకుని తండ్రి ఆరోపించారు. దీంతో తికోటా పోలీసులు యువతి తండ్రి గురప్ప, బంధువు అజీత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. (చదవండి: స్టోన్ క్రషర్లో భారీ పేలుడు) -
బెల్టుతో వాతలు తేలేలా కొట్టి..ఎస్సై ఓవరాక్షన్!
-
సాగర్మాత ఘాట్ వద్ద యువతి మృతదేహం
విజయపురి (సౌత్) : గుంటూరు జిల్లా విజయపురి సౌత్ స్థానిక సాగర్మాత దేవాలయం ఘాట్ వద్ద మంగళవారం ఓ యువతి(24)మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి 7గంటల సమయంలో ఓ యువతి హడావుడిగా సాగర్మాత ఘాట్ మెట్లు దిగుతూ కృష్ణా జలాశయం వద్దకు వెళ్తుండగా.. అదే సమయంలో ముగ్గురు భక్తులు జలాశయంలో స్నానం చేసి తిరిగి వస్తున్నారు. యువతిని గమనించిన ఆ వ్యక్తులు ఈ సమయంలో నది వద్దకు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారు. ఆ యువతి ఆగకుండానే జలాశయం చూసేందుకు వెళ్తున్నానంటూ వెళ్ళిపోయింది. కాగా ఆ వ్యక్తులు గుడి వద్దకు వెళ్లి వాచ్మెన్, సెక్యూరిటి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు హుటాహుటిన టార్చ్‌లైట్స్‌ను తీసుకొని జలాశయం ఒడ్డున వెతికినా ఆ యువతి జాడ తెలియలేదు. కాగా మంగళవారం ఉదయం ఘాట్ సమీపంలో మృతదేహం బయటపడింది. నది ఒడ్డున యువతికి సంబంధించిన నల్లటి హ్యాండ్‌బ్యాగ్, లంచ్‌బాక్స్ ఉన్నాయి. బ్యాగ్‌లో హైదరాబాద్ బిహెచ్ఇఎల్ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్ బస్‌పాస్ ఉంది. ఆ బస్‌పాస్ సౌజన్య అనే పేరు మీద ఉంది. బస్‌పాస్ మీద ఉన్న సెల్‌ఫోన్ నెంబర్, అడ్రస్‌ఫ్రూఫ్‌ను విజయపురి సౌత్ పోలీసులు విచారించగా డి కోటేశ్వరావు, హౌస్‌నెంబర్18-92/1 వెంగళాయపాలెం, గుంటూరు, గుంటూరు జిల్లా పేరు మీద తీసుకున్నట్లు ఉంది. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉన్నాయి. బహుశా ఆ ఫోటోలు ఆ అమ్మాయివే అయ్యి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఆ బ్యాగ్‌లో కూకట్పల్లి కల్వరిగిరి టెంపుల్ తాత్కాలిక సభ్యత్వ నెంబర్ జె4108 రాసి ఉంది. పోలీసులు కార్డు మీద ఉన్న నెంబర్ ఆధారంగా కల్వరిగిరికి ఫోన్ చేయగా సభ్యత్వ నమోదులో బిహెచ్ఈఎల్, చందనానగర్ అని మాత్రమే ఉందని చెప్పారు. యువతి ఒంటి మీద ఎరుపు, నలుపు రంగుల పంజాబీ డ్రస్ ఉంది. గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలానికి చెందిన యువతి అయ్యి ఉండవచ్చని పోలీసులకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా మృతదేహాన్ని సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. విజయపురి సౌత్ ఎస్ఐ వై.కోటేశ్వరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement